ప్రభుత్వ విధానాలకు వలస కూలీలు ఫిదా!

కరోనా నేపథ్యంలో లాక్‌ డౌన్ సందర్భంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకొనిపోయిన వలస కూలీలు సొంత రాష్ట్రాలకు తిరిగి వస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటోన్న చర్యలపై సంతృప్తి చెందిన వీరు తెలంగాణకు ఉత్సాహంగా వస్తున్నారు. తొలి విడతగా బీహార్ నుండి 225 మంది వలస కూలీలు హైదరాబాద్‌ కు చేరుకున్నారు. దేశవ్యాప్తంగా వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు తరలి వెళ్తున్న తరుణంలో తెలంగాణా ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో ఉన్న వలస కూలీలు ఇతర రాష్ట్రాలకు, […]

Written By: Neelambaram, Updated On : May 8, 2020 4:05 pm
Follow us on

కరోనా నేపథ్యంలో లాక్‌ డౌన్ సందర్భంగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకొనిపోయిన వలస కూలీలు సొంత రాష్ట్రాలకు తిరిగి వస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటోన్న చర్యలపై సంతృప్తి చెందిన వీరు తెలంగాణకు ఉత్సాహంగా వస్తున్నారు. తొలి విడతగా బీహార్ నుండి 225 మంది వలస కూలీలు హైదరాబాద్‌ కు చేరుకున్నారు.

దేశవ్యాప్తంగా వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు తరలి వెళ్తున్న తరుణంలో తెలంగాణా ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రంలో ఉన్న వలస కూలీలు ఇతర రాష్ట్రాలకు, ఇతర రాష్ట్రాలలో ఉన్న తెలంగాణ వాసులు తెలంగాణలోకి వస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లిన వలస కూలీలు తిరిగి హైదరాబాద్ చేరుకుంటున్నారు. బీహార్ రాష్ట్రంలోని ఖగారియా నుంచి కూలీలు ప్రత్యేక శ్రామిక్ ఎక్స్‌ప్రెస్ రైలులో లింగంపల్లి స్టేషన్‌ కు చేరుకున్నారు.

వలస కూలీల రాకను రాష్ట్ర ప్రభుత్వ నోడల్ అధికారి సందీప్ కుమార్, సైబరాబాద్ సీ.పీ సజ్జనార్ స్వయంగా పర్యవేక్షించారు. బీహార్ నుంచి తిరిగి వచ్చిన వలస కూలీలకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పుష్పాలతో స్వాగతం పలికారు. ప్రదానంగా రైస్ మిల్లులలో పనిచేయడానికి వీరంతా వచ్చారని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ కూలీలను రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు ప్రత్యేక బస్సులలో తరలిస్తున్నారు. వైద్య పరీక్షల నిర్వహణ అనంతరం వీరిని సంబంధిత జిల్లాలకు తరలిస్తున్నారు. కూలీలకు మంచినీళ్లు, ఫుడ్ ప్యాకెట్లు, మాస్కులు కూడా అందజేశారు.