మద్యం అమ్మకాలపై ఆత్మరక్షణలో జగన్ ప్రభుత్వం

లాక్ డౌన్ కు కొద్దిపాటి సడలింపుకు అవకాశం లభించగానే మద్యం అమ్మకలకు అనుమతి ఇవ్వడం ద్వారా వై ఎస్ జగన్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది. మొదట్లో కరోనా వైరస్ కట్టడి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా గత రెండు వారాలుగా టెస్ట్ లను పెంచి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న సమయంలో ఇప్పుడు అత్యధికంగా మద్యం అమ్మకాలు చేయడంలో పేరు పొందే పరిస్థితి నెలకొన్నది. ముఖ్యంగా ఐదేళ్లలో సంపూర్ణ మధ్య నిషేధం నినాదంతో అధికారంలోకి రావడంతో, కొద్దికాలం […]

Written By: Neelambaram, Updated On : May 5, 2020 3:12 pm
Follow us on


లాక్ డౌన్ కు కొద్దిపాటి సడలింపుకు అవకాశం లభించగానే మద్యం అమ్మకలకు అనుమతి ఇవ్వడం ద్వారా వై ఎస్ జగన్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నది. మొదట్లో కరోనా వైరస్ కట్టడి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినా గత రెండు వారాలుగా టెస్ట్ లను పెంచి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న సమయంలో ఇప్పుడు అత్యధికంగా మద్యం అమ్మకాలు చేయడంలో పేరు పొందే పరిస్థితి నెలకొన్నది.

ముఖ్యంగా ఐదేళ్లలో సంపూర్ణ మధ్య నిషేధం నినాదంతో అధికారంలోకి రావడంతో, కొద్దికాలం పాటు మద్యం ప్రజలకు దూరం చేసే అవకాశాన్ని వదులు కోవడంతో నైతిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఘనంగా ‘జగనన్న బీరు పండుగ’..

అసలే లాక్ డౌన్ కారణంగా ఆర్ధిక కార్యక్రమాలు స్తంభించిన సమయంలో కేవలం ప్రభుత్వం ఆదాయం కోసం మొదటి రోజు 25 శాతం, రెండో రోజు 50 శాతం చొప్పున మద్యం ధరలు పెంచడం ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని ప్రశ్నించేటలంటూ చేస్తున్నది.

మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వడంపై జన్యసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యంగ్యంగా ట్వీట్ చేస్తూ ఏపీలోని వైసీపీ సర్కార్ ‘కరోనా ఫ్రెండ్లీ’ అంటూ ఎద్దేవా చేశారు.

సంపూర్ణ మద్యపాన నిషేధం పేరుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ .. ఆ తర్వాత దశలవారీ అంటూ దానిలో మార్పు చేసుకుందని ధ్వజమెత్తారు. కోవిడ్ -19 రూపంలో వచ్చిన అవకాశాన్ని.. మద్యపాన నిషేధానికి వినియోగించుకోకుండా మద్యం దుకాణాలను తెరిచిందని ఆరోపించారు.

మద్యం ప్రియులపై మరో పిడుగు..!

కేవలం ఎంపిక చేసిన బ్రాండ్ లను మాత్రమే అమ్ముతూ, వాటి ధరలను పలు రేట్లు పెంచుతూ ఉండడం చూస్తుంటే ఆయా మద్యం తయారీ కంపెనీలతో లోపాయికారి అవగాహనలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

రాష్ట్రంలో పలుచోట్ల మహిళలు మద్యం దుకాణాలు తెరవడంపై నిరసనగా రోడ్లపైకి రావడం ప్రభుత్వానికి చికాకు కలిగిస్తున్నది. ముఖ్యంగా విశాఖపట్నం తోటగరువులో మహిళులు లాక్ డౌన్ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వైన్ షాపులు తెరవద్దంటూ షాపుల ఎదుట ఆందోళనకు దిగారు. దేవాలయాలు, సినిమా హాళ్లు, హోటళ్లను మూసివేసి మద్యం షాప్ లను మాత్రమే తెరవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు..!

ఫెళ్లికి 50 మంది మించి గుమికూడదని, చావు దగ్గర 20 మంది మించి రాకూడదని ఆంక్షలు విధిస్తున్న ప్రభుత్వం మద్యం షాపుల వద్ద ఎటువంటి ఆంక్షలు లేకపోవడం ఏమిటనే ప్రశ్న తలెత్తుతున్నది.

రేషన్ షాప్ లను రెండు, మూడు గంటలు మాత్రమే తెరుస్తూ, వైన్ షాపు వద్ద ఉయదం 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జనాలు సామాజిక దూరం పాటించకుండా నిలబడటం ఏమిటనే ప్రశ్నలు ముందుకు వస్తున్నాయి.

మద్యం షాపుల వద్ద క్యూలు నిర్వహించడానికి పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల సేవలు ఉపయోగించుకోవడం పట్ల ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విస్మయం వ్యక్తం చేశారు.