టిడిపి నుంచి మరో వికెట్ డౌన్..!

తెలుగుదేశం పార్టీలో మరో వికెట్ పడనుంది. ఆ పార్టీలో ఉత్తరాంధ్ర నుంచి కీలకంగా ఉన్న నేత ఒకరు వైసీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ నేత ఎవరో కాదు భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయనకు పార్టీ మారడం అనేది పెద్ద విషయమేమీ కాదని గతంలోని పరిణామలను బట్టీ చెప్పొచ్చు. ప్రజారాజ్యంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అనంతరం కాంగ్రెస్, టిడిపిలో పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో పని చేసిన సమయంలో టిడిపి […]

Written By: Neelambaram, Updated On : July 25, 2020 8:50 pm
Follow us on

తెలుగుదేశం పార్టీలో మరో వికెట్ పడనుంది. ఆ పార్టీలో ఉత్తరాంధ్ర నుంచి కీలకంగా ఉన్న నేత ఒకరు వైసీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ నేత ఎవరో కాదు భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఆయనకు పార్టీ మారడం అనేది పెద్ద విషయమేమీ కాదని గతంలోని పరిణామలను బట్టీ చెప్పొచ్చు. ప్రజారాజ్యంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన అనంతరం కాంగ్రెస్, టిడిపిలో పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో పని చేసిన సమయంలో టిడిపి అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించిన ఆయన తరువాతి కాలంలో టిడిపిలో చేరి మంత్రి పదవి సైతం పొందారు.

ప్రస్తుతం టిడిపి కార్యక్రమాల్లో పెద్దగా కనిపించక పోవడానికి, శాసనసభలోను అధికారపార్టీకి వ్యతిరేకంగా మాట్లాడకుండా సైలెంట్ గా ఉండటం టిడిపిని వీడి అధికార పార్టీలో చేరుతుండటమేనని తెలుస్తోంది. అయితే గంటా వైసీపీలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డిని ఆశ్రయించకుండా రాయలసీమ ప్రాంత వ్యవహారాలు చూస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డితో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. దీనికి తోడు కరోనా వైరస్ బారిన పడిన విజయసాయిరెడ్డి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో పదిహేను రోజులపాటు ఆసుపత్రిలోనే ఉండే అవకాశం ఉంది. దీంతో ఆయన వచ్చేలోగా గంటా వైసీపీ తీర్ధం పుచ్చకునే అవకాశం ఉందని గంటా సన్నిహితులు చెబుతున్నారు.

Also Read: ఆపరేషన్ ‘కుప్పం’ మొదలైందిగా?

వాస్తవానికి గంటా శ్రీనివాసరావు గతంలోనే వైసీపీ చేరతారనే వార్తలు వచ్చాయి. కొన్ని అడ్డంకులు వల్ల ఆయన చేరలేకపోయారు. విశాఖపట్టణంలో మంత్రి అవంతి శ్రీనివాసరావు గంటా చేరికకు అడ్డుపడుతున్నారనే వాదనలు ఉన్నాయి. గంటా చేరితే జిల్లాలో తన పట్టు తగ్గుతుందని అవంతి భావిస్తుండటంతో విజయసాయిని అడ్డుపెట్టి గంటాను దూరంగా ఉంచుతున్నారు. ఇటీవల విజయసాయి గంటా సైకిళ్ల కొనుగోళ్లలో కుంభకోణానికి పాల్పడ్డారని ట్విట్ చేయగా మంత్రి అవంతి గంటా అరెస్టు అవుతారని వ్యాఖ్యానించారు. ఇది గంటా వైసీపీలోకి చేరకుండా ముందస్తుగా అడ్డంకులు సృష్టించేందుకే అంటున్నారు. ఈ ఆరోపణలు చేయడం వల్ల కేసులతో భయపెట్టి గంటాను వైసీపీలో చేర్చుకున్నారనే భావన ప్రజల్లోకి వెళుతుందని.. తద్వారా పార్టీ అధినేత జగన్ వెనక్కి తగ్గుతారని వ్యూహాత్మకంగా ఇలా చేశారని సమాచారం.

Also Read: మంత్రులకు రోజా స్ట్రాంగ్ వార్నింగ్..!

గంటా వ్యవహారంలో ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి జగన్ తో సంప్రదించి పార్టీలో చేరేందుకు లయన్ క్లియర్ చేసినట్లుగా తెలిసింది. గంటా వ్యవహారం మొత్తం ఆయన చూసుకుంటున్నారని గంటా అనుచరులంటున్నారు. దీంతో త్వరలోనే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు టిడిపిని వీడి అధికార పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారని తెలుస్తోంది. టిడిపికి ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు దూరమయ్యారు. చట్ట పరంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వీరంతా వైసీపీ కండువా కప్పుకోకపోయినా ఆ పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారు. వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, కరణం బలరామ్ లు ఉన్నారు. తాజాగా ఈ జాబితాలో గంటా శ్రీనివాసరావు పేరు కూడా చేరనుందనేది స్పష్టంగా తెలుస్తోంది.