https://oktelugu.com/

గల్లా పయనం కమలం వైపేనా?

రాష్ట్రంలో టీడీపీ నాయకులను వైసీపీ టార్గెట్ చేసిందనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో టీడీపీ నాయకులు ఎవరిదారి వారు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో కొందరు అధికార పార్టీ వైసీపీ తీర్ధం పుచ్చుకుంటుండగా, మరికొందరు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు. అయితే వైసీపీలో చేరే వారి సంఖ్య అధికంగా ఉందని చెప్పాలి. ఈ క్రమంలో గుంటూరు ఏంపీ గల్లా జయదేవ్ కూడా తన దారి ఎంపిక చేసుకున్నాడని తెలుస్తోంది. ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 19, 2020 / 07:18 PM IST
    Follow us on


    రాష్ట్రంలో టీడీపీ నాయకులను వైసీపీ టార్గెట్ చేసిందనే వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో టీడీపీ నాయకులు ఎవరిదారి వారు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో కొందరు అధికార పార్టీ వైసీపీ తీర్ధం పుచ్చుకుంటుండగా, మరికొందరు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీర్ధం పుచ్చుకుంటున్నారు. అయితే వైసీపీలో చేరే వారి సంఖ్య అధికంగా ఉందని చెప్పాలి. ఈ క్రమంలో గుంటూరు ఏంపీ గల్లా జయదేవ్ కూడా తన దారి ఎంపిక చేసుకున్నాడని తెలుస్తోంది. ఆయన బీజేపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

    Also Read: భయంలో చంద్రబాబు.. ప్రతిపక్షం టీడీపీ కాదా?

    కొద్ది రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరు సమీపంలో అమరరాజా ఇన్ ఫ్రా సంస్థకు కేటాయించిన భూముల్లో వినియోగంలో లేని భూములను వెనక్కి తీసుకునేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై ఆ సంస్థ హై కోర్టును ఆశ్రయించగా హై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఇప్పటికీ ఈ సమస్య నుంచి గట్టెక్కినా భవిష్యత్తులోను ఇబ్బందులు తప్పవనుకున్న గల్లా కుటుంబం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీలో చేరడంతో ఈ సమస్య నుంచి గట్టెక్కాలనే ఆలోచనలో ఉంది.

    గల్లా జయదేవ్ తల్లి గల్లా అరుణ కుమారి గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్నారు. వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రపదేశ్ విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగై పోవడంతో ఆమె టీడీపీలో చేరారు. తన కుమారుడు జయదేవ్ కు గుంటూరు లోక్ సభ టిక్కెట్టు సాధించారు. అనంతరం పరిణామాల్లో రెండు పర్యాయాలు జయదేవ్ గుంటూరు ఏంపీగా విజయం సాధించారు.

    Also Read: విశాఖ లోని ఆ ఇంట్లోనే ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అంతా…! జగన్ దూకుడూ మామూలుగా లేదు

    మరోవైపు బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు టీడీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని ప్రకటించిన నేపథ్యంలో గల్లా జయదేవ్ కుటుంబం ఈ వరుసలో మొదట ఉందని స్పష్టం అవుతుంది. భవిష్యత్తులో టీడీపీ నాయకులు ఎవరెవరు బీజేపీ తీర్ధం పుచ్చుకోనున్నారనేది ఇప్పడు ఆసక్తికరంగా మారింది. ఈ వలసలను అడ్డుకునేందుకు చంద్రబాబు ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.