AP Teacher: ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నాం.. కానీ పేద విద్యార్థుల కోసం ఇంత చేస్తున్న ఆ ఉపాధ్యాయుడి గురించి ఎవరికీ తెలియకపోవడం నిజంగా శోచనీయమే. ఎందుకంటే మనకు తెలియని ఆ ఉపాధ్యాయుడి గురించి మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ గొప్పగా చెప్పారు. దీంతో మన ఏపీలోని ఆ మాస్టర్ ఎవరు? ఏం సేవ చేశారు? అన్న దానిపై ఇప్పుడు అందరూ ఆరాతీస్తున్నారు.
ప్రకాశం జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ ప్రధానోపాధ్యుడిపై భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసల జల్లు కురిపించారు. రాచర్ల మండలం యడవల్లికి చెందిన మార్కాపురం రాంభూపాల్ రెడ్డి ఉద్యోగ విరమణ అనంతరం వచ్చిన లక్షల డబ్బును పేద బాలికల శ్రేయస్సుకు వెచ్చిస్తున్నారని..ప్రధాని స్వయంగా ఆయనను కొనియాడారు.
Also Read: Pawan Kalyan Konaseema: ‘కోనసీమ’ కేసులు.. రంగంలోకి పవన్ కళ్యాణ్.. ఇక పోరాటమే!
రిటైర్ మెంట్ తర్వాత రాంభూపాల్ రెడ్డి దంపతులు తమ ఆదాయం మొత్తాన్ని బాలికల విద్య కోసం ఖర్చు పెడుతున్నారని ప్రధాని మోడీ తెలిపారు. ఇప్పటివరకూ 100మందికి పైగా సుకన్య సంవృద్ధి యోజన ద్వారా బ్యాంకు అకౌంట్లు తెరిచి వారి పేరిట రూ.25 లక్షలకు పైగా జమ చేశారని కొనియాడారు. స్వలాభం కోసం కాకుండా సమాజ హితం కోసం పనిచేయడం మన సంస్కృతిలో అంతర్భాగమన్న విషయాన్ని రాంభూపాల్ రెడ్డి దంపతులు నిరూపిస్తున్నారని ప్రధాని మోడీ కొనియాడారు.
-మార్కాపురం రాంభూపాల్ రెడ్డి బయోగ్రఫీ
రాచర్ల మండలం యడవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా రాంభూపాల్ రెడ్డి పనిచేశారు. గత ఆగస్టు నెలలో ఉద్యోగ విరమణ సందర్భంగా రూ.25.72 లక్షల నగదు వచ్చింది. ఆ డబ్బును స్థానిక పోస్టాఫీసులో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయగా.. ప్రతీ మూడు నెలలకు రూ.39 వేల వరకూ వడ్డీ వస్తోంది. ఈ మొత్తాన్ని సుకన్య సమృద్ధి యోజనకు మళ్లించి యడవల్లి, చెర్లోపల్లి, అంకిరెడ్డిపల్లెలోని 88 మంది పేద బాలికల విద్యాభివృద్ధికి వెచ్చిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోడీ ఈ టీచర్ సేవలను స్వయంగా ప్రశంసించడం విశేషం.
Also Read: Singer KK : సినీ పరిశ్రమలో విషాదం.. పాట పాడుతూ ప్రముఖ సింగర్ ఇలా హఠాన్మరణం.. వీడియో