
టీమ్ ఇండియా రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఐదోరోజు భోజన విరామం అనంతరం తిరిగి ఆట ప్రారంభమవ్వగా బుమ్రా (34), షమి (56) చెరో నాలుగు పరుగులు సాధించారు. ఈ క్రమంలోనే 109.3 ఓవర్ల తర్వాత టీమ్ ఇండియా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అప్పటికి భారత్ స్కోర్ 298/8 గా నమోదైంది. దాంతో ఇంగ్లాండ్ లక్ష్యం ఇప్పడు 272 పరుగులుగా నమోదైంది.