ఓటీటీలో రానున్న కాజల్‌ ‘ప్యారిస్‌ ప్యారిస్‌’!

భాషతో సంబంధం లేకుండా భారత సినీ పరిశ్రమలన్నీ మూడు, నాలుగు నెలలుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కొవిడ్‌ దెబ్బకు థియేటర్లు మూత పడడం, షూటింగ్స్‌ ఆగిపోవడంతో ఇండస్ట్రీ కుదేలైంది. ఇప్పటికే షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకొని ఫస్ట్‌ కాపీతో రెడీ ఉన్న చిత్రాలు కూడా రిలీజ్‌ చేసే అవకాశం లేకుండా పోయింది. ఓటీటీల రూపంలో ప్రత్యామ్నాయం అందుబాటులో ఉన్నా భారీ బడ్జెట్‌ చిత్రాలు, స్టార్ హీరోల సినిమాల విషయంలో మూవీ మేకర్స్‌ ఇంకా వేచి చూస్తున్నారు. చిన్న చిత్రాలను […]

Written By: Neelambaram, Updated On : July 19, 2020 7:35 pm
Follow us on

భాషతో సంబంధం లేకుండా భారత సినీ పరిశ్రమలన్నీ మూడు, నాలుగు నెలలుగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కొవిడ్ దెబ్బకు థియేటర్లు మూత పడడం, షూటింగ్స్‌ ఆగిపోవడంతో ఇండస్ట్రీ కుదేలైంది. ఇప్పటికే షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకొని ఫస్ట్‌ కాపీతో రెడీ ఉన్న చిత్రాలు కూడా రిలీజ్‌ చేసే అవకాశం లేకుండా పోయింది. ఓటీటీల రూపంలో ప్రత్యామ్నాయం అందుబాటులో ఉన్నా భారీ బడ్జెట్‌ చిత్రాలు, స్టార్ హీరోల సినిమాల విషయంలో మూవీ మేకర్స్‌ ఇంకా వేచి చూస్తున్నారు. చిన్న చిత్రాలను మాత్రం వచ్చిన రేటుకు అమ్ముకొని డిజిటల్‌ రిలీజ్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పోస్ట్‌ ప్రొడక్షన్‌ కంప్లీట్‌ చేసుకొని, వివిధ కారణాలతో విడుదల కాలేకపోయిన చిత్రాలు కూడా కరోనా పుణ్యమా అని ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ జాబితాలో స్టార్ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ ఫస్ట్‌ టైమ్‌ ఫీమేల్‌ లీడ్‌ రోల్‌ పోషించిన చిత్రం కూడా ఉంది.

Also Read:ఎన్టీఆర్ మూవీతో తెలుగులోకి జాన్వీ

హిందీలో సెన్సేషనల్‌ హిట్‌ మూవీ ‘క్వీన్‌’ను తమిళ్‌, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో నలుగురు స్టార్ హీరోయిన్లతో వేర్వేరు దర్శకులు రీమేక్‌ చేశారు. తమిళంలో ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ పేరుతో రూపొందిన ఈ చిత్రంలో నటి కాజల్‌ అగర్వాల్‌ లీడ్‌ రోల్‌లో నటించింది. తెలుగులో తమన్నా హీరోయిన్‌గా ప్రశాంత్‌ వర్మ డైరెక్షన్‌లో ‘దట్‌ ఈజ్‌ మహాలక్ష్మి’ పేరుతో తెరకెక్కింది. మలయాళంలో మంజిమా మోహన్‌ ప్రధాన పాత్రల్లో ‘జామ్‌జామ్‌’ టైటిల్‌తో, కన్నడలో పరుల్‌ యాదవ్‌ లీడ్‌ రోల్‌లో ‘ బటర్‌ ప్లై’ పేరునూ రూపొందించారు. నాలుగు భాషల్లోనూ చిత్రీకరణ పూర్తయ్యాయి. కానీ, తమిళ్‌లో వస్తున్న ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ విషయంలో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. ప్రొడక్షన్‌తో పాటు సెన్సార్ విషయంలో ఇబ్బందులు వచ్చాయి.

Also Read: జులై 26, రాత్రి 8.30కు బ్యాచ్‌లర్ లైఫ్కు నితిన్‌ గుడ్‌బై

రివైజింగ్‌ కమిటీకి వెళ్లి సెన్సార్‌ సర్టిఫికెట్‌ తీసుకోవాల్సి వచ్చిన ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ మూవీ ట్రైలర్ను గతేడాది విడుదల చేశారు. తమన్నా ‘దటీజ్‌ మహాలక్షి’ తెలుగు టీజర్ కూడా ఎప్పుడో రిలీజైంది. మాతృక ఒకటే కావడంతో అన్ని నాలుగు రీమేక్స్‌ను ఒకేసారి రిలీజ్‌ చేయాలని భావించారు. అయితే, మిగతా భాషల సంగతి ఎలా ఉన్నా తమిళ్‌లో ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ మూవీని ఓటీటీ ద్వారా రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. వీలైతే నాలుగు భాషల చిత్రాలను ఒకేసారి ఓటీటీలో విడుదల చేయాలని కూడా ప్లాన్‌ చేస్తున్నారు. అయితే, దటీజ్‌ మహాలక్షి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పూర్తి కావాల్సి ఉంది. మరి, నాలుగు సినిమాలు ఒకేసారి వస్తాయా.. కాజల్‌ ‘ప్యారిస్‌ ప్యారిస్‌’ ముందుగా రిలీజవుతుందా అన్నది చూడాలి.