Homeఆంధ్రప్రదేశ్‌Nagababu: అన్నయ్య తప్ప అందరూ నటించారు.. భీమవరం సభపై నాగబాబు షాకింగ్ కామెంట్

Nagababu: అన్నయ్య తప్ప అందరూ నటించారు.. భీమవరం సభపై నాగబాబు షాకింగ్ కామెంట్

Nagababu: ప్రధాని మోదీ ఏపీ టూర్ సక్సెస్ అయ్యింది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహావిష్కరణకు ప్రధాని మోదీ హాజరయ్యారు. క్షత్రియ సమాజం ఏర్పాటుచేసిన విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. కార్యక్రమం జరిగి రోజులు గడుస్తున్నా… కార్యక్రమ నిర్వహణలో లోపాలు వివాదాలకు దారితీశాయి. ఇప్పటికీ చర్చనీయాంశంగా మారాయి. కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అర్కే రోజా అధికారికంగా హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో సోము వీర్రాజు పాల్గొన్నారు. అయితే అనూహ్యంగా ప్రత్యేక ఆహ్వానం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి కార్యక్రమానికి హాజరయ్యారు.

Nagababu
Nagababu

అయితే స్థానిక ఎంపీ రఘురామరాజుకు మాత్రం కార్యక్రమానికి దూరంగా ఉంచారు. అటు బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి క్రిష్ణంరాజుకు సైతం ఆహ్వానం లేదు. అటు క్షత్రియ సామాజికవర్గానికి చెందిన అశోక్ గజపతిరాజును సైతం విస్మరించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హాజరైనా ప్రధాని మోదీ స్వాగతం పలికే జాబితాలో పేరు లేదని అడ్డుకున్నారు. ఇన్ని వివాదాల నడుమ జరిగిన కార్యక్రమానికి చిరంజీవిని మాత్రం కేంద్ర పర్యాటక శాఖ మాజీ మంత్రి హోదాలో పిలిచినట్టు చెప్పుకుంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా మెగా బ్రదర్ నాగబాబు అల్లూరి విగ్రహావిష్కరణ సభపై ట్విట్టర్ లో కామెంట్ పోస్టు చేశారు. ఇది పెద్ద దుమారమే రేపుతోంది. కార్యక్రమంలో మా అన్నయ్య తప్పించి అందరూ మహా నటులే అన్నది ట్విట్ సారాంశం. దీంతో ఇది తెగ ట్రోల్ అవుతోంది. చర్చనీయాంశంగా మారుతోంది. జనసేన సైనికులు సంతోషంతో రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. మరోవైపు బీజేపీ శ్రేణులు మాత్రం తప్పుపడుతున్నారు.

Also Read: BJP- Rajya Sabha: ఆ నలుగురికి రాజ్యసభ ఎంపికతో బీజేపీకి లాభం ఏంటి?

బీజేపీ శ్రేణులు గరం గరం..
అల్లూరి విగ్రహావిష్కరణ సభలో సోదరుడు చిరంజీవి అంటూ సీఎం జగన్ సంబోధించారు. ఆత్మీయ ఆలింగనం సైతం చేసుకున్నారు. అటు ప్రధాని మోదీ కూడా వేదికపై ఉన్న ఇతర పెద్దల కంటే చిరంజీవికి ప్రాధాన్యత ఇచ్చారు. అప్యాయంగా పలకరించి ప్రత్యేకించి మాట్లాడారు. అటువంటి సభపై నాగబాబు తాజా కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల ఏపీ ప్రభుత్వ తీరుపై నాగబాబు విరుచుకుపడుతున్నారు. పాలనా వైఫల్యాలను ఎండగడుతున్నారు. అయితే నాగబాబు సీఎం జగన్, మంత్రి రోజాపై ట్విట్ చేసి ఉంటారన్నది అందరికీ తెలుసు. కానీ మా అన్నయ్య తప్ప అందరూ అద్బుతంగా నటించారని కామెంట్ చేయడంపై బీజేపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ప్రధాని మోదీ, గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు సైతం నటులేనా? వారు నటించారా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అయితే దీనిపై నాగబాబు నుంచి ఎటువంటి స్పందన లేదు. బీజేపీ అభిమానులు ఒక అడుగు ముందుకేసి అంత ఇబ్బందిగా ఉంటే బీజేపీతో తెగతెంపులు చేసుకోండి అంటూ సవాల్ చేస్తున్నారు. బీజేపీ నేతలను అవమానించే విధంగా ట్విట్లు పెడితే సహించేది లేదని హెచ్చరించారు.

Nagababu
Nagababu

జన సైనికుల ఆగ్రహం..
మరోవైపు ఇదే సభలో చిరంజీవిని సీఎం జగన్ సంబోధించడంపై జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఆత్మీయ ఆలింగనం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదంతా నటనగా అభిప్రాయపడుతున్నారు. సరిగ్గా అదే సమమంలో నాగబాబు ట్విట్ తో మరింత దుమారం రేగింది. వాస్తవానికి బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న జనసేన అధ్యక్షుడి హోదాలో పవన్ కళ్యాణ్ కు లిఖితపూర్వకంగా ఎటువంటి ఆహ్వానం అందలేదు. దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. బీజేపీ, జనసేన మైత్రిపై తెగ చర్చలు నడిచాయి. దీంతో కార్యక్రమానికి ఒక రోజు ముందు పవన్ కు ఫోన్ చేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. దీనిపై పవన్ అంతగా ఆసక్తి చూపలేదు. తాను రాలేనని సైతం పవన్ తేల్చి చెప్పేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తడితోనే పవన్ కు ఆహ్వానం రాలేదని జనసేన శ్రేణులు గుర్రుగా ఉన్నాయి. అదే సమయంలో చిరంజీవికి ప్రత్యేక ఆహ్వానం అందింది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాదని.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక ఆహ్వానం పంపారని జన సైనికులు చెబుతున్నారు. కానీ సభలో మాత్రం జగన్ చిరంజీవిపై ప్రేమ ఒలకబోశారని.. అదంతా నటనేనని చెప్పుకొస్తున్నారు. దీనికి ఆజ్యం పోసేలా నాగబాబు ట్విట్ చేయడం గమనార్హం.

Also Read: YCP Plenary: తొలి ప్లీనరీ.. వైసీపీ రాజ్యాంగంలో ‘రాజు’ జగన్..?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

2 COMMENTS

Comments are closed.

RELATED ARTICLES

Most Popular