కాంగ్రెస్ ను వీడుతున్న యువతరం.. ఎందుకు?

కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అక్కర్లేదు డ్యూడ్ అంటారు. ఆ సినిమా డైలాగ్ రాజకీయాల్లో బాగా పేలుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కంటే ఆ పార్టీని నడిపించిన వారి వల్లే ఆ పార్టీ ఇన్నాళ్లు దేశంలో బలీయమైన శక్తిగా కొనసాగింది. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ లాంటి బలమైన నేతలే ఆ పార్టీకి ఆయువు పట్టుగా ఉన్నారు. కానీ ఇప్పుడా శక్తే లేకుండాపోయింది వృద్ధ జంబూకాలతో యువరక్తానికి అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ తన గోతిని తానే తవ్వుకుంటోంది. కాంగ్రెస్ […]

Written By: NARESH, Updated On : July 13, 2020 5:57 pm
Follow us on


కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అక్కర్లేదు డ్యూడ్ అంటారు. ఆ సినిమా డైలాగ్ రాజకీయాల్లో బాగా పేలుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కంటే ఆ పార్టీని నడిపించిన వారి వల్లే ఆ పార్టీ ఇన్నాళ్లు దేశంలో బలీయమైన శక్తిగా కొనసాగింది. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ లాంటి బలమైన నేతలే ఆ పార్టీకి ఆయువు పట్టుగా ఉన్నారు. కానీ ఇప్పుడా శక్తే లేకుండాపోయింది వృద్ధ జంబూకాలతో యువరక్తానికి అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ తన గోతిని తానే తవ్వుకుంటోంది. కాంగ్రెస్ పార్టీలో ధ్రువతారలుగా వెలిగారు వై.యెస్.రాజశేఖర్ రెడ్డి, మాధవరావు సింధియా, రాజేష్ పైలట్ లు. ఈ ముగ్గురు కూడా కాంగ్రెస్ పార్టీలో సొంతంగా ఎదిగిన మూడు రాష్ట్రాల నాయకులు. ముగ్గురు కూడా ప్రజాదరణ కలిగిన నాయకులు. ముగ్గురిది సుదీర్ఘ ప్రజా రాజకీయ ప్రయాణం. కానీ ఇప్పుడా ముగ్గురు నేతల కుటుంబాలు కాంగ్రెస్ కు దూరమైపోయాయి. తమ ప్రతిభతో ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన ఈ మూడు ఫ్యామిలీల కుటుంబాలను కాంగ్రెస్ పార్టీ చేజేతులారా వదులుకుంది. ఇప్పుడు అనుభవిస్తోంది.

కాంగ్రెస్ ను ఖతం చేసేందుకు మోడీషా ప్లాన్?

బీజేపీలో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, యశ్వంత్ సిన్హా, ఉమా భారతి, మేనకాగాంధీ, సుష్మ స్వరాజ్ లాంటి 75 ఏళ్లు దాటిన వారిని మోడీ తన కేబినెట్ లోకి తీసుకోకుండా యువతకు పెద్ద పీటవేశాడు. కానీ అదే పని కాంగ్రెస్ చేయలేకపోయింది.ఇప్పుడు 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ వృద్ధ జంబూకాలతో యువతరానికి చోటే లేకుండా చేస్తోంది.. అందుకే ఇప్పుడు ఒక్కో రాష్ట్రాన్ని వదులుకుంటోంది.

కాంగ్రెస్ కు రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉన్న వేళ 2018 డిసెంబర్ లో 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 రాష్ట్రాలను గెలిపించాడు. మధ్యప్రదేశ్ లో సింధియాను, రాజస్థాన్ లో సచిన్ పైలెట్ ను సీఎం చేద్దామని అనుకున్నారు. సీనియర్లు అయిన అశోక్ గెహ్లాట్, కమల్ నాథ్ లను పక్కనపెట్టారు. కానీ సోనియా రంగ ప్రవేశం చేసి సీనియర్లకే పెద్దపీట వేసి జూనియర్లు సింధియా, పైలెట్ లను పక్కనపెట్టింది. వ్యతిరేకించిన రాహుల్ గాంధీని నోరుమూయించింది. ఫలితం ఇప్పుడు మధ్యప్రదేశ్ లో తనకు సీఎం పదవి ఇవ్వని కాంగ్రెస్ నుంచి సింధియా వైదొలిగారు. బీజేపీలో చేరారు. ఆ రాష్ట్రం బీజేపీ వశమైంది. ఇప్పుడు రాజస్థాన్ లోనూ అదే కథ. సచిన్ పైలెట్ తాజాగా 30మంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేశారు. సీఎం అవ్వాల్సిన సచిన్ పైలెట్ ను పక్కనపెట్టి రాహుల్ వద్దంటున్నా అక్కడ అశోక్ గెహ్లాట్ ను సీఎం చేసింది సోనియా.. ఫలితం ఇప్పుడు సచిన్ పైలట్ తిరుగుబాటుతో రాజస్థాన్ లో కాంగ్రెస్ సర్కార్ కూలుతోంది. ఇలా ప్రజల్లో పోరాడుతున్న.. ఫేం ఉన్న యువనేతలకు రాజకీయ అధికారం ఇవ్వకుండా వృద్ధ జంబూకాలను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ అథోగతి పాలవుతోంది. రాహుల్ చెప్పినా.. సోనియా ఇతర సీనియర్ల ధాటికి కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

యుపి లో బ్రాహ్మణ కార్డు బయటకు తీసిన కాంగ్రెస్

కాంగ్రెస్ పార్టీలో వెలుగు వెలిగిన ఆ ముగ్గురి వారసులు జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోనే తమ రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. జ్యోతిరాదిత్య సిందియా, సచిన్ పైలట్ మళ్ళీ కేంద్ర మంత్రులయ్యారు. కాకపోతే జ్యోతిరాదిత్య , సచిన్ పైలట్ సుమారు 20 ఏళ్ళు కాంగ్రెస్ లో ఉండి ఎన్నో అధికార పదవులు అనుభవించి కొన్ని కారణాల వల్ల పార్టీ అధిస్థానం మాటకు భిన్నంగా తమ వ్యతిరేక పార్టీ అయిన బీజేపీ తో చేతులు కలిపారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తను ఎంపిగా ఎన్నికైన రెండేళ్లలోనే 2011 కేంద్రంలో, రాష్ట్రంలో వివిధ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మోసం చేయలేదు. ఏపీలో ప్రభుత్వాన్ని కూల్చలేదు. బయటకొచ్చి సొంతంగా ఎదిగాలనుకున్నారు. పూర్తిగా ప్రజా బలంతో, ప్రజాస్వామ్యయుతంగా ఎంత అణిచివేసినా తిరుగులేని ప్రజాదరణతో 2019లో అధికారం చేపట్టాడు. పై ఇద్దరి వారసులకి తనకు ఉన్న తేడాను చూపించాడు జగన్.

ఇవాళా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో కనీసం కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యంత బలమైన రాష్ట్రం. కానీ నేడు ఇప్పుడు అదే రాష్ట్రంలో నామరూపాల్లేకుండా పోవడం స్వయంకృతాపరాధం..ప్రజాదరణ ఉండి రాష్ట్ర స్థాయిలో నాయకత్వ లక్షణాలు ఉన్న శరద్ పవార్, మమతా బెనర్జీ.. సిందియా, పైలట్, వై.యెస్.జగన్ లాంటి యువ నాయకులను కోల్పోతున్న కాంగ్రెస్ తన ప్రాభవాన్ని పోగొట్టుకుని దేశంలో రోజురోజుకూ మరింత బలహీనమైపోతోంది. సీనియర్లనే పట్టుకొని యువనేతలను వదిలేస్తున్న కాంగ్రెస్ పార్టీ అందుకు తగ్గ ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.