Director Boyapati: యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి తెలుగుదేశం పార్టీకి వున్న అనుబంధం గురించి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలందరికీ తెలుసు. తన రక్తంలో కూడా బాలయ్య పై, తెలుగు దేశం పార్టీ పై అభిమానమే ఉంటుంది అంటూ బోయపాటి గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. అందుకే., తెలుగుదేశం పార్టీ ప్రచారానికి మాంచి పొలిటికల్ ప్రకటనలు తయారుచేసి ఇవ్వడం అనేది బోయపాటికి ఆనవాయితీగా వస్తోంది.

ఈ క్రమంలోనే బోయపాటి శ్రీను మరోసారి తన అభిమాన తెలుగు దేశం పార్టీకి తన చేయూత అందించడానికి సన్నద్ధం అవుతున్నాడు. అయితే, ఈ సారి యాడ్స్ తో పాటు ఫక్తు పొలిటికల్ సిరీస్ ను కూడా బోయపాటి శ్రీను రెడీ చేస్తున్నాడు. తన రచయిత ఏం రత్నం చేత బోయపాటి ఈ సిరీస్ ను రాయిస్తున్నాడు. ఈ సిరీస్ ను సీరియల్ టైప్ లో ఈటీవీలో ప్రసారం చేయాలని కూడా టీడీపీ నాయకులు ప్లాన్ చేస్తున్నారు.
నవంబర్ నుంచి ఈ పొలిటికల్ సిరీస్ షూట్ ప్రారంభం అయ్యేలా వుంది. ఆంధ్ర లో ఎన్నికల మూడ్ ను బట్టి ఈ సిరీస్ టెలికాస్ట్ కాస్త ముందుకు వెనక్కు వెళ్తుందని టాక్ నడుస్తోంది. ఇక ఈ పొలిటికల్ సిరీస్ లో మెయిన్ కథాకథనాలు చాలా ఇంట్రెస్ట్ గా ఉంటాయట. ఇంట్రెస్ట్ అంటే.. ఫక్తు ఆంధ్రలో జరిగిన జరుగుతున్న రాజకీయాల గురించే ఎక్కువ సన్నివేశాలు ఉంటాయట. బోయపాటి శ్రీను ఇలాంటివి రాయడంలో మంచి ఎక్స్ పర్ట్.
ఇందులో భాగంగానే ఈ సిరీస్ లో జగన్ రెడ్డి స్కీముల పై, స్కామ్ ల పై కూడా అనేక ఫన్నీ సీన్స్ ఉంటాయట. మొత్తానికి వర్తమాన సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ ను తీసి.. జనంలోకి బాగా తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ పై తనకున్న అభిమానాన్ని ఘనంగా చాటుకోవాలని బోయపాటి శ్రీను గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు.

అలాగే, బోయపాటి శ్రీను ఈ సిరీస్ లో కొన్ని పాజిటివ్ అంశాలను కూడా బాగా చూపిస్తాడట. గతంలో తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలకు ఎన్ని రకాలుగా మేలు చేసింది, అలాగే నేడు ఐటీతో లక్షల మంది యూత్ బాగు పడ్డారు అని, అసలు నేడు లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు అంటే.. ఇవన్నీ ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లే సాధ్యం అయ్యిందని, ఈ సిరీస్ లో బోయపాటి శ్రీను చెప్పబోతున్నాడు.
ఎంతైనా పొలిటికల్ అంశాలను తెలివిగా తన కథలో చొప్పించడంలో బోయపాటి శ్రీనుకి మంచి టాలెంట్ ఉంది. పైగా రాజకీయాలకు సంబంధించిన అంశాలు పెడుతూనే తన కథలో ఫ్లో అండ్ ఇంట్రెస్ట్ ను కూడా బోయపాటి బాగా మెయింటైన్ చేస్తాడు. ఇప్పటికే బోయపాటి స్క్రిప్ట్ లో ఈ అంశాలు అన్నీ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇక ఈ సిరీస్ కి కథాకథనాలు తానే ఇచ్చిన బోయపాటి.. ఈ సిరీస్ డైరెక్షన్ ను మాత్రం మరొకరికి అప్పగించాలని ఆలోచనలో ఉన్నాడు.