రోజువారీ కార్యక్రమాలకు వెళ్లేవారు.. ఆడుకుంటూ ఉండే చిన్నపిల్లలు.. అప్ప్పుడే ఒకరినొకరు మాట్లాడుకున్నవారు.. ఒక్కసారిగా మూర్చపడి పోవడం.. అస్వస్థతకు గురి కావడంతో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కలకలం రేపింది. మొదట ఒక్కక్కొరుగా ఉన్న బాధితులు ఇప్పటి వరకు 500 లకు పైగానే పెరిగారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమించి మరణించారు. మరి కొందరు డిశ్చార్జి అయ్యారు. అయితే ఈ సంఘటనపై జగన్ ప్రభుత్వ తీరును చూసి కొందరు విమర్శలు చేస్తున్నారు. ప్రజలు వ్యాధి ఏంటో తెలియక అస్వస్థతకు గురవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై రకరకాలుగా అనుకుంటున్నారు.
Also Read: ఏలూరు బాధితులకు సాయమేదీ?
గతంలో విశాఖ పట్నంలోని ఎల్జీ పాలీమర్ కంపెనీ గ్యాస్ లీకై పదుల సంఖ్యలో మరణించారు. ఇంకొందరు ఇప్పటికీ కోలుకోవడం లేదు. దీంతో అప్పడు ప్రభుత్వం అప్రమత్తమై రూ. కోటి చొప్పున పరిహారం ప్రకటించింది. అలాగే ఇంటికో రూ.10 వేల చొప్పున అందించింది. అయితే అంతపెద్ద ఘటన కాకపోయిన ఎంతో మంది అస్వస్థకు గురైన ఏలూరు ఘటనలో ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.
వాస్తవానికి ఏలూరులో ఒకరోజు కలుషిత నీటిని తాగి అస్వస్థకు గురయ్యారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విచారణ జరపాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశాడు. అయితే ఆరోపణలు అవాస్తవమని, తాము కలుషిత నీటిని సరఫరా చేయలేదని ప్రభుత్వం నిరూపించలేకపోతుంది.ఈ సంఘటన జరిగిన మొదటి రోజు స్థానిక మంత్రి ఆళ్ల నాని కలుషిత నీరు సరఫరా కాలేదని స్పష్టం చేశారు. అలాంటప్పడు నీటి శాంపిల్స్ ను తీసుకొని పరీక్షించాలి కదా.. అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
Also Read: జగన్ కుర్చీ సేఫ్..!
మరోవైపు వ్యాధిని గుర్తించేందుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల రక్త నమూనాలను ఏయిమ్స్ వైద్యులు సేకరించారు. ఇతర వైద్య కళాశాలకు చెందిన వారు సైతం వ్యాధిని గుర్తించే పనిలో ఉన్నారు. ఇదిలా ఉండగా అస్వస్థతకు గురైన బాధితులకు గానీ.. మరణించిన వారికి గానీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి సాయం చేయలేదు. అయితే జగన్ మాత్రం పరిస్థతిపై సమీక్షిస్తున్నారు గానీ.. పరిహారం విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన చేయడం లేదు. ఇప్పటికైనా తమ సాయం గురించి ఆలోచించాలని బాధితులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్