మిత్ర దేశాలనూ వంచిస్తున్న చైనా..? లబోదిబోమంటున్న బాధిత దేశాలు..!

కరోనా వైరస్ ను పుట్టించిన చైనా గురించి అంతవరకే తెలుసు. అయితే చైనా ప్రవర్తన గురించి తెలియని మరో విషయం ఉంది. చిన్న చిన్న దేశాలకు మిత్రుత్వం అని చెప్పుకుంటూ ఆ దేశాలకు నాసిరకం వస్తువులను పంపిణీ చేస్తుంది. ఆ తరువాత ఇదేంటని సదరు దేశాలు అడిగితే బుకాయిస్తుంది. అంతేకాకుండా అవసరమైనప్పుడు ఆ దేశాలకు అప్పులిస్తూ ఆ తరువాత అప్పు పేరిట భూభాగాలను ఆక్రమించుకోవడంతో బాధిత దేశాలు లబోదిబోమంటున్నాయి. Also Read: ‘జమిలి’కి సై అంటున్న కేంద్రం.. […]

Written By: NARESH, Updated On : December 11, 2020 4:48 pm

china

Follow us on

కరోనా వైరస్ ను పుట్టించిన చైనా గురించి అంతవరకే తెలుసు. అయితే చైనా ప్రవర్తన గురించి తెలియని మరో విషయం ఉంది. చిన్న చిన్న దేశాలకు మిత్రుత్వం అని చెప్పుకుంటూ ఆ దేశాలకు నాసిరకం వస్తువులను పంపిణీ చేస్తుంది. ఆ తరువాత ఇదేంటని సదరు దేశాలు అడిగితే బుకాయిస్తుంది. అంతేకాకుండా అవసరమైనప్పుడు ఆ దేశాలకు అప్పులిస్తూ ఆ తరువాత అప్పు పేరిట భూభాగాలను ఆక్రమించుకోవడంతో బాధిత దేశాలు లబోదిబోమంటున్నాయి.

Also Read: ‘జమిలి’కి సై అంటున్న కేంద్రం.. 2022లో దేశవ్యాప్త ఎన్నికలు?

చైనా బాధిత దేశాల్లో పాకిస్థాన్, శ్రీలంక, బర్మా, బంగ్లాదేశ్, నేపాల్ లు ఉన్నాయి. సరిహద్దు దేశంగా పాకిస్థాన్ కు 2016లో ఎఫ్22 యుద్ధ నౌకలను చైనా విక్రయించింది. అవి కొద్ధి కాలానికే పనిచేయకుండా పోయాయి. వీటి గురించి ఇస్లామాబాద్ 2018లో తెలపగా బీజింగ్ మౌనంగా ఉండిపోయిందట. 2019లో ఎల్ వై 80 యుద్ధ వాహనాలు కొనుగోలు చేయగా అవి కొద్ది కాలమే పనిచేశాయి. ఇక బంగ్లాదేశ్ కు కూడా చైనా చుక్కలు చూపించింది. 2017లో రెండు జలాంతర్గములను కొనుగోలు చేసింది. వీటి ఒక్కొటి ధర రూ.800 కోట్ల పైమాటే. అయితే ఇందులో సాంకేతిక లోపాలు తలెత్తడంతో మరమ్మతులు చేయాలని చైనాను కోరింది. దీంతో మరమ్మతుల కోసం మరింత మొత్తం కావాలని అడగడంతో ఢాకా ఖంగుతిన్నది.

భారత్, చైనా మధ్య ఉన్న నేపాల్ సైతం చైనా నుంచి వై12ఈ, ఎంఏ 60 రకం యుద్ధ విమానాలు కొనుగోలు చేసింది. అయితే ఇవి బంగ్లాదేశ్ కు విక్రయించగా అక్కడ పాడవడంతో నేపాల్ కు అంటగట్టింది. ఆలస్యంగా గుర్తించిన నేపాల్ ప్రభుత్వం చైనాను గట్టిగా అడగలేకపోయింది. మరో దేశం మయన్మార్ కు చైనా నాసిరకం ఆయుధాలను విక్రయించింది. అయితే ఇది గుర్తించిన మయన్మార్ భారత్ నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడం ప్రారంభించింది.

Also Read: కరోనా వ్యాక్సిన్ పంపిణీకి ఏపీ ప్రభుత్వం సిద్ధం..! ఏర్పాట్లు రెడీ చేస్తున్న అధికారులు..

ఇలా చైనా తన మిత్ర దేశాలకు సైతం నాసిరకం వస్తువులను విక్రయిస్తూ తన గుప్పట్లోకి తెచ్చుకుంటోంది. గతంలో కరోనా సమయంలో పాకిస్థాన్ కు నాసిరకం మాస్కలు సరఫరా చేసిన చైనాపై పాకిస్థానీయులు మండిపడ్డారు. అయినా అక్కడి ప్రభుత్వం చైనాకే మద్దతు ఇవ్వడం గమనార్హం. ఇక చైనా ముందు ముందు ఎన్ని దేశాలతో ఆడుకుంటుందో చూడాలి..

మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్