Homeజాతీయ వార్తలుArunachalam Pilgrim Attack: తెలుగు వాళ్ళంటే అరుణాచలంలో అంత చులకనా? తెలంగాణ యువకుడి విషాదంతంతో కలకలం!

Arunachalam Pilgrim Attack: తెలుగు వాళ్ళంటే అరుణాచలంలో అంత చులకనా? తెలంగాణ యువకుడి విషాదంతంతో కలకలం!

Arunachalam Pilgrim Attack: తెలుగువారికి దైవభక్తి మెండుగా ఉంటుంది. ప్రపంచంలో ఏ క్షేత్రానికి వెళ్లినా తెలుగువారే ఎక్కువగా కనిపిస్తుంటారు. తెలుగు నేలలపై ఎన్నో అద్భుతమైన క్షేత్రాలు ఉన్నప్పటికీ.. తెలుగువారు తమ ఆధ్యాత్మిక చింతన కోసం ప్రపంచ దేశాలు మొత్తం తిరుగుతుంటారు. అక్కడున్న దైవ క్షేత్రాలను సందర్శిస్తుంటారు. తెలుగువారు ఎక్కువగా వైష్ణవ, శైవ క్షేత్రాలకు వెళుతుంటారు. అక్కడికి వెళ్లి తమ మొక్కలు తీర్చుకుంటారు. తెలుగువారు వివిధ క్షేత్రాలను సందర్శించే క్రమంలో తమ భక్తి భావాన్ని అపారంగా ప్రదర్శిస్తుంటారు.అయితే మిగతావారు తెలుగువారిని ద్వేషిస్తుంటారు. ఇతర దేశాల వారు మాత్రమే కాదు.. మన దేశంలోనే వివిధ ప్రాంతాలకు చెందిన వారు కూడా తమ హేయమైన భావాన్ని తెలుగువారి మీద ప్రదర్శిస్తుంటారు. ఈ సమయంలో జరగకూడని దారుణాలు చోటుచేసుకుంటాయి. అలాంటి దారుణమే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరుణాచలంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కన్నుమూశాడు.

Also Read: ప్రకాశ్ రాజ్ కు జనసేన కౌంటర్

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు లోని ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన చిప్పలపల్లి రవీందర్ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఈయన అసెంబ్లీ ప్రాంగణంలో ఉంటూ విధులు నిర్వహిస్తున్నాడు. ఇతడు తన కుటుంబంతో కలిసి హైదరాబాదులో నివాసం ఉంటున్నా. రవీందర్ కుమార్ రెడ్డి పేరు విద్యాసాగర్ (28) ఇతడు ఓ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాడు. కంపెనీ సముదాయంలోనే నివాసం ఉంటున్నాడు.. గతంలో రెండు పర్యాయాలు విద్యాసాగర్ తన స్నేహితులతో కలిసి అరుణాచలం వెళ్లి వచ్చాడు. ఈసారి కూడా అదే ప్రతిపాదన తీసుకొస్తే వారు తిరస్కరించారు. దీంతో ఒక్కడే అరుణాచలం వెళ్లడానికి సిద్ధమయ్యాడు. ఇదే క్రమంలో ఈనెల 4న తన తాతయ్యను చూసేందుకు మోత్కూరు వచ్చాడు. ఐదవ తేదీ వరకు మోత్కూర్ లోనే ఉన్నాడు. అరుణ అక్కడి నుంచి అరుణాచలం బయలుదేరి వెళ్లాడు. ఏడవ తేదీన అరుణాచలం క్షేత్రంలో ప్రవేశించాడు. గిరి ప్రదక్షిణ ఉదయం మొదలు పెడితే కాళ్లు కాలుతాయని భావించి.. ఎనిమిదో తేదీన రాత్రి గిరి ప్రదక్షణ చేయాలని భావించాడు. ఈ క్రమంలోనే అతనిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. గొంతు భాగంలో అతడికి తీవ్ర గాయం కావడంతో రోడ్డు మీద పడిపోయాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడాడు. మరుసటి రోజు అరుణాచలం పోలీసులు విద్యాసాగర్ ను చూసి ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతడు చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ విషయాన్ని అక్కడ పోలీసులు వారి తల్లిదండ్రులకు చెప్పారు. పదవ తేదీన విద్యాసాగర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు.

Also Read: అహ్మదాబాద్‌ విమానం ఎందుకు కూలిందంటే? కాక్‌ పిట్‌ లో మినట్‌ టు మినట్‌ జరిగింది ఇదీ

కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రవీందర్ కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహాలు జరిగిపోయాయి. విద్యాసాగర్ కు ఇంకా పెళ్లి కాలేదు. త్వరలో అందరికీ వివాహం జరపాలని అనుకుంటున్నారు. ఇంతలోనే ఈ దారుణం జరిగింది. దోపిడి దొంగల చేతిలో విద్యాసాగర్ కన్నుమూయడం స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే విద్యాసాగర్ జేబులో ఉన్న 5000 నగదును దొంగలించడానికి దోపిడి దొంగలు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని తెలుస్తోంది. ఇక ఇటీవల కాలంలో కూడా అరుణాచలంలో గిరి ప్రదర్శన చేస్తున్న తెలుగు కుటుంబం పై కొంతమంది వ్యక్తులు దాడి చేశారు. ఆ ఘటన మర్చిపోకముందే ఈ దారుణం చోటు చేసుకోవడం విశేషం..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version