Star Hero Cheated Bandla Ganesh: జూనియర్ ఎన్టీఆర్ చేతిలో నిర్మాత బండ్ల గణేష్ మోసపోయాడా ? అంటే ఔను అనే టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ కి ‘టెంపర్’ లాంటి సూపర్ హిట్ సినిమాని ఇచ్చాడు బండ్ల గణేష్. ఆ తర్వాత ఎన్టీఆర్ కోసం కళ్యాణ్ రామ్ ఇజం సినిమా కొనుక్కుని భారీ నష్టాలను కూడా భరించాడు. ఐతే, ‘ఇజం’ సినిమా సమయంలో నేను ఉన్నాను అంటూ అభయం ఇచ్చాడట ఎన్టీఆర్. ఆరేళ్ళు బండ్ల గణేష్ నిరీక్షణ అనంతరం కూడా మళ్లీ ఎన్టీఆర్ నుంచి బండ్ల గణేష్ కి పిలుపు లేదట.

ఈ విషయంలోనే బండ్ల గణేష్ ఎన్టీఆర్ పై సీరియస్ గా ఉన్నాడు. అందుకే, మొన్న ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా రావాల్సిన బ్రహ్మస్త్ర సినిమా ఫంక్షన్ ను కేసీఆర్ ప్రభుత్వం క్యాన్సిల్ చేసినందుకు, బండ్ల గణేష్ తెగ సంతోష పడ్డాడు. పనిలో పనిగా ఓ ట్వీట్ కూడా పెట్టాడు. అయితే, ఆ తర్వాత బండ్ల గణేష్ మళ్ళీ ఎన్టీఆర్ ను పొగుడుతూ మరో ట్వీట్ పెట్టాడు.
ఈ క్రమంలో రీసెంట్ గా బండ్ల గణేష్, కళ్యాణ్ రామ్ ను కలిశాడట. ఇజం సినిమా వల్ల తనకు లాభం కంటే నష్టం ఎక్కువైంది అంటూ కళ్యాణ్ రామ్ కి వివరణ ఇచ్చి.. మరో ఛాన్స్ అంటూ మొర పెట్టుకున్నాడు. కొరటాల శివ తో ఎన్టీఆర్ హీరోగా తాము చేయబోయే సినిమాకి సహా నిర్మాతగా ఉండొచ్చు, ఒకసారి తారక్ తో మాట్లాడి మీకు చెబుతాను అని కళ్యాణ్ రామ్, బండ్ల గణేష్ కి అభయం ఇచ్చాడు.

కట్ చేస్తే.. రోజులు గడుస్తున్నాయి. ఎన్టీఆర్ – కొరటాల సినిమా పనులు కూడా శరవేగంగా స్టార్ట్ అయ్యాయి. వచ్చే నెల నుంచి షూటింగ్ కి కూడా టీమ్ రెడీ అయ్యింది. ఇప్పటికే, బడ్జెట్ కూడా ఫైనల్ అయ్యింది. కానీ, బండ్ల గణేష్ కి మాత్రం పిలుపు లేదు. కారణం తెలియదు. కళ్యాణ్ రామ్ దగ్గరకు వెళ్లి విషయం చెబుదాం అని ప్రయత్నిస్తే నా చేతుల్లో ఏం లేదు తేల్చి పారేశాడు.
ఇక ఎన్టీఆర్ అసలు అందుబాటులో లేడు. ఫోన్ లో ఎలాగూ తనతో తారక్ టచ్ లో ఉండడు. ఇప్పుడు ఇంటికి వెళ్లినా ఎన్టీఆర్ తనను కలవని పరిస్థితి కనిపిస్తోంది. దాంతో, తీవ్ర నిరాశనిస్పృహతో కూడిన ఆవేశంతో బండ్ల గణేష్ తెగ బాధ పడిపోతున్నాడు. బండ్ల వాలకం చూసి అసలు విషయం కనుక్కుని ఆయన స్నేహితులు ఇక ఈ టాపిక్ వదిలేయ్ అని సలహాలు ఇస్తున్నారట.