Homeఆంధ్రప్రదేశ్‌Omicron variant: ఒమిక్రాన్ పాజిటివ్.. యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన జగన్.. ఏపీలో మరోసారి ఆంక్షలు..?

Omicron variant: ఒమిక్రాన్ పాజిటివ్.. యంత్రాంగాన్ని పరుగులు పెట్టించిన జగన్.. ఏపీలో మరోసారి ఆంక్షలు..?

Omicron variant: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్ వైరస్ ఏపీలోకి ఎంటర్ అయ్యింది. ఈరోజు ఒమిక్రాన్ తొలి కేసు నమోదు కావడంతో సీఎం జగన్ యంత్రాంగాన్ని వెంటనే అలర్ట్ చేశారు. ఒమిక్రాన్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఆస్పత్రుల్లో ఆరోగ్య శ్రీ సేవలు, ఎయిర్ పోర్టుల్లో కరోనా టెస్టులకు సంబంధించిన అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో లాగా చేయి దాటిపోక ముందే ఒమిక్రాన్‌ను కంట్రోల్ చేయాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఈసారి అస్సలు ఊరుకునేది లేదని గట్టిగా చెప్పినట్టు తెలుస్తోంది.

Omicron variant
Omicron variant

WHO మరియు కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలు ఏపీలో తప్పుకుండా అమలు కావాలన్నారు. వారంల్లో విజయవాడలో జీనో సీక్వెన్సింగ్ ల్యాబ్ అందుబాటులోకి రానుందని అధికారులు చెప్పగా.. వ్యాక్సినేషన్ వీలైనంత త్వరగా రెండు డోసులు పూర్తి చేయాలన్నారు. నాడు – నేడు కార్యక్రమంలో భాగంగా గతం, ప్రస్తుతం ఎలాంటి చర్యలు తీసుకున్నామో ప్రజలకు చెప్పాలన్నారు. నూతన మెడికల్ కాలేజీల నిర్మాణంలో కూడా వేగం పెంచి సిబ్బంది నియామకం ఎక్కడ అవసరం ఉంటే అక్కడ పూర్తి చేయాలన్నారు.

Also Read: Justice Chandru: జస్టిస్ చంద్రు వ్యాఖ్యలపై స్పందించిన హైకోర్టు న్యాయమూర్తులు

ఇకపోతే నిరుపేదలకు వరప్రదాయిని అయిన ఆరోగ్య శ్రీ పథకం రాష్ట్రంలోని ఏయే ఆస్పత్రుల్లో అమలవుతుందో ప్రజలకు తెలిసేలా గ్రామసచివాలయాల్లో నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. దీంతో ఆరోగ్య కింద ట్రీట్మెంట్ పొందాలనుకునే వారు అటు ఇటు తిరగాల్సిన పనిలేకుండా నేరుగా అక్కడకు వెళతారని చెప్పారు. క్యాన్సర్ రోగులకు కూడా ఆరోగ్య శ్రీ ద్వారా వైద్యం ఎక్కడ అందుతుందో క్లారిటీగా తెలియజేయాలన్నారు. విశాఖలో ఎంఐఆర్ఐ, కాకినాడలో ఎంఐఆర్ఐ, కాథ్ ల్యాబ్, కర్నూలులో కాథ్ ల్యాబ్స్ వంటి సర్వీసులను అందించాలని స్పష్టంచేశారు. ఒమిక్రాన్ వైరస్ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని చెప్పారు. ప్రజలు భయాందోళనకు గురవకుండా అవగాహన కల్పించాలని, ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించేలా చూడాలన్నారు. ఎక్కడైతే ఒమిక్రాన్ కేసు నమోదైందో ఆ వ్యక్తి ఎక్కడెక్కడ తిరిగి ఎవరెవరిని కలిశాడో ట్రైస్ ఔట్ చేసి ఆ ప్రాంతాల్లో ఆంక్షలు విధించాలన్నారు.

Also Read: Survey Report: సర్వే రిపోర్టు.. పుంజుకున్న టీడీపీ కానీ.. వైసీపీ గెలుస్తుందా అంటే?

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version