Afghanistan: అమెరికా విమానం నుంచి జారిపడ్డ అప్ఘనీస్థానీయులు

మత చాందసవాదానికి మారుపేరు.. కరుడుగట్టిన తీవ్రవాద మూక అయిన తాలిబన్ల చేతుల్లోకి అప్ఘనిస్తాన్ దేశం వెళ్లిపోయింది. దీంతో అప్ఘన్ ప్రజల మానప్రాణ, ధనాలకు గ్యారెంటీ లేకుండాపోయింది. అప్ఘన్ ప్రజలు ఇప్పుడు బతుకుజీవుడా అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు ప్రాణాలు ఫణంగా పెట్టి మరీ సాహసాలకు పాల్పడుతున్నారు. చనిపోతున్నారు. తాలిబన్ల పరిపాలనకు భయపడి దేశం విడిచి వెళ్లడానికి తాజాగా కాబూల్ నుంచి బయలు దేరిన అమెరికా విమానాన్ని పెద్ద ఎత్తున అప్ఘనీస్థానీయులు ఎక్కారు. విమానంలోపల […]

Written By: NARESH, Updated On : August 16, 2021 7:44 pm
Follow us on

మత చాందసవాదానికి మారుపేరు.. కరుడుగట్టిన తీవ్రవాద మూక అయిన తాలిబన్ల చేతుల్లోకి అప్ఘనిస్తాన్ దేశం వెళ్లిపోయింది. దీంతో అప్ఘన్ ప్రజల మానప్రాణ, ధనాలకు గ్యారెంటీ లేకుండాపోయింది. అప్ఘన్ ప్రజలు ఇప్పుడు బతుకుజీవుడా అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు ప్రాణాలు ఫణంగా పెట్టి మరీ సాహసాలకు పాల్పడుతున్నారు. చనిపోతున్నారు.

తాలిబన్ల పరిపాలనకు భయపడి దేశం విడిచి వెళ్లడానికి తాజాగా కాబూల్ నుంచి బయలు దేరిన అమెరికా విమానాన్ని పెద్ద ఎత్తున అప్ఘనీస్థానీయులు ఎక్కారు. విమానంలోపల అమెరికన్లు ఉన్నారు. బయట ప్రమాదకర పరిస్థితుల్లో రెక్కల మీద, వెనుకాల అప్ఘన్ ప్రజలు ఉండి ప్రయాణించారు. అయితే రన్ వేపై కదులుతున్నా కూడా విమానం నుంచి దిగలేదు. అలానే కదులుతుంటే పట్టుకొని గాల్లోకి లేచిపోయారు. కొందరు విమానం పైకి వెళ్లగా కిందపడిపోయిన వీడియో వైరల్ గా మారింది. అప్ఘన్ల దీన స్థితికి ఈ దృశ్యాలు అద్దం పడుతున్నాయి.

కాబుల్ ఎయిర్ పోర్టుకు చేరిన అమెరికా రాయబార కార్యాలయ అధికారులు, ఉద్యోగులను రక్షించే క్రమంలో ఆ దేశ సైనికులు స్థానికులపై కాల్పులు జరపాల్సిన పరిస్థితి వచ్చింది. దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కాల్పుల్లో ఐదుగురు చనిపోయారు. కాబుల్ విమానాశ్రయాన్ని స్థానికులు చుట్టుముట్టి తమనూ అమెరికా విమానంలో తీసుకెళ్లాలని విమానం కదలనీయకుండా పైకి ఎక్కేశారు. దీంతో అమెరికన్ సైనికులు కాల్పులు జరిపాల్సి వచ్చింది.

రన్ వేపై అమెరికా విమానంపై కదలకుండా అప్ఘన్ ప్రజలు చుట్టుముట్టినా కూడా అమెరికా విమానం ఆగలేదు. రన్ వే పై కదులుతున్న అమెరికా సీ17 ఎయిర్ క్రాఫ్ట్ ను వందలాది మంది అప్ఘనీస్థానీయులు చుట్టుముట్టారు. దాని టైర్లు, డోర్లకు వేలాడారు. వారు అలానే విడవకుండా ఉండడంతో విమానం టేకాఫ్ అయ్యింది. గాల్లో ఎగురరా.. విమానాన్ని పట్టుకున్న చాలా మంది ఆకాశం నుంచి కిందపడిపోయారు. ఆ వీడియో గగుర్పొడిచేలా ఉంది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

కాబుల్ నుంచి టేకాఫ్ అయిన ఈ ఎయిర్ క్రాఫ్ట్ కువైట్ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో ల్యాండ్ కావాల్సి ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ టైర్ల కొక్కేలకు తమను తాము కట్టుకొని అమెరికాకు వెళ్లడానికి ఇద్దరు అప్ఘనీస్థానీయులు ప్రయత్నించారు. ఎయిర్ క్రాఫ్ట్ తోపాటు వారూ గాల్లోకి లేచారు. తాలిబన్ల చేతిలో చచ్చే కంటే ఇదే బెటర్ అనుకున్నారు. 40 నిమిషాల పాటు ఆ ఎయిర్ క్రాఫ్ట్ తో ప్రయాణించారు. మార్గమధ్యలో అప్ఘనిస్తాన్ పొరుగునే ఉన్న ఇరాన్ మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో విమానం వేగానికి టైర్ల కొక్కేం వద్ద నిలవలేక జారిపడ్డారు. ప్రాణాలు కోల్పోయారు. 20వేల అడుగుల ఎత్తు నుంచి వీరు పడ్డ వీడియోలు ట్రెహ్రాన్ టైమ్స్ పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. అప్ఘనిస్థానీయులు ప్రాణాల కోసం ఎంత తెగిస్తున్నారో.. ఆ దేశంలో ఎంతటి దుర్భర పరిస్థితులు ఉన్నాయో ఈ వీడియోలు కళ్లకు కడుతున్నాయి.