Haryana Election Result 2024: హర్యానా ఎన్నికల ఫలితాలు రాబర్ట్ వాద్రాకు ముందే తెలుసా.. కౌంటింగ్ వేళ చేసిన పోస్ట్ వైరల్

హర్యానా ఎన్నికల ఫలితాలు వచ్చేసాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. ముచ్చటగా మూడోసారి బిజెపి అధికారంలోకి వచ్చి.. హ్యాట్రిక్ సాధించింది. వాస్తవానికి ఫలితాలపై సానుకూల దృక్పధం ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ పార్టీకి చివరికి నిరాశ మిగిలింది.

Written By: Anabothula Bhaskar, Updated On : October 9, 2024 10:02 am

Haryana Election Result 2024(2)

Follow us on

Haryana Election Result 2024: హర్యానా ఎన్నికల ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభంలో కాంగ్రెస్ పార్టీకి లీడ్ వచ్చింది. దీంతో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు. బాణసంచా కాల్చారు. కానీ చివరికి విజయం భారతీయ జనతా పార్టీని వరించింది. అంతకంతకు మారిన ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది కలిగించగా.. భారతీయ జనతా పార్టీకి ఆనందాన్ని మిగిల్చాయి.. ఎగ్జిట్ పోల్స్, రాజకీయ పండితులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పాయి. కానీ వాస్తవంలో అలాంటి పరిస్థితి కనిపించలేదు. పైగా ట్రెండ్ ఎప్పటికప్పుడు మారింది. తొలి రౌండు మినహా.. మిగతా అన్ని రౌండ్లలో బిజెపి లీడ్ కొనసాగించింది. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎదురైనా పరాభవానికి ఇప్పుడు బదులు తీర్చుకుంది.

పోస్ట్ వైరల్

హర్యానా ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన తొలి గంటలో కాంగ్రెస్ పార్టీ లీడ్ కొనసాగించింది. అయితే భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. మొత్తానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారాన్ని దక్కించుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరాశలో మునిగిపోయారు. అయితే ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రా సామాజిక మాధ్యమాల వేదికగా చేసిన ఒక పోస్ట్ సంచలనంగా మారింది. ” ప్రజల కోణంలో ఆలోచించాలి. ప్రజలు ఏం కోరుకుంటున్నారో దాన్ని అంగీకరించాలి. వారు ఎవరైనా అయితే నాయకుల ను ఎంచుకుంటారో.. వారి ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడపడానికి మన వంతుగా సహకారం అందిద్దాం. ముందుగా దేశం గురించి ఆలోచించాలి” అంటూ ఆయన పోస్ట్ చేశారు. ఎన్నికల ఫలితాలకు సంబంధించి కౌంటింగ్ ప్రారంభం నుంచి హర్యానాలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అయితే చివరికి భారతీయ జనతా పార్టీ 48 స్థానాలను గెలుచుకుంది. మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు మొదలు పెట్టింది. కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలలో విజయం సాధించింది.. హర్యాన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 46 స్థానాలు కావాలి. అయితే భారత జనతా పార్టీ ప్రభుత్వ ఏర్పాటు కంటే రెండు స్థానాలను అధికంగా గెలుచుకుంది. దీంతో భారత జనతా పార్టీ నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ఎన్నికల ఫలితాల వేళ రాబర్ట్ వాద్రా పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది. అయితే ఆయన ఎవరిని ఉద్దేశించి ఆ పోస్ట్ చేశారనేది ఇప్పటికీ తెలియ రాలేదు. అంటే ఓటమిని అంగీకరించి.. బాధ్యతగల ప్రతిపక్షంగా అధికార పార్టీకి సహకరించాలనేది ఆయన ఉద్దేశం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాబర్ట్ చాలా పరిణతి తో కూడిన పోస్ట్ పెట్టారని రాజకీయ పండితులు చెబుతున్నారు.