నెక్స్ట్ మాజీ మంత్రి పితాని జైలుకెళ్లడం ఖాయమట..

ఏపీ సీఎం జగన్ టీడీపీ నేతలను వేటాడేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా తనను ముప్పుతిప్పలు పెట్టిన వారి లూప్ హోల్స్ ను అధికారంలో ఉండి తవ్వి తీస్తున్నారు. ఇటీవలే వైఎస్ జగన్ సర్కార్ టీడీపీ ముఖ్య నాయకులను ఒకేరోజు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు, జేసీ ట్రావెల్స్ మోసంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో మీడియా ఫోకస్ అంతా టీడీపీపై పడింది. టీడీపీ నేతలు, శ్రేణులంతా షాక్ […]

Written By: NARESH, Updated On : July 13, 2020 6:01 pm
Follow us on


ఏపీ సీఎం జగన్ టీడీపీ నేతలను వేటాడేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా తనను ముప్పుతిప్పలు పెట్టిన వారి లూప్ హోల్స్ ను అధికారంలో ఉండి తవ్వి తీస్తున్నారు. ఇటీవలే వైఎస్ జగన్ సర్కార్ టీడీపీ ముఖ్య నాయకులను ఒకేరోజు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు, జేసీ ట్రావెల్స్ మోసంలో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో మీడియా ఫోకస్ అంతా టీడీపీపై పడింది. టీడీపీ నేతలు, శ్రేణులంతా షాక్ కు గురై ఆందోళనలో ఉన్నారు.

జేసీ ఫ్యామిలీని పరామర్శించడానికి వెళుతున్న నారా లోకేష్.. అచ్చెన్నాయుడు ఫ్యామిలీ వద్దకు, అచ్చెన్న వద్దకు వెళ్లే సాహసం చేయడం లేదు. ఎందుకంటే ఈఎస్ఐ స్కాంతోపాటు ఫైబర్ గ్రిడ్, సహా చంద్రబాబు పాలనలో నారాలోకేష్ కీలకంగా వ్యవహరించారు. ఇప్పుడు అచ్చెన్నను కలిస్తే పాత విషయాలు తవ్వుకున్నట్టు ఉంటుందని అచ్చెన్న ముఖం చూడడానికి కూడా లోకేష్ బాబు సాహసించడం లేదని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అచ్చెన్నను లోకేష్ పూర్తిగా విస్మరించడానికి కారణం అదేనా అన్న చర్చ మొదలైంది.

ఆనంతో… రఘురామ్, ఏం జరుగుతుంది జగన్ ?

ఇక అచ్చెన్నాయుడు, జేసీ ఫ్యామిలీ తర్వాత వైసీపీ ప్రభుత్వం నెక్ట్స్ టార్గెట్ ఎవరనే చర్చ ఇప్పుడు టీడీపీ వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల టీడీపీ మాజీ మంత్రి పీఏపై కేసులు బుక్ కావడంతో నెక్ట్స్ ఆయనేనని అంటున్నారు.

అచ్చెన్నాయుడు తర్వాత అదే కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు పితాని సత్యనారాయణ. ఇప్పుడు ఆయన టార్గెట్ గా రాజకీయ ప్రచారం సాగుతుండడంతో పితాని ఆందోళన చెందుతున్నారు. పితాని సత్యనారాయణ మాజీ పీఎస్ మురళీ మోహన్ ను గత శుక్రవారం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సచివాలయంలో విధుల్లో ఉన్న మురళీ మోహన్ ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈఎస్ఐ స్కాంలో మాజీ మంత్రి పితాని కుమారుడు, మాజీ పీఎస్ మురళీ మోహన్ ప్రమేయం ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ తాజాగా మురళీ మోహన్ ను అదుపులోకి తీసుకుంది.

ఇక అంతకుముందే మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కుమారుడు సురేష్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇదే కేసుకు సంబంధించి పితాని వ్యక్తిగత కార్యదర్శి (పీఎస్)గా పనిచేసిన మురళి మోహన్ కూడా కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు తన తీర్పును రిజర్వు చేసింది. ఇంతలోనే మాజీ పీఎస్ ను ఏసీబీ అదుపులోకి తీసుకోవడం గమనార్హం.

పితాని సత్యనారాయణ కుమారుడిని ఏసీబీ అరెస్ట్ చేయబోతోందంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగడంతో పితాని స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈ ఆరోపణలు ఖండించారు. గత ప్రభుత్వ హయాంలో అచ్చెన్నాయుడు తర్వాత కార్మికశాఖ మంత్రిగా పితాని పనిచేశారు. ఈఎస్ఐ స్కాంలో తరువాత కీలక పాత్ర పోషించింది ఈయనేనని ఏసీబీ తేల్చినట్టు సమాచారం. అధికార పార్టీ నేతలు ఈ మేరకు ప్రచారం చేస్తున్నారని అంటున్నారు.

వైసీపీ టార్గెట్: టీడీపీలో నెక్స్ట్ ఎవరు

ఈఎస్‌ఐ మెడికల్‌ స్కాంకి సంబంధించి మురళీమోహన్‌ పాత్రపై ఏసీబీ దగ్గర పక్కా ఆధారాలు ఏసీబీ వద్ద ఉన్నాయని తెలిసింది. ఈ ఆధారాల్లో పితాని సురేష్‌ వ్యవహారం కూడా బయటపడిందంటూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ, అటు మీడియా వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది.మరోపక్క మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా ఈ కేసులో అడ్డంగా ఇరుక్కుపోయారనీ, పితాని సురేష్‌ తర్వాతి అరెస్ట్‌ పితాని సత్యనారాయణదేనంటూ అధికార పార్టీ పరోక్షంగా సంకేతాలు పంపుతోంది. ఇది చిన్న స్కాం కాదు.. చాలా చాలా పెద్దది అంటోంది అధికార పక్షం. అందుకు తగ్గట్టుగానే అరెస్టుల పర్వం నడుస్తోంది.

ఎవరి వాదనలు ఎలా ఈఎస్ఐ కొనుగోళ్లలతో తనకు ఎలాంటి సంబంధం లేదని గతంలో బుకాయించిన అచ్చెన్నాయుడు ఇప్పటికే అరెస్టయ్యారు.. ఇప్పుడు తనకు సంబంధం లేదంటూ ఇప్పటికే పితాని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఇప్పుడు అధికారవర్గాల సమాచారం ప్రకారం పితాని సత్యనారాయణ కూడా అరెస్టయ్యే పరిస్థితులు కన్పిస్తున్నాయంటున్నారు. ముందస్తు బెయిల్‌ కోసం ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయించిన పితాని సురేష్‌, కోర్టు నుంచి ఉపశమనం దొరికే చాన్స్ కనిపించడం లేదు.. కానీ ఏసీబీ మాత్రం.. ఈ కేసుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లే కన్పిస్తోంది. నెక్ట్స్ అరెస్ట్ అయ్యేది పితాని అని కన్ఫం అవుతోంది. రేపోమాపో పితాని కూడా జైలు కెళ్లడం ఖాయమంటున్నారు.