ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ ద్వారా మోసాలకు పాల్పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే రోజురోజుకు ఆన్ లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు రూట్ మార్చారు. పైసా లేకుండా షాపింగ్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఎవరైనా పొరపాటున వాళ్ల మాయమాటలు నమ్మితే మాత్రం మోసపోవడం గ్యారంటీ. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ తరహా మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి.
Also Read: జీఎస్టీ చెల్లింపుదారులకు అలర్ట్.. అమల్లోకి కొత్త నిబంధనలు..?
ఎక్కువ సంఖ్యలో ప్రజలు షాపింగ్ చేసే షాపింగ్ మాల్స్ ను అడ్డుపెట్టుకుని మోసగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా మోసాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు. సైబర్ మోసగాళ్లు మొదట నగరాల్లో ఎక్కువ సంఖ్యలో ప్రజలు షాపింగ్ చేసే షాపింగ్ మాల్స్ ను ఎంచుకుంటున్నారు. మోసగాళ్లు ఒక గ్రూప్ గా ఏర్పడి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు.
Also Read: అమెజాన్ కస్టమర్లకు అలర్ట్.. ఆ కాల్స్ తో తస్మాత్ జాగ్రత్త..!
మోసగాళ్లు షాపింగ్ అయిపోయిన తరువాత డిజిటల్ పేమెంట్ యాప్ ల ద్వారా నగదు బదిలీ చేస్తామని వ్యాపారులకు చెబుతారు. ఆ తరువాత యూపీఐ అప్లికేషన్ల ద్వారా తమ మిత్రుడు నగదు బదిలీ చేస్తాడని చెబుతారు. ఆ తరువాత వ్యాపారి సెల్ నంబర్ కు నగదు జమైనట్లు ఒక మెసేజ్ కంపెనీ నుంచి వచ్చినట్టు పంపుతారు. బ్యాంకు సందేశాలు ఏ విధంగా ఉంటాయో ఈ సందేశం కూడా అదే విధంగా ఉండటం వల్ల ఎవరికీ అనుమానం కలగదు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
అయితే డబ్బు జమైనట్లు మెసేజ్ వచ్చినా బ్యాంకు ఖాతాలో నగదు జమ కాకపోవడం వల్ల డబ్బులు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ తరహా మోసాలు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో ఎంతో అప్రమత్తంగా ఉంటే మాత్రమే మోసాల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే ఛాన్స్ ఉంటుంది.