కేసీఆర్ ఫోటోకి పాలాభిషేకం!

రాష్ట్రంలో రైతులకు రుణామాఫీ డబ్బులను విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేఖం చేశారు.రైతు రుణమాఫీకి రూ.1200 కోట్ల విడుదల చేసినందుకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాలాభిషేకాలు నిర్వహించారు. జిల్లాలోని నకిరేకల్, కట్టంగూర్, కేతేపల్లిలో రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ పాలాభిషేకం చేశారు. అటు నాగర్‌ కర్నూలు […]

Written By: Neelambaram, Updated On : May 8, 2020 4:23 pm
Follow us on

రాష్ట్రంలో రైతులకు రుణామాఫీ డబ్బులను విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేఖం చేశారు.రైతు రుణమాఫీకి రూ.1200 కోట్ల విడుదల చేసినందుకు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పాలాభిషేకాలు నిర్వహించారు. జిల్లాలోని నకిరేకల్, కట్టంగూర్, కేతేపల్లిలో రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేసిన సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ పాలాభిషేకం చేశారు. అటు నాగర్‌ కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ లో ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు…కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

రైతుల సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేటీఆర్ ట్వీట్‌ చేశారు. రైతు రుణమాఫీకి రూ.1200 కోట్ల విడుదలకు సీఎం కేసీఆర్‌ ఆదేశించిన నేపథ్యంలో రైతు రుణమాఫీ కింద 5.50 లక్షల మంది లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. వానాకాలం రైతుబంధుకు కూడా రూ. 7 వేల కోట్ల విడుదల చేయడంతో ఈ పథకం కింద 57 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. రైతుల ఖాతాల్లో రెండు, మూడు రోజుల్లో నగదు జమ కానుందని కేటీఆర్‌ తెలిపారు.