RCB: ‘డేవిడ్’ కోసం భారీ స్కెచ్ వేసిన ఆర్సీబీ..!

RCB: ఐపీఎల్-2022 మెగా టోర్నీ త్వరలో ప్రారంభం కానుంది. ఈసారి కొత్తగా రెండు జట్లు బరిలో నిలువనుండటంతో మళ్లీ ఆటగాళ్ల వేలంపాటలు షూరు కానున్నాయి. ఈనేపథ్యంలోనే ఐపీఎల్ కు చెందిన ఎనిమిది ప్రాంచైజీ జట్లు కీలక ప్లేయర్స్ ను తమ వద్ద అంటిపెట్టుకోగా మిగిలిన ప్లేయర్స్ ను వేలంపాటలో దక్కించుకోవాల్సి ఉంటుంది. ఈమేరకు బీసీసీఐ వేలంపాటలకు అన్ని ఏర్పాట్లను చేసింది. ఒక్కో జట్టు గరిష్టంగా నలుగురిని రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. మొత్తంగా 32మంది ఎనిమిది ప్రాంచైజీ […]

Written By: NARESH, Updated On : December 14, 2021 3:08 pm
Follow us on

RCB: ఐపీఎల్-2022 మెగా టోర్నీ త్వరలో ప్రారంభం కానుంది. ఈసారి కొత్తగా రెండు జట్లు బరిలో నిలువనుండటంతో మళ్లీ ఆటగాళ్ల వేలంపాటలు షూరు కానున్నాయి. ఈనేపథ్యంలోనే ఐపీఎల్ కు చెందిన ఎనిమిది ప్రాంచైజీ జట్లు కీలక ప్లేయర్స్ ను తమ వద్ద అంటిపెట్టుకోగా మిగిలిన ప్లేయర్స్ ను వేలంపాటలో దక్కించుకోవాల్సి ఉంటుంది. ఈమేరకు బీసీసీఐ వేలంపాటలకు అన్ని ఏర్పాట్లను చేసింది.

RCB

ఒక్కో జట్టు గరిష్టంగా నలుగురిని రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. మొత్తంగా 32మంది ఎనిమిది ప్రాంచైజీ జట్లు రిటైన్ చేసుకునే అవకాశం ఉండగా కేవలం 27మంది మాత్రమే ఆ జట్లు అంటిపెట్టున్నాయి. కొందరు ప్లేయర్స్ వేలంపాటలకే మొగ్గుచూపడంతో ఆ జట్లు ఆమేరకు వాళ్లను వదులుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు వేలంపాటల్లో సీనియర్స్ ప్లేయర్స్ కే ప్రాంచైజీలు మొగ్గుచూపే అవకాశం మొండుగా ఉంది.

దీంతో ఈసారి వేలంపాటలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ వార్నర్, రషీధ్ ఖాన్ , శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ప్లేయర్స్ ఈసారి వేలం పాటల్లో పాల్గొనబోతున్నారు. దీంతో వీరిలో ఏ ప్లేయర్స్ కు అత్యధిక ధర పలుకుతుందోనన్న ఆసక్తి క్రికెట్ ప్రియుల్లో నెలకొంది. దీంతో ఆయా ప్రాంచైజీలు ఆటగాళ్లు ఆడేలా భారీ ఆఫర్లు ఇస్తూ తమవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

కోహ్లీ సారథ్యం వహిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) సన్ రైజర్ జట్టు కెప్టెన్, ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ పై కన్నేసింది. వార్నర్ రాకకు కోహ్లీ సైతం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రాంచైజీలు అతడిని దక్కించుకునేందుకు భారీ స్కెచ్ వేస్తున్నాయి. ప్రస్తుతం ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ, గ్లేన్ మ్యాక్స్ వెల్, మహమ్మద్ సిరాజ్ ఉన్నారు.

ఆర్సీబీలోకి డేవిడ్ వార్నర్ వస్తే బ్యాటింగ్ కు అదనపు బలంగా మారే అవకాశం ఉంది. అలాగే కెప్టెన్సీకి అదనపు అప్షన్ కూడా లభిస్తోంది. దీంతో ఆర్సీబీ జట్టు ఆసీస్ కే చెందిన మరో ఆటగాడు మ్యాక్స్ వెల్ తో రాయబారం చేస్తోంది. ఆర్సీబీలోకి వచ్చేందుకు వార్నర్ సైతం ఇంట్రెస్ట్ చూపుతున్నాడని తెలుస్తోంది. ఇటీవల డేవిడ్ వార్నర్ చేస్తున్న పనులే ఇందుకు నిదర్శనంగా కన్పిస్తున్నాయి.

డేవిడ్ వార్నర్ లేటెస్ట్ గా ఫేస్ యాప్ సాయంతో పునీత్ రాజ్ కుమార్ వీడియోచేసి అభిమానులను అలరించాడు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ తమ జట్టుకు ఆడాలని వార్నర్ ని కోరుతున్నారు. ఆ తర్వాత పుష్ప సినిమాలోని ‘యే బిడ్డా.. ఇది నా అడ్డా’ అనే పాటను ఇమిటేట్ చేస్తూ రూపొందించిన వీడియోను వార్నర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు.

Also Read: రోహిత్ వైదొలిగాడు.. కోహ్లీ నా వల్ల కాదన్నాడు.. టీమిండియా పరిస్థితేంటి?
ఈ వీడియోకు విరాట్ కోహ్లీ స్పందిస్తూ.. అంతా ఒకేనా డేవిడ్ భాయ్ అని కామెంట్ చేశాడు. దీనికి వార్నర్ స్పందిస్తూ కొంచెం మెడల నొప్పిగా ఉందటూ కామెంట్ చేయడం కన్పించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా విరాట్ డేవిడ్ వార్నర్ వీడియోకు స్పందించడంతో అభిమానులు కొత్త చర్చకు తెరలేపారు.

గతంలోనూ కోహ్లీ మాక్స్ వెల్ జట్టులోకి వచ్చే సమయంలో ఇలానే హింట్ ఇచ్చాడని ఇప్పుడు కూడా ఇదే జరుగబోతుందని అంటున్నారు. డేవిడ్ వార్నర్ కోసమే యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్‌ను ఆర్సీబీ రిటైన్ చేసుకోలేదనే కామెంట్స్ విన్పిస్తున్నాయి. ఏదీఏమైనా వార్నర్ ఆర్సీబీలోకి వస్తే ఆ జట్టుకు మరింత బలం పెరగడం ఖాయంగా కన్పిస్తోంది.

Also Read: దక్షిణాఫ్రికా పర్యటనకు రోహిత్ శర్మ దూరమేనా?