https://oktelugu.com/

వెబ్‌ బాటలో సుక్కూ.. మరి ‘పుష్ప’ పరిస్థితేంటి?

‘అలవైకుంఠపురములో’ మూవీతో ఈ ఏడాది అతి పెద్ద బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు టాలీవుడ్‌ స్టయిలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ మిస్‌ కాకుండా అద్భుత కథనంతో అన్ని రకాల ఆడియన్స్‌ను మెస్మరైజ్‌ చేశాడు డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్. ఈ ముఖ్యంగా తమన్‌ అందించిన మ్యూజిక్‌ ఈ మూవీకి బాగా ప్లస్‌ అయింది. చిత్రంలో ప్రతీ పాట సూపర్ హిట్‌ అయింది. ఈ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేసిన తర్వాత తన క్లోజ్‌ ఫ్రెండ్‌, సెన్సిబుల్‌ డైరెక్టర్ సుకుమార్తో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 23, 2020 / 05:23 PM IST
    Follow us on

    ‘అలవైకుంఠపురములో’ మూవీతో ఈ ఏడాది అతి పెద్ద బ్లాక్‌బస్టర్ అందుకున్నాడు టాలీవుడ్‌ స్టయిలిష్‌ స్టార్ అల్లు అర్జున్‌. కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ మిస్‌ కాకుండా అద్భుత కథనంతో అన్ని రకాల ఆడియన్స్‌ను మెస్మరైజ్‌ చేశాడు డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్. ఈ ముఖ్యంగా తమన్‌ అందించిన మ్యూజిక్‌ ఈ మూవీకి బాగా ప్లస్‌ అయింది. చిత్రంలో ప్రతీ పాట సూపర్ హిట్‌ అయింది. ఈ మూవీ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేసిన తర్వాత తన క్లోజ్‌ ఫ్రెండ్‌, సెన్సిబుల్‌ డైరెక్టర్ సుకుమార్తో ‘పుష్ప’ అనే మూవీకి కమిటయ్యాడు. పాన్‌ ఇండియా మూవీగా ఐదు భాషల్లో వస్తున్న ఈ మూవీ ఫస్ట్‌ లుక్‌ను బన్నీ బర్త్‌డే సందర్బంగా రివీల్‌ చేశారు. గంధం చెక్కల బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే మూవీలో బన్నీ.. రఫ్‌ లుక్‌లో వైవిధ్యంగా కనిపించాడు. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. చిత్రంలో బన్నీ ‘పుష్పరాజ్‌’ అనే పాత్రలో కనిపించనుండగా.. రష్మిక.. పోలీస్‌ ఆఫీసర్గా నటిస్తోందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ డైరెక్టర్.

    Also Read: జపాన్ లో నెం.1 హీరో.. మన తెలుగు స్టారే !

    కరోనా ప్రభావం మొదలయ్యే వరకూ కేరళలోని అడవుల్లో షూటింగ్‌ నిర్మహించారు. కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించిన తర్వాత చిత్రీకరణకు బ్రేక్‌ పడింది. చిత్ర బృందం మొత్తం ఇప్పుడు తమ ఇళ్లకే పరిమితమైంది. రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఫారెస్ట్‌ సెట్‌ వేసి షూటింగ్‌ రీస్టార్ట్‌ చేయాలని సుక్కూ భావించినా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాదని తేలింది. మరోవైపు కరోనా వైరస్‌ వ్యాప్తి ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో షూటింగ్‌ తిరిగి ఎప్పుడు మొదలువుతుందో తెలియడం లేదు. అయితే, ఈ ఖాళీ టైమ్‌లో ఓ వెబ్‌ సిరీస్‌ నిర్మించాలని ‘పుష్ప’ మూవీ మేకర్స్‌ భావిస్తున్నారట. మరోవైపు సుకుమార్ కూడా ఓ వెబ్‌ సిరీస్‌ డైరెక్షన్‌ చేసేందుకు రెడీ అవుతున్నట్టు చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం మేరకు అది నిజమే అని తెలుస్తోంది. అదే జరిగితే మరి ‘పుష్ప’ పరిస్థితి ఏంటి? అని ఫ్యాన్స్‌ ప్రశ్నిస్తున్నారు. అయితే లెక్కల మాస్టారు అయిన సుక్కూ దగ్గర ప్రతి విషయానికీ ఓ స్పష్టమైన లెక్క ఉంటుంది. ‘పుష్ప’ విషయంలో కూడా అతను పక్కా క్యాలిక్యులేషన్ ప్రకారమే వెళ్తున్నాడని.. కేవలం లాక్‌డౌన్‌ ఖాళీ టైమ్‌లో మాత్రమే వెబ్‌ సిరీస్‌కు పని చేస్తాడని, అంతేకాని పుష్పను వదిలిపెట్టే ప్రసక్తే లేదని టాలీవుడ్‌ వర్గాలు అందున్నాయి.

    Also Read: ‘రైడ్‌’కు రెడీ అవుతున్న నాగార్జున!