Chanakya Niti: ఆచార్య చాణక్యుని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మనిషి జీవితాన్ని అవపోసన పట్టిన అపర మేధావి.. తరతరాలకు చెరగని విజ్ఞానాన్ని అందించిన అపర చాణక్యుడు ఒక మనిషి జీవితంలో ఎలా బ్రతకాలి.. ఎలా ఉండాలి.. ఎలాంటి వ్యక్తులతో పరిచయం పెంచుకోవాలి..
భార్య భర్తలు ఎలా అన్యోన్యంగా ఉండాలి అనే ఎన్నో విషయాల గురించి చాణిక్యనీతి గ్రంథంలో ఎంతో అద్భుతంగా వివరించారు. ఈ క్రమంలోనే మనకు నిజమైన స్నేహితుడు ఎవరు నిజమైన స్నేహితులలో ఏ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి అనే విషయాన్ని కూడా ఆయన తెలిపారు. మరి నిజమైన స్నేహితుడిలో ఉండే లక్షణాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం….
కష్టాలలో మద్దతు నిలబడటం: మనం ఏదైనా కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు ఎవరైతే మనకు మద్దతు తెలుపుతూ మనకు అండగా నిలబడతారో వారే నిజమైన స్నేహితుడు. ఇలాంటి వారితో తప్పకుండా స్నేహం చేయవచ్చు. ఎప్పుడు మనతో కలిసి ఉండి కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని వదిలేసిన వారితో స్నేహం చేయకూడదు.
ఆర్థిక ఇబ్బందులలో సహాయం చేసేవాడు: మనం కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నప్పుడు ఎవరైతే మనకు ఆర్థిక సహాయం చేసి మనకు చేయూతనిస్తున్నారో అలాంటి వారే నిజమైన స్నేహితులు మీ సమస్యలను అర్థం చేసుకుని మీకు తోడుగా వచ్చేవారే మంచి స్నేహితులు.
Also Read: విడిపోయిన వారితో కలవడానికి ఈ 5 రాశుల వారు ఏ మాత్రం ఆలోచించరు..?
అండగా నిలబడేవారు: మీ కుటుంబంలో ఎవరైనా వ్యక్తులు చనిపోయినప్పుడు లేదా మీ ఆప్తులు చనిపోయినప్పుడు వారు మీతో పాటే ఉండి మీకు ఎవరైతే ఓదార్పు ఇచ్చి మీకు అండగా నిలబడే వ్యక్తులే నిజమైన స్నేహితులు.
అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో తోడుగా ఉండేవారు: మీరు ఎంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు నిత్యం మీ వెంటే ఉండి మీకు సహాయం చేసే వారే నిజమైన స్నేహితులు. ఇలా మీ కష్టంలో మీ బాధలో మీ వెంటే ఉండి మీకు చేయూతనిస్తూ మిమ్మల్ని ప్రోత్సహించే వారే నిజమైన స్నేహితులు ఇలాంటి వారితో స్నేహం చేయాలని చాణిక్య నీతి గ్రంథం ద్వారా తెలిపారు.
Also Read: మోక్షద ఏకాదశి అంటే ఏమిటి.. విష్ణుమూర్తిని ఎలా పూజించాలి?