India exposes Pakistan: పాకిస్తాన్ అంతర్గత సంక్షోబాలతో సతమతమవుతోంది. ఒకవైపు బలూచ్ తిరుగుబాట్లు, ఇంకోవైపు ఖైబర్‌ఫక్తూంఖ్వా సమస్య, ఇంకోవైపు ఆఫ్గానిస్తాన్ ప్రతిదాడులు, ఆర్థిక సంక్షోభం, బలూచ్ పాకిస్తాన్ నుంచి విడిపోయే పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో కూడా పాకిస్తాన్ భారత్‌లోని జమ్మూ కశ్మీర్‌లో ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, స్వాతంత్య్రం గురించి జనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితి మానవహక్కుల సమావేశంలో మాట్లాడింది. ఒకవైపు రంజాన్ మాసంలోనే బలూచ్ మహిళలను కిడ్నాంప్ చేసి చంపుతోంది పాకిస్తాన్. మరోవైపు కశ్మీర్ స్వేచ్ఛ గురించి మాట్లాడుతోంది.
అంతర్జాతీయ వేదికపై పరాభవం..
కాశ్మీర్‌లో మానవహక్కుల పత్యేక కమిటీని పంపాలని పాకిస్తాన్ కోరింది. ఇస్లామిక్ సహకార సంస్థ కూడా ఫాక్ట్ ఫైండింగ్ బృందం ప్రతిపాదించింది. భారత ప్రతినిధి అనుపమ సింగ్ దీనిని తిరస్కరించారు. బలూచ్‌లో హక్కుల దెబ్బ, కాశ్మీర్ పండితుల అరెస్టులు ఎత్తి చూపి పాక్ వాదనలను తిప్పి కొట్టింది.
భారత్ శక్తి ప్రదర్శన
జమ్మూ కాశ్మీర్ బడ్జెట్ పాకిస్తాన్ దేశ బడ్జెట్‌తో సమానం, చినాబ్ వంతెన ఖర్చు ఐ.ఎం.ఎఫ్ రుణాలకు తగినదని అనుపమ సింగ్ చెప్పడం పాక్‌ను మౌనంగా ఎండినొమింది, ఇది అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ పరువు తీసింది.
Also Read: ఇరాన్ పై అమెరికా దాడి.. పాకిస్తాన్ ఎంత పనిచేసింది?
సైనిక హెచ్చరికలు
మరోవైపు వెస్టరన్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ కటియా అమెరికా రాయబారితో చర్చల తర్వాత ఆపరేషన్ సిందూర్ 2.0 మేరకు పాకిస్తాన్ మనుగడ అసాధ్యమని హెచ్చరించారు. వసంతకాలంలో అడవుల చిగురించడం, డ్రోన్ గుర్తింపు కష్టత్వం పాక్ దుస్సాహసానికి దారితీసే అవకాశం ఉంది. 1999 కార్గిల్ యుద్ధం గుర్తుచేస్తూ ఉగ్రవాదుల దాడులను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. దీంతో అటు అంతర్జాతీయ వేదికపైనా. ఇటు భారత సైన్యం పరంగా ఒక హెచ్చరిక జారీ చేయడం జరిగింది.
కటియా వ్యాఖ్యలకు కారణం..
కటియా ఈ ప్రకటనకు కారణం ఉంది. చలి కాలం తగ్గింది. వసంత కాలం మొదలవుతుంది. అడవులు చిగురిస్తున్నాయి. కశ్మీర్‌లో తల దాచుకోవడం కష్టంగా ఉంటుంది. డ్రోన్లతో ఉగ్రవాదులను గుర్తించడం కష్టమవుతుంది. దీంతో పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడే అవకాశం ఉంది. 1998లో పాకిస్తాన్ సైనికులు ఉగ్రవాదుల రూపంలో వచ్చి కార్గిల్ కొండలపైకి వచ్చారు. మన మిలటరీ వెహికిల్‌పై కాల్పులు జరిపారు. తర్వాత కార్గిల్ వార్ జరిగింది. తాజాగా అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు కటియా పాకిస్తాన్‌కు హెచ్చరిక చేశారు.