https://oktelugu.com/

పోలవరం బడ్జెట్లో కేంద్రం వాటా తేలేనా?

పోలవరం ప్రాజెక్టు బడ్జెట్ లో కేంద్రం వాటా ఎంతో శుక్రవారం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం తేల్చేందుకు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ శుక్రవారం సమావేశం కానున్నారు. 2017-18 లో సవరించిన అంచనా రూ.47,725.74 కోట్లకు కేంద్రం ఆమోద ముద్ర వేస్తుందా? లేక 2017 మార్చిలో కేంద్ర కేబినెట్‌ తీర్మానించిన 2013-14 అంచనా రూ.20,398.61 కోట్లకే కట్టుబడి ఉంటామని చెబుతుందా? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజానికి […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 11, 2020 1:56 pm
    Follow us on

    Polavaram budget
    పోలవరం ప్రాజెక్టు బడ్జెట్ లో కేంద్రం వాటా ఎంతో శుక్రవారం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయం తేల్చేందుకు ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ శుక్రవారం సమావేశం కానున్నారు. 2017-18 లో సవరించిన అంచనా రూ.47,725.74 కోట్లకు కేంద్రం ఆమోద ముద్ర వేస్తుందా? లేక 2017 మార్చిలో కేంద్ర కేబినెట్‌ తీర్మానించిన 2013-14 అంచనా రూ.20,398.61 కోట్లకే కట్టుబడి ఉంటామని చెబుతుందా? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నిజానికి ఈ సమావేశం గురువారమే జరగాల్సి ఉండగా.. షెకావత్‌ రాజస్థాన్‌ నుంచి రాలేకపోవడంతో శుక్రవారానికి వాయిదాపడింది.

    Also Read: వైఎస్ కు దోస్తులు.. జగన్ కు శత్రువులు..!

    గత ప్రకటన ఇదీ..
    2013-14 అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు రూ.20,398.61 కోట్లు మాత్రమే ఇవ్వగలమని.. ఈ విషయాన్ని రాష్ట్రప్రభుత్వానికి తెలియజేయాలని కేంద్ర ఆర్థిక శాఖ గతంలోనే ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి సూచించింది. పీపీఏ అత్యవసర భేటీలో కేంద్ర కేబినెట్‌ నిర్ణయాన్ని ఆమోదిస్తూ అథారిటీ తీర్మానం చేసింది. అయితే.. 2017-18 సవరించిన అంచనాల మేరకు రూ.47,725.74 కోట్లను ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశంలో గట్టిగా కోరింది. రూ.20,398 కోట్లతో ప్రాజెక్టును పూర్తిచేయలేమని.. భూసేకరణ, సహాయ పునరావాసానికే రూ.28,000 కోట్ల వరకూ వ్యయమవుతుందని ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి లేఖ కూడా రాశారు. కానీ.. కేంద్రం ఇంతవరకు ఎలాంటి స్పందనా వ్యక్తం చేయలేదు. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి ప్రాథాన్యత నెలకొంది. ఈ స్మావేశంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్.రావత్‌, రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ కూడా పాల్గొననున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్