Good news for rural farmers : భారతదేశంలో వ్యవసాయాన్ని చేసే రైతులు 70 శాతం మంది ఉన్నారు. వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమ పై కూడా ఆధారపడేవారు చాలామంది ఉన్నారు. అయితే ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ చదువుకోవడంతో వ్యవసాయాన్ని దూరం పెడుతున్నారు. కానీ కొందరు మాత్రం వ్యవసాయంపై మక్కువతో కొత్త కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు. అయితే వ్యవసాయంతో పాటు పాడి పరిశ్రమలను కూడా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రైతులకు తోడ్పాటు అందిస్తోంది. పశువులు పెంపకం కోసం ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దాని పేరే ‘పశుపాలం లోన్’. ఈ పథకం ద్వారా రైతులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తూ పాడి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ పథకం ఏ రైతులకు వర్తిస్తుంది? దీని వివరాలు ఏంటో తెలుసుకుందాం..
Also Read : అజిత్ డోభాల్ : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టాడు
గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రైతులు వ్యవసాయంతో పాటు పశువులను కూడా పెంచుతూ ఉంటారు. వీటి ద్వారా వచ్చే పాలు విక్రయిస్తూ ఆదాయాన్ని పెంచుకుంటూ ఉంటారు. అయితే తమ వ్యాపారాన్ని విస్తరించాలని అనుకునే రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు పశుపాలన్ లోన్ కింద రుణం మంజూరు చేస్తారు. దేశంలో పాల ఉత్పత్తిని పెంచడంతోపాటు, గ్రామాల్లో ఉపాధిని పెంచడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అంతేకాకుండా రైతులు కేవలం వ్యవసాయంపైనే ఆధారపడి ఉండకుండా ప్రత్యామ్నాయంగా ఆదాయం సమకూర్చుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో భాగంగా ప్రభుత్వం నాబార్డ్ సహాయంతో జంతువుల రకాన్ని బట్టి రుణాలను మంజూరు చేస్తారు.
భారతదేశంలోని ఏ గ్రామాల్లోని రైతు అయిన ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 65 సంవత్సరాల లోపు ఉన్నవారు… అయితే పశువులను కొత్తగా కొనుగోలు చేయడానికి లేదా మరిన్ని పశువులను అదనంగా చేర్చుకోవడానికి ఈ రుణాన్ని తీసుకోవచ్చు. ఇందుకోసం జంతువుల నివాసానికి అవసరమైన స్థలాన్ని చూపించాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డు తో పాటు పాన్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంకు పాస్ బుక్, స్థలం సంబంధించిన పత్రాలు, పశుసంవర్ధక శాఖ అందించే ధ్రువపత్రం తో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read : అహ్మదాబాద్ విమానం ఎందుకు కూలిందంటే? కాక్ పిట్ లో మినట్ టు మినట్ జరిగింది ఇదీ
పశుపాలన్ పథకం కింద.. రెండు పాడి పశువులను కొనుగోలు చేస్తే రూ. 1.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు రుణాన్ని పొందవచ్చు. అలాగే 10 పశువులను కొనుగోలు చేసేవారు రూ. ఏడు నుంచి రూ. 10 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు. 20 కంటే ఎక్కువగా పశువులు కొనుగోలు చేసే వారికి రూ. 15 లక్షల నుంచి 25 లక్షల రూపాయల రుణం అందిస్తారు. ఈ రుణం తీసుకున్న ఎస్సీ ఎస్టీ మహిళా లబ్ధిదారులకు 33 శాతం వరకు సబ్సిడీ ఉంటుంది. జనరల్ కేటగిరి వారికి 25% సబ్సిడీ ఉంటుంది.. ఈ పథకం కింద రుణం తీసుకున్న వారికి ఏడు నుంచి 11% మధ్య వడ్డీ రేటు ఉంటుంది. పశుపాలన్ దరఖాస్తును సమీపంలోని పంజాబ్ లేదా ఎస్బిఐ బ్యాంకులో సమర్పించవచ్చు. అంతేకాకుండా దీనిని ఆన్లైన్ లో కూడా www nabard.org అనే వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఈ పథకం ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆయా రాష్ట్రాలు రైతులను ప్రోత్సహించేందుకు ఎక్కువగా సబ్సిడీ ఇస్తున్నారు.