
కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న వైద్యులు, సిబ్బందిని అద్దె ఇళ్ల యజమానులు ఖాళీ చేయాలంటూ బెదిరిస్తున్న వ్యవహారంపై ఏపీ హైకోర్టు స్పందించింది. సంబంధిత వైద్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా యజమానులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎం. సత్యనారాయణ మూర్తితో కూడిన ధర్మాసనం వివిధ అంశాలపై ఇటీవల విచారణ జరిపి ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న వైద్య సిబ్బందికి వ్యక్తిగత రక్షణ పరికరాలు (పీపీఈ), ఇతర సౌకర్యాలు కల్పించాలంటూ తాము జారీ చేసిన ఉత్తర్వులు అమలయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మార్కెట్లు, రైతుబజార్లు, కోర్టు ప్రాంగణాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో క్రిమి సంహారక టన్నెల్స్ ఏర్పాటు చేసే అంశంపై వారంలో వివరాలు సమర్పించాలని కోరింది. బయోమెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్’ నిబంధనల ప్రకారం ఆసుపత్రుల్లో వ్యర్థాల్ని నిర్వీర్యం చేయాలని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాలు, మార్కెట్లవద్ద ప్రజలు సామాజిక దూరం పాటించే అంశంపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొంది. రాజకీయ నాయకులు బహిరంగ సమావేశాలు నిర్వహించకుండా నిలువరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించింది. నిర్వహిస్తే చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకుని ఆ వివరాల్ని కోర్టుకు సమర్పించాలని స్పష్టం కోరింది.
అద్దె ఇళ్లు ఖాళీ చేయమంటే చర్యలే..!
Most Popular
India student protests : నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ల నమూనా భారత్ లో ఎందుకు సక్సెస్ కాదు?
India student protests : దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ప్రారంభంలో వందల సంఖ్యలో సాగిన నిరసనలు ఇప్పుడు వేలాదిమందిని ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వ్యవహారం, పరీక్షల పారదర్శకతపై...
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఓపెనింగ్ రికార్డు ని బ్రేక్ చేయకుండానే రిటైర్ అయిపోయిన సీఎం విజయ్..
Pawan Kalyan : ఈమధ్య కాలం లో సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ , విజయ్ ల మధ్య పోలికలు పెడుతూ , అభిమానుల మధ్య జరుగుతున్న ఫ్యాన్ వార్స్ ని మన...
Anil Ravipudi Movie : వెంకటేష్ , అనిల్ రావిపూడి కొత్త సినిమా మేకింగ్ వీడియో వచ్చేసింది.. ఈ...
Anil Ravipudi Movie : వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో రీసెంట్ గానే ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. కీర్తి సురేష్ , కృతి శెట్టి...
Revanth Reddy : మేడిగడ్డలో కాలేసిన రేవంత్‌రెడ్డి.. మొన్న లిఫ్టింగ్ కుదరదని.. నేడు కేంద్రానికి లేఖ!
Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై ఎప్పుడు తనదే పైచేయి అని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్షం రేవంత్ ఏ మిషయంలోనూ తమకు పోటీ కాదని విమర్శలు...
R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..
R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...








