Divya Vani Resigns Row: టీడీపీ అధికార ప్రతినిధి దివ్య వాణి రాజీనామాపై గందరగోళం నెలకొంది. తెలుగుదేశం పార్టీలో హల్ చల్ స్రుష్టించింది. రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఉదయం దివ్యవాణి ట్వీట్ చేశారు. సాయంత్రానికి మనసు మార్చుకున్నారేమో కానీ డిలీట్ చేశారు. అంతటితో ఆగకుండా పార్టీలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను చంద్రబాబు, లోకేష్ దృష్టికి తీసుకెళ్తానని దివ్యవాణి మరో ట్వీట్ చేయడం గమనార్హం. మహానాడులో తనకు ఘోర అవమానం జరిగిందని రెండ్రోజుల క్రితం ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆరోపణలు చేశారు. ‘మహానాడులో నాకు ఘోర అవమానం జరిగింది. కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు.
దివ్యవాణి మాటలురాని అమ్మాయి అయితే కాదు. టీడీపీకి నేను నిస్వార్థంగా సేవ చేస్తున్నా.. గుర్తింపే లేదు. ఒక కళాకారుడు పెట్టిన పార్టీలో నాలాంటి కళాకారులకు స్థానం లేకపోవడం నన్ను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. పార్టీలో ఎలాంటి గైడెన్స్ లేదు. ఇన్ని రోజులు నేను అధికారం లేని అధికార ప్రతినిధిగా టీడీపీలో ఉన్నాను’ అని దివ్యవాణి యూట్యూబ్ చానల్లో చెప్పారు. అంతటితో ఆగని ఆమె వైసీపీ గురించి కూడా ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కానీ.. మాజీ మంత్రి కొడాలి నానితో కానీ తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని చెప్పుకొచ్చారు. తద్వారా ఆమె టీడీపీని వీడి వైసీపీలో చేరుతారని అంతా భావించారు. కానీ మంగళవారం సాయంత్రానికి సీన్ రివర్స్ అయ్యింది. రాజీనామా ట్విట్ డిలీట్ చేయడం, పార్టీలో కొనసాగుతానని స్పష్టత ఇవ్వడం జరిగిపోయింది.
Also Read: AP Teacher: మోడీ అభినందన అందుకున్న ఆంద్రప్రదేశ్ మాస్టార్ ఎవరు? ఆయన కథేంటి?
వరుస ట్విట్లు..
గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యం్లో మంగళవారం ఉదయం టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు దివ్య వాణి ట్వీట్ చేశారు. ‘తెలుగుదేశం పార్టీలో కొన్ని దుష్ట శక్తుల ప్రమేయన్ని వ్యతిరేకిస్తూ పార్టీకీ రాజీనామా చేస్తున్నాను. ఇంతవరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అని ట్విట్టర్‌లో ఆమె రాసుకొచ్చారు.
అయితే.. ఈ ట్వీట్ చేసిన కొన్ని గంటలకే ఆమె తన రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గారు. రాజీనామా చేస్తున్నట్లు చేసిన ట్వీట్‌ను డిలీట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ, ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడుతో మాట్లాడిన తర్వాత దివ్యవాణి తన రాజీనామాపై వెనక్కి తగ్గి ట్వీట్ డిలీట్ చేసినట్లు తెలిసింది. దీంతో.. దివ్యవాణి టీడీపీలోనే కొనసాగుతారని స్పష్టమైంది. ఈ గందరగోళానికి తెరపడింది. అయితే.. పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చేందుకు దివ్యవాణి ఇవాళ సాయంత్రం ప్రెస్‌మీట్ పెట్టి అన్ని వివరాలను వెల్లడించబోతున్నట్లు తెలిసింది. మొత్తం ఎపిసోడ్ లో ఫేస్ బుక్ లో వచ్చిన ఓ పోస్టే కారణమని తెలుస్తోంది. క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు పేరుతో దివ్యవాణిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఈ పోస్టింగ్ సారాంశం. దీంతో తెగ బాధపడిపోయిన దివ్యవాణి రాజీనామా అస్త్రం సంధించారు. తీరా బచ్చుల అర్జునుడితో మాట్లాడిన తరువాత సస్పెన్షన్ అంటూ ఏమీ జారీచేయలేదని చెప్పుకురావడంతో దివ్యవాణి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓ సారి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు విషయంలో కూడా ఫేస్ బుక్ లో ఇటువంటి పోస్టు తెగ హల్ చల్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీంతో దివ్యవాణికి అంతా సినిమా అర్ధమైంది. వెంటనే ఉపశమన చర్యలు ప్రారంభించారు. రాజీనామా ఎపిసోడ్ కు తెరదించి.. జరిగిన విషయాలను చంద్రబాబు, లోకేష్ ద్రుష్టికి తీసుకెళతానని తాజాగా రాసుకొచ్చారు. దీనికి ముగింపు కార్డు ఇవ్వాలని భావిస్తున్నారు.
Also Read: Pawan Kalyan Konaseema: ‘కోనసీమ’ కేసులు.. రంగంలోకి పవన్ కళ్యాణ్.. ఇక పోరాటమే!