https://oktelugu.com/

సోము వీర్రాజు పై జగన్ విసరనున్న అస్త్రం ఇతనే..?

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో చాలా చురుగ్గా వ్యూహాలకు ప్రతివ్యూహాలు వేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా… చివరికి పట్టుబట్టి మరీ గవర్నర్ దగ్గర నుండి మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెచ్చుకున్నారు. ఇదే సమయంలో బీజేపీ నూతన అధ్యక్షుడిగా నియమితుడైన సోము వీర్రాజు ఇప్పుడు జగన్ కు సరికొత్త తలనొప్పులు తెచ్చేలా కనిపిస్తున్నాడు. వైసిపి పార్టీ వర్గాల్లో కూడా ఇప్పుడు వీర్రాజు గురించే చర్చ. ప్రతిపక్ష స్థానంలో చంద్రబాబు పొజిషన్ లో బిజెపి […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 19, 2020 / 07:11 PM IST
    Follow us on

    ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో చాలా చురుగ్గా వ్యూహాలకు ప్రతివ్యూహాలు వేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా… చివరికి పట్టుబట్టి మరీ గవర్నర్ దగ్గర నుండి మూడు రాజధానుల బిల్లుకు ఆమోదం తెచ్చుకున్నారు. ఇదే సమయంలో బీజేపీ నూతన అధ్యక్షుడిగా నియమితుడైన సోము వీర్రాజు ఇప్పుడు జగన్ కు సరికొత్త తలనొప్పులు తెచ్చేలా కనిపిస్తున్నాడు. వైసిపి పార్టీ వర్గాల్లో కూడా ఇప్పుడు వీర్రాజు గురించే చర్చ. ప్రతిపక్ష స్థానంలో చంద్రబాబు పొజిషన్ లో బిజెపి కనుక వచ్చినట్లయితే వారికి కొత్త కష్టాలు మొదలవుతాయి.

     

    దీనిని దృష్టిలో ఉంచుకొని జగన్…. సోము వీర్రాజు మీదకి రాపాక వరప్రసాద్ రూపంలో అస్త్రాన్ని విసురుతున్నారు. ఇప్పటికే రాపాక జనసేన పార్టీకి వ్యతిరేకంగా…. తను ఒక అనధికార వైసీపీ ఎమ్మెల్యే అని చెప్పుకుని తిరుగుతున్నాడు. ఇప్పుడు అతనినే ఉపయోగించి సోము వీర్రాజు ని టార్గెట్ చేయించాలని వైసీపీ పార్టీ అధిష్టానం భావిస్తోందట. “మీ ఎమ్మెల్యేలే మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ఏంటి?” అన్నట్లు రాష్ట్రంలోని ప్రజలు కొంతమంది జనసేన ను తక్కువగా చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు వారి మిత్రపక్షమైన బీజేపీ పైకి రాపాక విమర్శలు కురిపిస్తే అది వీరిద్దరి మధ్య చిచ్చు రేపి తమకు ఉపకరిస్తుందని జగన్ అంచనా కాబోలు.

    అయితే సోము వీర్రాజు ఇటువంటి రాజకీయాలను ముందే గ్రహించి తన జాగ్రత్తలో తాను ఉన్నట్లు ఎప్పుడో చెప్పుకున్నాడు. జనసేన తో కలిసి జరగవలసిన కార్యాచరణ గురించి ఎంతో క్లారిటీతో ఉన్నామని… ఎవరు ఎటువైపు నుండి ఎన్ని విమర్శలు చేసినా తమ ఆలోచనా సరళిలో ఎటువంటి మార్పు ఉండదు అని తేల్చేశారు. పైగా సోము వీర్రాజు పైకి రాపాక వంటి నేతను అనేది నిజంగానే చాలా రిస్క్ తో కూడుకున్న పని. ఇప్పటివరకు వీర్రాజు టిడిపి పై రెచ్చిపోయిన తీరు…. ఆ తర్వాత రాష్ట్రంలో బిజెపిని నిలబెట్టాలని అతనికున్న కసి ముందు ఎవరైనా నిలిచిచేది అనుమానమే అని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ మంత్రులు సైతం సోము పై ఒక్క మాట ఎత్తడానికి భయపడుతున్న తరుణంలో జగన్ అంత సాహసం చేస్తాడా లేదా అనేది వేచి చూడాలి.