Chinese weapons failed in Iran war: చైనా మాల్.. హరేక్ మాట్ అంటూ చైనా వస్తువులు విక్రయించడం చూస్తుంటా. ఇవన్నీ నాసిరకంగానే ఉంటాయి. అయితే ధర తక్కువగా ఉంటుంది. గాల్వన్ ఘటనకు ముందు మన దేశంలో అయితే చైనా బజార్లు వెలిశాయి. చైనా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు వెలిశాయి. గాల్వన్ ఘటనలో చైనా ఉత్పత్తుపై భారత్ ఆంక్షలు విధించింది. దీంతో చైనా వస్తువులు చాలా వరకు తగ్గిపోయాయి. వస్తువులు నాసిరకంగా తయారు చేయడం, డూప్లికేట్ చేయడంలో చైనా దిట్ట. ఆయుధాల తయారీలోనూ చైనా పరిస్థితి ఇలాగే ఉన్నట్లు తెలుస్తోంది. తక్కువ ధరకు ప్రపంచవ్యాప్తంగా ఆయుధాలు అమ్ముతున్న చైనా.. ఇటీవలి సంఘర్షణల్లో వాటి నాణ్యతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాకిస్తాన్, వెనెజువెలా, ఇరాన్ వంటి దేశాల్లో చైనా రక్షణ వ్యవస్థల వైఫల్యాలు బయటపడుతున్నాయి.
ఆపరేషన్ సిందూర్ సమయంలో..
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌పై పాకిస్తాన్ చైనా నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలు వాడింది. JF–17 ఫైటర్‌లు, F–22P ఫ్రిగెట్‌లు ఇంజిన్ లోపాలు, రాడార్ లోపాలతో పోరాడలేకపోయాయి. FM–90 మిస్సైల్ వ్యవస్థలు లక్ష్యాలను గుర్తించలేకపోవడం, డ్రోన్ డిఫెన్స్ సిస్టమ్‌లు ఎఫెక్టివ్‌గా పనిచేయకపోవడం భారత దాడుల్లో స్పష్టమైంది. ఇలాంటి వైఫల్యాలు పాకిస్తాన్‌ను టర్కీ వైపు మళ్లించాయి.
వెనెజువెలా, ఇరాన్‌లోనూ..
ఇక తాజాగా వెనెజువెలా 2 బిలియన్ డాలర్ల విలువైన చైనా ఆయుధాలు కొనుగోలు చేసినా, యుఎస్ డ్రోన్‌లను గుర్తించలేకపోయింది. ఇరాన్‌లోని స్కైషీల్డ్ లేజర్ వ్యవస్థ ఎడారి పరిస్థితుల్లో విఫలమైంది. స్పెయర్ పార్ట్స్ లోపం, శిక్షణ లేకపోవడం వంటి సమస్యలు ఇక్కడ కూడా కనిపించాయి.
Also Read: ముక్కలయ్యే ముందు కూడా కశ్మీర్‌పై అక్కసు.. అంతర్జాతీయ వేదికపై పాక్ పరువు తీసిన భారత్!
ఎందుకు విఫలమవుతున్నాయి?
చైనా ఆయుధాలు ఎక్స్‌పోర్ట్ కోసం పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేస్తూ, పరీక్షలు నిర్వహించడం లేదు. ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్‌కు అనుగుణంగా లేకపోవడం, స్టెల్త్ విమానాలను డిటెక్ట్ చేయలేకపోవడం ప్రధాన బలహీనతలు. లేయర్డ్ డిఫెన్స్‌లో సమన్వయం లేకపోవడం, మెయింటెనెన్స్ సమస్యలు కూడా ఉన్నాయి.
వరుస వైఫల్యాలు చైనా ఆయుధాల ఎక్స్‌పోర్ట్ మార్కెట్‌ను తగ్గిస్తున్నాయి. మధ్యప్రాచ్య దేశాలు ఇతర సరఫరాదారుల వైపు మళ్లుతున్నాయి. అమెరికా ప్రెసిషన్ టెక్నాలజీలతో ఆధిపత్యం కొనసాగుతోంది.