https://oktelugu.com/

సూర్య ఫ్యాన్స్‌కు డబుల్‌ ట్రీట్‌..

తమిళ్ హీరో అయినా తెలుగులోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సూర్య. అతను నటించిన సినిమాలన్నీ తెలుగులో డబ్‌ అవుతున్నాయి. సూర్య మూవీస్‌కు టాలీవుడ్‌లో తెలుగు స్టార్ హీరోలను మించిన మార్కెట్‌ ఉంది. ఈ మధ్య తన మూవీస్‌కు తెలుగులో డబ్బింగ్‌ తానే చెప్పుకుంటున్నాడు సూర్య. ప్రస్తుతం ‘గురు’ ఫేమ్‌ సుధ కొంగర దర్శకత్వంలో ‘సూరరై పోట్రు’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో తెలుగులో కూడా నేరుగా రిలీజ్‌ కానుంది […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 23, 2020 / 05:54 PM IST
    Follow us on

    తమిళ్ హీరో అయినా తెలుగులోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సూర్య. అతను నటించిన సినిమాలన్నీ తెలుగులో డబ్‌ అవుతున్నాయి. సూర్య మూవీస్‌కు టాలీవుడ్‌లో తెలుగు స్టార్ హీరోలను మించిన మార్కెట్‌ ఉంది. ఈ మధ్య తన మూవీస్‌కు తెలుగులో డబ్బింగ్‌ తానే చెప్పుకుంటున్నాడు సూర్య. ప్రస్తుతం ‘గురు’ ఫేమ్‌ సుధ కొంగర దర్శకత్వంలో ‘సూరరై పోట్రు’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో తెలుగులో కూడా నేరుగా రిలీజ్‌ కానుంది ఈ మూవీ. సూర్య సరసన అపర్ణా బాలుమురళి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో డైలాగ్‌ కింగ్‌ మోహన్‌ బాబు ఓ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే వచ్చిన పోస్టర్స్‌, ప్రోమోలు ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాయి. గురువారం (జులై 23) సూర్య పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ మూవీ నుంచి మరో వీడియో సాంగ్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ‘కాటుక కనులే మెరిసిపోయే పిలడా నిను చూసి.. మాటలన్నీ మరిచిపోయా నీళ్లే నమిలేసి..’ అంటూ సాగే రొమాంటింగ్‌ సాంగ్‌లో ఆహ్లాదరకంగా ఉంది. భార్యాభర్తలుగా నటిస్తున్న సూర్య, అపర్ణ మధ్య మంచి కెమిస్ట్రీ కనిపించింది. ఈ పాటను భాస్కరబట్ల రాయగా.. యుంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్ జీవీ ప్రకాశ్‌ కుమార్ మంచి బాణీలు అందించారు.

    Also Read: వెబ్‌ బాటలో సుక్కూ.. మరి ‘పుష్ప’ పరిస్థితేంటి?

    ఇదొక్కటే కాదు సూర్య ఫ్యాన్స్‌కు మరో సర్ప్రైజ్‌ కూడా లభించింది. సహజత్వానికి దగ్గర ఉండే కథలతో సినిమాలు చేసే సంచలన దర్శకుడు వెట్రిమారన్‌తో సూర్య చేయబోయే కొత్త మూవీకి సంబంధించి ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌ కూడా వచ్చింది. ‘అసురన్‌’ తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న వెట్రిమారన్‌.. జల్లికట్టు నేపథ్యంలో సూర్యతో ఈ సినిమా తీస్తున్నాడు. అసురన్‌ నిర్మాత కలైపులి థాను ఈ మూవీని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ‘వాడి వాసల్‌’ అనే టైటిల్‌ను ఖాయం చేశారు. టైటిల్‌తో పాటు మూవీలో సూర్య లుక్‌ను రిలీజ్‌ చేశారు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా సూర్య యాంగ్రీ లూక్‌తో కనిపిస్తున్నాడు. ‘వాడి వాసల్‌’ అనే నవల ఆధారంగా తీస్తున్న ఈ సినిమాలో సూర్య తండ్రి, కొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. జల్లికట్టు ఆటలో తన తండ్రిని చంపిన ఎద్దును మచ్చిచేసుకోవడమే నవలలో ప్రధానాంశం.

    Also Read: జపాన్ లో నెం.1 హీరో.. మన తెలుగు స్టారే !