Homeఎంటర్టైన్మెంట్Mana Shankara Varaprasad Garu completes 50 days: 50 రోజులు పూర్తి చేసుకున్న 'మన...

Mana Shankara Varaprasad Garu completes 50 days: 50 రోజులు పూర్తి చేసుకున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’..#RRR ని భారీ మార్జిన్ తో లేపేసిందిగా!

Mana Shankara Varaprasad Garu completes 50 days: ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరో గా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 4 సినిమాలతో పోటీ పడి , 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టడం అనేది సాధారణమైన విషయం కాదు. రీసెంట్ గానే ఓటీటీ లో విడులైంది, గత శనివారం జీ తెలుగు ఛానల్ లో టెలికాస్ట్ కూడా అయ్యింది. రెండిట్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం. అయితే ఈ చిత్రం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 50 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకొని , 100 రోజుల వైపు పరుగులు తీస్తోంది. అయితే ఈ సినిమా ఎన్ని సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుందో జిల్లాల వారీగా ఒకసారి చూద్దాం.

నైజాం ప్రాంతం లో ఈ చిత్రం కేవలం రెండు సెంటర్స్ లో మాత్రమే 50 రోజులు పూర్తి చేసుకుంది. హైదరాబాద్ లోనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంధ్య 35 MM థియేటర్ మరియు నిజామాబాద్ లోని లలిత మహాల్ థియేటర్ లో ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇది కాసేపు పక్కన పెడితే చిరంజీవి కి మొదటి నుండి ఉత్తరాంధ్ర ప్రాంతం కంచుకోట లాంటిది అని అంటుంటారు. అలా ఎందుకు అంటారో ఈ సినిమా హిస్టారికల్ రన్ ని చూసి చెప్పొచ్చు . ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఉత్తరాంధ్ర ప్రాంతం లో 25 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది . ఈమధ్య కాలం లో ఏ సినిమా కూడా ఈ ప్రాంతంలో ఇంత రన్ ని సొంతం చేసుకోలేదు .

Also Read: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా కాదంటూ హరీష్ శంకర్ షాకింగ్ కామెంట్స్..వీడియో వైరల్!

అదే విధంగా తూర్పు గోదావరి జిల్లా లో 7 సెంటర్స్ లో 50 రోజుల రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం , వెస్ట్ గోదావరి జిల్లా నుండి రెండు సెంటర్లు, గుంటూరు జిల్లా నుండి 4 సెంటర్లు ,. కృష్ణ జిల్లా నుండి 4 సెంటర్లు , నెల్లూరు జిల్లా నుండి 4 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఇక చిరంజీవి మరో బలమైన ప్రాంతం అయినటువంటి రాయలసీమ లో 13 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకోగా, కర్ణాటక ప్రాంతం లో 5 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది. మొత్తం మీద ఈ చిత్రం 66 డైరెక్ట్ సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది. షిఫ్ట్ సెంటర్స్ ని కూడా కలిపితే వందకి పైగా ఉండొచ్చు. #RRR చిత్రం 54 సెంటర్స్ లో 50 రోజుల రన్ పూర్తి చేసుకుంటే, ‘మన శంకర వరప్రసాద్ గారు’ 66 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version