https://oktelugu.com/

ఏలూరు బాధితులకు సాయమేదీ?

ఏలూరులో వింత వ్యాధి సోకి పెద్దసంఖ్యలో బాధితులు ఆస్పత్రి పాలయ్యారు. దీంతో అసలు ఏపీలో ఏం జరుగుతుందా? అనే ఆందోళన నెలకొంది. కలుషిత నీటిని తాగడం వల్ల ఇలా జరిగిందని తొలుత ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత వైద్య బృందం సీసం(మెటల్ సంబంధిత) నీటిని సేవించడం వల్లే ప్రజలు ఈ వింతరోగం బారిన పడినట్లు తేల్చారు. Also Read: జగన్ కుర్చీ సేఫ్..! ఏలూరు బాధితులకు ప్రభుత్వం ఆస్పత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. బాధితుల సంఖ్య […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 9, 2020 / 12:06 PM IST
    Follow us on

    ఏలూరులో వింత వ్యాధి సోకి పెద్దసంఖ్యలో బాధితులు ఆస్పత్రి పాలయ్యారు. దీంతో అసలు ఏపీలో ఏం జరుగుతుందా? అనే ఆందోళన నెలకొంది. కలుషిత నీటిని తాగడం వల్ల ఇలా జరిగిందని తొలుత ప్రభుత్వం ప్రకటించింది. ఆ తర్వాత వైద్య బృందం సీసం(మెటల్ సంబంధిత) నీటిని సేవించడం వల్లే ప్రజలు ఈ వింతరోగం బారిన పడినట్లు తేల్చారు.

    Also Read: జగన్ కుర్చీ సేఫ్..!

    ఏలూరు బాధితులకు ప్రభుత్వం ఆస్పత్రులకు తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. బాధితుల సంఖ్య భారీగా పెరగడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఏలూరు పర్యటను వెళ్లారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వివరాలను తెలుసుకున్నారు. జగన్ పర్యటన అనంతరం బాధితులకు ప్రభుత్వం నుంచి సాయం అందుతుందనే ప్రచారం జరిగింది.

    అయితే సీఎం జగన్ మాత్రం ప్రభుత్వ సాయం విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో అక్కడి ప్రజల్లో ప్రభుత్వంపై నిరసన వ్యక్తమవుతోంది. గతంలో ఎల్జీ ఘటనలో మృతులకు కోటి రూపాయాల పరిహారం చెల్లించడంతోపాటు ఒక్కో మనిషికి 10వేల సాయం అందించి జగన్ ఔదర్యం చూపారు.

    ఏలూరు బాధితుల్లో ఒకరు మృతిచెందగా 30మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మరో 500మంది విజయవాడ.. గుంటూరు ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. వీరికి ప్రభుత్వ సాయం అందుతుందని ఏలూరు ప్రజలు ఆశించారు. జగన్ ఏలూరు పర్యటన నేపథ్యంలో బాధితులను సాయం చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే జగన్ కేవలం పరామర్శలకే పరిమతమయ్యారు.

    Also Read: చంద్రబాబు విశ్వసనీయతను ప్రజలు నమ్మడం మానేశారా?

    ఓ ప్రయివేట్ కంపెనీ నిర్లక్ష్యంతో చనిపోయిన వారికి కోటి రూపాయాల సాయం ప్రకటించిన జగన్ ఏలూరు బాధితులకు కూడా సాయం అందిస్తారని ప్రచారం జరిగింది. అయితే ప్రభుత్వం ఏలూరు బాధితులకు సాయం అందించడంలో మీనమేషాలు లెక్కిస్తుండటంతో విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి.

    ఇదిలా ఉంటే ఏలూరు ఘటనపై పూర్తి వివరాలు తెలిశాక సీఎం జగన్ పరిహారం అందించే అవకాశం ఉందని వైసీపీ నేతలు చెబుతుండటంతో ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్