Homeబిజినెస్Hero Super Splendor XTEC price: సామాన్యుల కోసం రెడీగా ఉంది.. ఈ Hero బైక్...

Hero Super Splendor XTEC price: సామాన్యుల కోసం రెడీగా ఉంది.. ఈ Hero బైక్ ను మిస్ చేసుకోవద్దు.. ధర చాలా తక్కువ..

Hero Super Splendor XTEC price: Hero కంపెనీకి చెందిన వాహనాలకు మార్కెట్లో మంచి గుర్తింపు ఉంది.. హీరో హోండా ఆధ్వర్యంలో వచ్చిన Splendor వాహనాలు మొన్నటి వరకు రోడ్లపై తిరిగాయి. అయితే ఇప్పుడు హీరో కంపెనీ ప్రత్యేకంగా దీనిని అప్డేట్ చేసి మార్కెట్లోకి తీసుకువచ్చింది. స్ప్లెండర్ పై అభిమానం ఉన్న చాలామంది వినియోగదారులు దీనిని మళ్లీ కొంటున్నారు. నేటి తరం వారికి అనుగుణంగా ఈ బైక్ ను స్మార్ట్ ఫీచర్లతో పాటు మైలేజ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మార్కెట్లోకి తీసుకువచ్చారు. ఇప్పుడు దీని అమ్మకాలను చూసి మిగతా కంపెనీలు షాక్ అవుతున్నారు. ఎప్పటికైనా స్పెండర్ పై ఆదరణ తగ్గదని వినియోగదారులు నిరూపిస్తున్నారు. ఇంతకీ ఈ బైక్ అమ్మకాలు ఎలా ఉన్నాయంటే?

2025 సంవత్సరంలో అప్డేట్ అయిన Super Splendor XTEC మార్కెట్లోకి వచ్చింది. ఆ ఏడాది జనవరి లో దీని అమ్మకాలు 14,116 గా ఉన్నాయి. అప్పటినుంచి ఇప్పటివరకు దీని ఆదరణ తగ్గడం లేదు. అయితే 2026 సంవత్సరం జనవరిలో 13,217 యూనిట్ల విక్రయాలు జరుపుకుంది. గత ఏడాదితో పోలిస్తే 6% తగ్గుదల ఉన్నప్పటికీ ఓవరాల్ గా ఈ బైక్పై చాలామందికి మమకారం తగ్గలేదని తెలుస్తోంది. ఎందుకంటే ఇందులో ఉండే ఫీచర్స్ తో పాటు మైలేజ్ విషయం కూడా చాలామందిని ఆకట్టుకుంటుంది.

Super Splendor XTEC బైక్ లో 124.7 సిసి సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంది. ఇది 10.72 బిహెచ్పి పవర్, 10.6 ఎన్ఎం టార్క్ ను రిలీజ్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో పని చేసే ఇది గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. లీటర్ ఇంధనానికి 69 కిలోమీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఒకసారి ట్యాంక్ ఫుల్ చేస్తే 829 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు.

ఈ బైక్ చూడడానికి సాధారణంగా కనిపించినప్పటికీ ఇందులో ఆకట్టుకునే విధంగా స్మార్ట్ ఫీచర్లను అమర్చారు. ముఖ్యంగా ఎక్స్టీరియర్ విషయానికొస్తే దీనికి ఎల్ఈడి హెడ్ లాంప్స్ ప్రీమియం లుక్ ను అందిస్తాయి. బ్యాక్ సైడ్ ఉండే టెయిల్ లైట్స్ కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. ఎలాంటి సమయంలోనైనా వీటి నుంచి వచ్చే వెలుతురుతో సులభంగా ప్రయాణం చేయవచ్చు. ఇక ఈ బైక్ కు డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తో పాటు బైక్ స్పీడ్, ట్రిప్పు వివరాలు, నావిగేషన్ వంటివి డిస్ప్లే అవుతాయి. దీనికి స్టార్ట్, స్టాప్ బటన్ సిస్టం, సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, బ్లూటూత్ కనెక్టివిటీ, ఎస్ఎంఎస్ అలర్టు వంటి స్మార్ట్ ఫీచర్లు ఉన్నాయి. దీనిని ప్రస్తుతం మార్కెట్లో రూ.83,448 నుంచి రూ.87,044 వరకు విక్రయిస్తున్నారు. రోజువారి ప్రయాణికులతో పాటు కొత్తగా బైక్ కొనాలని అనుకునే వారికి ఇది అనుగుణంగా ఉంటుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version