Sai Pallavi: సాయి పల్లవి చాలా కూల్. పెద్దగా వివాదాల జోలికి పోదు. కానీ.. ‘విరాటపర్వం’ సినిమా ప్రచారంలో సాయి పల్లవి నోరు జారింది. ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా గురించి మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. దాంతో భజరంగ్ దళ్ సభ్యులు సుల్తాన్ బజార్ పీఎస్‌లో సాయి పల్లవి పై ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. సాయిపల్లవికి గత నెల 21న నోటీసులు జారీ చేయడం జరిగింది.

అయితే, తనకు ఇచ్చిన నోటీసులను రద్దు చేయాలని కోరుతూ సాయి పల్లవి హైకోర్టును వేడుకుంది. కానీ.. సాయి పల్లవి పై వచ్చిన నోటీసులను రద్దు చేయడం కుదరదు అని, కాబట్టి.. సాయి పల్లవి అభ్యర్థనను తిరస్కరిస్తున్నాం అని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో సాయి పల్లవి పిటిషన్ కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: Eesha Rebba: బెడ్ పై పడుకుని షర్ట్ విప్పేసిన ‘ఈషా రెబ్బా’.. వాటి కోసమే
మొత్తానికి ‘కశ్మీర్ ఫైల్స్’ సినిమా గురించి మాట్లాడుతూ అనవసరంగా సాయి పల్లవి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. తప్పు చేసిందని.. ఆమె అభిమానులు ఫీల్ అవుతూ మెసేజ్ లు చేస్తున్నారు. అసలు హీరోయిన్ సాయి పల్లవి అంటేనే హోమ్లీ బ్యూటీ. ఫ్యామిలీ హీరోయిన్. సింపుల్ గా చెప్పాలంటే… సాయిపల్లవి రెగ్యులర్ హీరోయిన్లకు పూర్తి భిన్నం.

సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ లు కుటుంబ బంధాలను బలంగా చాటే విధంగా ఉంటాయి. అన్నిటికీ మించి సాయి పల్లవి సింప్లిసిటీకి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. అలాంటి హీరోయిన్ పేరు ప్రస్తుతం వివాదాల్లో నలగడం నిజంగా బాధాకరమైన విషయమే. సాయి పల్లవి త్వరగా ఈ వివాదం నుంచి బయట పడాలని కోరుకుందాం.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ కు సాయి పల్లవి ఫిక్స్ అయ్యింది అని గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతుందట.
Also Read:Naresh Third Wife Ramya Raghupathi: వామ్మో.. నరేష్ మూడవ భార్య ఇంత నీచురాలా? బయటపడిన షాకింగ్ నిజాలు