Homeఅంతర్జాతీయంCIA Agent Arrest: ఈశాన్య భారత్‌లో విదేశీ కుట్రలు.. మాథ్యూ వాండైక్‌.. ఆరుగురు ఏజెంట్ల అరెస్టుతో...

CIA Agent Arrest: ఈశాన్య భారత్‌లో విదేశీ కుట్రలు.. మాథ్యూ వాండైక్‌.. ఆరుగురు ఏజెంట్ల అరెస్టుతో బట్టబయలు!

CIA Agent Arrest: భారత్‌లో ఇప్పుడు అమెరికా సీఐఏ ఏజెంట్‌ మాథ్యూవాండైక్, అతని ఆరుగురు ఏజెంట్ల గురించే చర్చ జరుగుతోంది. పాస్‌పోర్టులతో భారత్‌కు వచ్చి.. అక్రమంగా, అనధికారికంగా మిజోరామ్‌కు వెళ్లి.. అక్కడి నుంచి మయన్మార్‌కు వెళ్లారు. అక్కడ ఉగ్రవాదులకు డ్రోన్‌ టెక్నాలజీ, బాంబు టెక్నాలజీ, యుద్ధం చేసే టెక్నాలజీ నేర్పించారు. ఈ విషయాన్ని ఎన్‌ఐఏ పసిగట్టింది. మాథ్యూవాండైక్‌ కోల్‌కతాలో అరెస్ట్‌ అయ్యాడు. ఉక్రెయిన్‌కు చెందిన పెట్రో హిల్‌బా, తాడా సిల్వియా, ఇవాన్‌ సుక్‌మనోస్కీ లక్నోలో పట్టుపడ్డారు. స్టిఫాన్కో […]

CIA Agent Arrest: భారత్‌లో ఇప్పుడు అమెరికా సీఐఏ ఏజెంట్‌ మాథ్యూవాండైక్, అతని ఆరుగురు ఏజెంట్ల గురించే చర్చ జరుగుతోంది. పాస్‌పోర్టులతో భారత్‌కు వచ్చి.. అక్రమంగా, అనధికారికంగా మిజోరామ్‌కు వెళ్లి.. అక్కడి నుంచి మయన్మార్‌కు వెళ్లారు. అక్కడ ఉగ్రవాదులకు డ్రోన్‌ టెక్నాలజీ, బాంబు టెక్నాలజీ, యుద్ధం చేసే టెక్నాలజీ నేర్పించారు. ఈ విషయాన్ని ఎన్‌ఐఏ పసిగట్టింది. మాథ్యూవాండైక్‌ కోల్‌కతాలో అరెస్ట్‌ అయ్యాడు. ఉక్రెయిన్‌కు చెందిన పెట్రో హిల్‌బా, తాడా సిల్వియా, ఇవాన్‌ సుక్‌మనోస్కీ లక్నోలో పట్టుపడ్డారు. స్టిఫాన్కో మరియాన్, హోచ్‌క్‌ మాక్‌స్లిం, కమిన్‌స్కీ విక్టర్‌ ఢిల్లీలో అరెస్ట్‌ అయ్యారు. వీళ్లు ఈగల్‌ వీసాలపై భారత్‌కు వచ్చారు.

Also Read: ఆ పెంపుడు కుక్కతోనే అమెరికాకు అణుముప్పు.. ఇంటెలిజెన్స్‌ సంచలన నివేదిక..

మాథ్యూ వాండైక్‌ రేజీమ్‌ చేంజ్‌ నిపుణుడు..
వాండైక్‌ 2011 కైరో విప్లవంలో పాల్గొని, లిబియాలో గద్దాఫీకి వ్యతిరేక గెరిల్లాలకు మద్దతు ఇచ్చి అరెస్టయ్యాడు. సిరియాలో బషర్‌ అల్‌–అస్ద్‌ ప్రతికూల దళాలు (నినేవే ప్లాన్, ప్రొటక్షన్‌ యూనిట్‌) తయారు చేశాడు. ఇప్పుడు మయన్మార్‌లో 150 రహస్య మార్గాల్లో ముస్లిం, క్రై స్తవ ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చాడు. స్టిఫాన్కో మరియాన్‌ 2023 నుంచి క్రై స్తవ ఉగ్ర సంస్థలు ఏర్పాటు చేశాడు.

టార్గెట్‌ మిజోరాం–మణిపూర్‌..
మిజోరాం, మణిపూర్‌ నుంచి మయన్మార్‌కు 1670 కి.మీ. ఓపెన్‌ సరిహద్దు (1987 ఎంఎన్‌ఎఫ్‌ ఒప్పందం) తెరిచి ఉండడంతో ఉగ్రవాదులు రాకపోకలు. 2,000 మంది విదేశీయులు శిక్షణ ఇచ్చారు. డ్రోన్‌ శిక్షణ పొందినవారు ఆస్సాం రైఫిల్స్‌పై దాడి చేశారు. మణిపూర్‌ ఇM కేంద్రానికి ఫిర్యాదు చేసి, ఇంటలిజెన్స్‌ చీఫ్‌ మిజోరాం పర్యటించారు.

చారిత్రక తప్పిదాలు..
1987 ఎంఎన్‌ఎఫ్‌ ఒప్పందంతో సరిహద్దులు ఓపెన్‌ చేయడం, 2011 మన్మోహన్‌ ప్రభుత్వం టూరిజం కోసం సెక్యూరిటీ సడలించడం వల్ల విదేశీయులు (డేనియల్‌ స్టీఫెన్‌ వంటివారు) ప్రవేశం మొదలైంది. అమెరికా రాయబారి గోరెటి మిజోరాం సందర్శన తర్వాత ఈ కుట్రలు బయటపడ్డాయి.

ఈ అరెస్టులు ఏడాదిన్నర కుట్రలను బయటపెట్టాయి. బంగ్లాదేశ్‌ (షేక్‌ హసీనా పడిపోవడం), మయన్మార్‌ సైనిక పాలితం, భారత ఈశాన్య రాష్ట్రాలను కలిపి క్రై స్తవ దేశం ఏర్పాటు చేయాలని లక్ష్యం. మోదీ ప్రభుత్వం సరిహద్దు కంచెలు వేయాలని ప్రయత్నిస్తున్నా, స్థానిక సంస్థల వ్యతిరేకత ఉంది. ఇది భారత ఐక్యతకు సవాలు, ఇంటలిజెన్స్‌ నిఘా మరింత బలపడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper