Homeజాతీయ వార్తలుAjit Doval Operation Sindoor: అజిత్‌ డోభాల్‌ : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టాడు

Ajit Doval Operation Sindoor: అజిత్‌ డోభాల్‌ : ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టాడు

Ajit Doval Operation Sindoor: అజిత్‌ ధోవల్‌.. భారత సైనిక పాఠవం గురించి తెలిసిన వారందరికీ ఈ పేరు సుపరిచితం. వ్యూహ చరనలో దిట్ట. ఆయన ఎప్పుడు ముందు కనిపించడు. కానీ వెనుక ఉండి వ్యూహాలు రూపొందిస్తారు. విజయంలో కీలకపాత్ర పోషిస్తారు. ఇటీవలి ఆపరేషన్‌ సిందూర్‌లో కూడా ఆయన వ్యూహాలతోనే టార్గెట్‌లను ధ్వంసం చేసింది భారత సైన్యం. తాజాగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. చెనై్నలోని ఐఐటీలో నిర్వహించిన స్నాతకోత్సవంలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ మాట్లాడారు. ఆపరేషన్‌ సిందూరం’ ద్వారా పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి, అంతర్జాతీయ మీడియాకు సవాల్‌ విసిరారు. ఈ ఆపరేషన్‌ భారత సైనిక సామర్థ్యాన్ని, 2047 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తిగా అవతరించే లక్ష్యాన్ని చాటింది.
కచ్చితమైన సైనిక దాడి..
2025 ఏప్రిల్‌లో జమ్మూ–కశ్మీర్‌లోని పహల్గామ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా, భారత సైన్యం ‘ఆపరేషన్‌ సిందూరం’ను చేపట్టింది. స్వదేశీ బ్రహ్మోస్‌ క్షిపణులు, సుఖోయ్‌–30 ఎంకేఐ జెట్‌ల ద్వారా పాకిస్థాన్, ఆక్రమిత కశ్మీర్‌లోని 9 ఉగ్ర స్థావరాలు, 11 వైమానిక స్థావరాలు, రాడార్‌ వ్యవస్థలను 23 నిమిషాల్లో ధ్వంసం చేసింది. ఈ దాడులు 9 నిమిషాల్లో పూర్తయ్యాయి. స్వదేశీ ఆయుధాల వినియోగం, కచ్చితమైన దాడులు ఆత్మనిర్భర్‌ భారత్‌లో రక్షణ సాంకేతికత బలాన్ని చాటాయని ధోవల్‌ స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్‌ భారత్‌ సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిందని ప్రకటించారు.
మీడియా ప్రచారానికి చెక్‌..
కొన్ని విదేశీ మీడియా సంస్థలు ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో భారత్‌కు నష్టం జరిగినట్లు ప్రచారం చేశాయి. దీనిపై దోవల్, భారత్‌కు నష్టం జరిగినట్లు ఒక్క ఆధారమైనా చూపాలని అంతర్జాతీయ మీడియాకు సవాల్‌ విసిరారు. 24 గంటలు గడిచినా వెస్టర్న్‌ మీడియా ఈ సవాల్‌ను స్వీకరించలేదు. దోవల్‌ సవాల్‌ భారత్‌ దృఢమైన దౌత్య స్థానాన్ని, మీడియా ప్రచారాన్ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఇది అంతర్జాతీయంగా భారత్‌ విశ్వసనీయతను పెంచింది.
పాకిస్థాన్‌ సైలెన్స్‌..
పాకిస్థాన్‌ సైన్యాధ్యక్షుడు ఆసిఫ్‌ మునీర్, ప్రస్తుతం శ్రీలంకలో ఉన్నట్లు తెలుస్తుంది. ఆపరేషన్‌ సిందూరం దాడులపై పాకిస్థాన్‌ నుంచి స్పష్టమైన స్పందన రాలేదు. ఉగ్ర స్థావరాలు, వైమానిక స్థావరాల నాశనం ధృవీకరించబడకపోవడం దాని సైనిక లోపాలను సూచిస్తుంది. పాకిస్థాన్‌ నిశ్శబ్దం ఆపరేషన్‌ విజయాన్ని, అంతర్గత రాజకీయ సంక్షోభాన్ని బహిర్గతం చేస్తుంది. ఆసిఫ్‌ మునీర్‌ స్పందన లేమి దీనిని మరింత ధృవీకరిస్తుంది.
ప్రపంచంలో అతిపెద్ద సైనిక శక్తి..
2047 నాటికి భారత్‌ ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక శక్తిగా ఎదుగుతుందని దోవల్‌ ప్రకటించారు. స్వదేశీ రక్షణ సాంకేతికత, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, సైబర్‌ యుద్ధ సామర్థ్యాలపై దృష్టి ఈ లక్ష్యానికి కీలకం. ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమం కింద స్వదేశీ ఆయుధాల అభివృద్ధి, ఆధునిక సాంకేతికతల సమగ్రత భారత్‌ను సైనిక ఆధిపత్య శక్తిగా మార్చే దిశలో ఉన్నాయి.
Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version