Homeజాతీయ వార్తలుFake Currency Racket: కాషాయం ముసుగులో నకిలీ కరెన్సీ వ్యాపారం.. గుజారాల్‌తో ముఠా గుట్టురట్టు!

Fake Currency Racket: కాషాయం ముసుగులో నకిలీ కరెన్సీ వ్యాపారం.. గుజారాల్‌తో ముఠా గుట్టురట్టు!

Fake Currency Racket: కాషాయం కట్టిన ప్రతీవాడు హిందువు కాదు. సన్యాసి కాదు. సర్వసంగ పరిత్యాగి అనుకుంటే కూడా పొరపాటే అవుతుంది. కాషాయం ముసుగులో ఐఎస్‌ఐ ఏజెంట్లు, నకిలీ నోట్ల చలామణి చేసే వ్యక్తుల కూడా కావొచ్చు. ప్రస్తుతం భారత్‌లో పెరుగుతున్న హిందూఇజం, దేశభక్తిని కొన్ని అసాంఘిక శక్తులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. అలాంటి ఒక అసాంఘిక ముఠాను గుజరాత్‌ పోలీసులు పట్టుకున్నారు. రూ.2.30 కోట్ల ఫేక్‌ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. ఫౌండేషన్‌ పేరిట కార్యక్రమాలు.. ప్రదీప్‌ […]

Fake Currency Racket: కాషాయం కట్టిన ప్రతీవాడు హిందువు కాదు. సన్యాసి కాదు. సర్వసంగ పరిత్యాగి అనుకుంటే కూడా పొరపాటే అవుతుంది. కాషాయం ముసుగులో ఐఎస్‌ఐ ఏజెంట్లు, నకిలీ నోట్ల చలామణి చేసే వ్యక్తుల కూడా కావొచ్చు. ప్రస్తుతం భారత్‌లో పెరుగుతున్న హిందూఇజం, దేశభక్తిని కొన్ని అసాంఘిక శక్తులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయి. అలాంటి ఒక అసాంఘిక ముఠాను గుజరాత్‌ పోలీసులు పట్టుకున్నారు. రూ.2.30 కోట్ల ఫేక్‌ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.

ఫౌండేషన్‌ పేరిట కార్యక్రమాలు..
ప్రదీప్‌ గురూజీ సత్యయోగ ఫౌండేషన్‌ పేరిట యోగా, ఆధ్యాత్మిక చర్యలు నడుపుతూ, లోపల చైనా దిగుమతి ప్రింటర్లతో నోట్లు ముద్రణ చేస్తున్నారు. తెల్ల ఫార్చూనర్‌ కారులో తిరిగే గురూజీ దగ్గర అనుమానంతో తనిఖీల్లో 40 వేలకు పైగా నకిలీ రూ.500 నోట్లు దొరికాయి. వీటి విలువ రూ.2.30 కోట్లు. భారత్‌ పటేల్, ముఖేష్‌ తుమర్‌లు సాంకేతిక సహాయం అందించారు.

చలామణి వ్యూహం
భక్తులు, శిష్యులను ఉపయోగించి నగదు చెలామణి చేయాలని రూపొందించారు. ఏఐ సాంకేతికతతో సీరియల్‌ నంబర్లు మార్చి హై–క్వాలిటీ నోట్లు తయారు చేశారు. ఇదంతా ఎందుకు ఛేస్తున్నావని ప్రదీప్‌ గురూజీని అడిగితే ‘ధర్మ కార్యాలు, ప్రజా సేవ కోసమే‘ అని సమాధానం చెప్పాడు.

అహ్మదాబాద్‌ క్రై మ్‌ బ్రాంచ్‌ ప్రదీప్‌ గురూజీతోపాటు ఆరుగురిని అరెస్ట్‌ చేసి, జైలుకు పంపించారు. ఆర్బీఐ, ఫొరెన్సిక్‌ టీమ్‌లతో లోతైన దర్యాప్తు జరుగుతోంది. రాజకీయ, మాజీ అధికారుల సంబంధాలు, ప్రభుత్వ వాహనాల మాస్క్‌లు ఈ నెట్‌వర్క్‌ విస్తృతిని సూచిస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper