మద్యందుకాణాలు తెరుచుకోవడంతో దేశ వ్యాప్తంగా దుకాణాల వద్ద జనం మద్యం కోసం గుంపులుగా గుమికూడడంతో లాక్ డౌన్ ఉద్దేశ్యం నిర్వీర్యమై, కరోనా వైరస్ మరింతగా విజృభింస్తుందని వెల్లడవుతున్న ఆందోళనలకు సుప్రీం కోర్ట్ స్పందించింది. ఇక నుండి ఇంటి వద్దకే మద్యం సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.
ఈ విషయమై విధానపర నిర్ణయం తీసుకోవలసింది రాష్ట్ర ప్రభుత్వాలే అని స్పష్టం చేస్తూ మద్యం అమ్మకాల నిషేధానికి మాత్రం విముఖత తెలిపింది. ఈ అంశంపై వేసిన పిల్‌పై విచారణ చేబడుతూ ఆన్ లైన్ లో మద్యం అమ్మకాలు జరపవచ్చని సూచించింది.
అష్ట దిగ్బంధంలో 3 జిల్లాలు! ఎందుకంటే..
ఇప్పటికే చండీఘర్ లో ప్రభుత్వం ఈ విధంగా చేస్తున్నది. ఛత్తీస్ ఘర్ ప్రభుత్వం కూడా ఈ పద్ధతి పట్ల సుముఖత వ్యక్తం చేసింది.
జస్టిస్ అశోక్ భూషణ్, సంజయ్ కృష్ణ కౌల్, బీఆర్ గవిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ సూచన చేసింది. మద్యం కొనుగోలు సమయంలో చాలాచోట్ల భౌతిక దూరం పాటించడం లేదని, అందువల్ల మద్యం అమ్మకాలపై నిషేధం విధించాలని సుప్రీంలో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.
గ్యాస్ లీక్ వెనుక విజయసాయి రెడ్డి!
మార్చి 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ వల్ల మద్యం షాపులు మూతపడ్డాయి. అయితే నాలుగు రోజుల నుంచి కొన్ని రాష్ట్రాలు మద్యం అమ్మకాలను మొదలుపెట్టాయి. దీంతో జనం ఒక్కసారిగా షాపుల ముందు చేరుకుంటున్నారు. కిలోమీటర్ల కొద్ది క్యూలైన్లు ఉంటున్నాయి.
అయితే.. రాష్ట్రాలు మద్యం అమ్మకాలకు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను పాటించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. రాష్ట్రాలు మద్యం అమ్మకాలకు ఆన్‌లైన్ విధానాన్ని అనుసరించాలని, ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకున్న వారికి మద్యాన్ని హోం డెలివరీ చేయాలని సుప్రీం కోర్టు రాష్ట్రాలకు సూచించింది.