Women’s T20 World Cup 2024: టి20 వరల్డ్ కప్ తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ చేతిలో 58 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయింది. రెండో మ్యాచ్లో పాకిస్తాన్ జట్టును ఓడించింది. టి20 వరల్డ్ కప్ లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే ఈ మ్యాచ్ లో భారత్ కచ్చితంగా గెలవాలి. అయితే సరిగ్గా కొద్ది రోజుల క్రితం ఆసియా కప్ ఫైనల్ జరగగా.. శ్రీలంక పై భారత జట్టు ఓటమిపాలైంది. నాటి ఓటమికి రివెంజ్ తీర్చుకునే అవకాశం ఇప్పుడు టీమిండియా కు దక్కింది. ఈ మ్యాచ్ లో భారత్ కచ్చితంగా విజయం సాధించాలి. నాటి ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలి. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే సెమీఫైనల్ అవకాశాలు కాస్త బలపడతాయి. ఈ మ్యాచ్ కు టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ దూరమయ్యే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ఆమె మెడ నొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. ఆమె స్థానంలో స్మృతి జట్టుకు నాయకత్వం వహిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. రెండు జట్లకు కీలకమైన మ్యాచ్ కాబట్టి.. పోరు ఉత్కంఠ గాసాగే అవకాశం కనిపిస్తోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ మైదానంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 నిమిషాలకు మ్యాచ్ మొదలవుతుంది. టాస్ ప్రక్రియ ఏడు గంటలకు మొదలవుతుంది. మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో టెలికాస్ట్ అవుతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ యాప్ లో మొబైల్ ద్వారా చూడొచ్చు.
రన్ రేట్ మెరుగుపరచుకోవాలి
టీమిండియా సెమీఫైనల్ వెళ్లాలంటే రన్ రేట్ కచ్చితంగా మెరుగుపరుచుకోవాలి.. శ్రీలంక పై భారీ విజయాన్ని సాధించాలి. న్యూజిలాండ్ చేతిలో 58 పరుగుల తేడాతో ఓడిపోవడంతో భారత్ రన్ రేట్ గుడ్ మార్నింగ్ దారుణంగా పడిపోయింది. పాకిస్తాన్ జట్టుపై 105 పరుగుల స్వల్ప స్కోర్ ను అత్యంత కష్టంగా చేదించింది. డాషింగ్ ఓపెనర్లు షఫాలి వర్మ, స్మృతి మందాన ఆకట్టుకోలేకపోతున్నారు. ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లలో షఫాలి 2, 32 పరుగులు మాత్రమే చేసింది. పాక్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ హర్మన్ మెడ నొప్పితో రిటైర్డ్ హర్ట్ గా వెనదిరిగింది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆమె ఫిట్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మందకొడి మైదానంపై జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ స్థాయికి తగ్గట్టుగా ఆడటం లేదు. అరుంధతి రెడ్డి గత మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టింది. ఈ మ్యాచ్ లోనూ అదే స్థాయిలో ప్రదర్శన చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. రేణుక నుంచి పూర్తిస్థాయి సహకారం లభించాల్సి ఉంది. దీప్తి శర్మ బౌలింగ్లో ఆకట్టుకోలేకపోతున్నది. ఆమె తన పూర్వపు ఫామ్ అందుకోవాల్సి ఉంది. ఇక ఈ గ్రూప్ లో భారత్ తన చివరి మ్యాచ్ ఆస్ట్రేలియా జట్టుతో ఆడాల్సి ఉంది. ఆస్ట్రేలియాపై గెలవాలంటే భారత్ కచ్చితంగా అద్భుతమైన ప్రదర్శన చేయాల్సి ఉంది.
జట్ల అంచనా ఇలా
భారత్: హర్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమీమా, రిచా, సజన, దీప్తి, అరుంధతి, శోభన, రేణుక, శ్రేయాంక, స్మృతి మందాన, షఫాలి వర్మ.
శ్రీలంక
చమరి ఆటపట్టు (కెప్టెన్), హర్షిత, కవిష, నీలాక్షి, అనుష్క, హాసిని, సుగంధిక, విష్మి, ప్రియదర్శిని, ప్రబోధిని, ఇనోక రణవీర.