https://oktelugu.com/

గాంధీయేతరుడే కాంగ్రెస్ కు దిక్కా?

దేశంలో 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. బీజేపీకి బలమైన మోడీషాలు స్తంభాలుగా నిలబడ్డ వేళ కాంగ్రెస్ కు ఒక్కో స్తంభం కూలుతోంది. వృద్ధురాలైన సోనియా భారం మోయలేకపోతుండగా.. కొడుకు రాహుల్ గాంధీ మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో కాడి వదిలేశాడు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ కు గాంధీయేతర వ్యక్తి అధ్యక్షుడు కావాలనే డిమాండ్ వినిపిస్తోంది. విశేషం ఏంటంటే ఈ డిమాండ్ ను అదే గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక గాంధీ తాజాగా […]

Written By:
  • NARESH
  • , Updated On : August 19, 2020 / 07:28 PM IST
    Follow us on


    దేశంలో 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నాయకత్వ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. బీజేపీకి బలమైన మోడీషాలు స్తంభాలుగా నిలబడ్డ వేళ కాంగ్రెస్ కు ఒక్కో స్తంభం కూలుతోంది. వృద్ధురాలైన సోనియా భారం మోయలేకపోతుండగా.. కొడుకు రాహుల్ గాంధీ మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడంతో కాడి వదిలేశాడు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్ కు గాంధీయేతర వ్యక్తి అధ్యక్షుడు కావాలనే డిమాండ్ వినిపిస్తోంది. విశేషం ఏంటంటే ఈ డిమాండ్ ను అదే గాంధీ కుటుంబానికి చెందిన ప్రియాంక గాంధీ తాజాగా మద్దతు పలకడం విశేషంగా మారింది.

    Also Read: భారత్ వ్యాక్సిన్ కోసం ప్రపంచం ఎదురుచూపు..!

    తాజాగా కాంగ్రెస్ కు కొత్త నాయకత్వం రావాలన్న డిమాండ్ కు రాహుల్ గాంధీ సైతం మద్దతు తెలిపారు. తిరువనంతపురం కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ సైతం గాంధీయేతర వ్యక్తి పార్టీ అధ్యక్షుడిగా ఉండాలనే నిర్ణయానికి మద్దతు ప్రకటించారు.

    2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడిపోయిన వేళ.. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి పార్టీ అధ్యక్ష బాధ్యతలను ఈ వయసులోనూ సోనియాగాంధీనే మోస్తోంది. తిరిగి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కాంగ్రెస్ వర్గాలు ఎంత కోరుతున్నా.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఎంత ఒత్తిడి తెస్తున్నా రాహుల్ మాత్రం ససేమిరా అంటున్నారు.

    ఈ క్రమంలోనే కాంగ్రెస్ కు గాంధీయేతర వ్యక్తిని అధ్యక్షుడిగా నియమించాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనికి స్వయంగా ప్రియాంక గాంధీ మద్దతు తెలుపడం విశేషం. గాంధీయేతర వ్యక్తి కింద పనిచేయడానికి తనకు ఎలాంటి సమస్యలు లేవని.. చీఫ్ ఏ పదవిని ఇచ్చినా తాను నెరవేరుస్తానని ప్రియాంక తెలిపారు.

    Also Read: ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన హోమంత్రి అమిత్ షా..!

    నిజానికి కాంగ్రెస్ కు అధ్యక్షుడి ఎంపికలో ప్రియాంక నిజాయితీగా వ్యవహరించారు. రాహుల్ గాంధీ సైతం మద్దతు తెలిపారు. కానీ 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ నుంచి గాంధీ కుటుంబం నుంచి చేజారిపోకుండా సోనియానే కాపుకాస్తోంది. ఒకసారి ‘పీవీ నరసింహారావును’ ప్రధానిగా చేస్తే ఆయన సోనియాను ఎదురించాడు. స్వతంత్రంగా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే కొత్త గాంధీయేతర వ్యక్తికి పగ్గాలు ఇవ్వడానికి సోనియానే అడ్డుగా ఉన్నారు. కానీ బీజేపీని ఎదుర్కోవాలంటే ఇప్పుడున్న సోనియా, రాహుల్, ప్రియాంక బలం సరిపోదని అర్థమైంది. దీంతో గాంధీయేతరుడైన సమర్థవంతమైన వ్యక్తి కోసం కాంగ్రెస్ వెతకాల్సిన అవసరం ఉంది.

    Tags