Homeజాతీయ వార్తలుDelhi Bed And Breakfast Policy: ఢిల్లీలో బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ రద్దు.. ఏంటి ఈ...

Delhi Bed And Breakfast Policy: ఢిల్లీలో బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ రద్దు.. ఏంటి ఈ పాలసీ.. ఎందుకు ఈ చర్చ..

Delhi Bed And Breakfast Policy: సాధారణంగా పర్యటక రంగం అనేది ఆ దేశ పరిస్థితులు ఆధారంగా ఉంటుంది. అక్కడి ప్రభుత్వాలు సానుకూల నిర్ణయాలు తీసుకుంటే.. పర్యాటక రంగానికి అనుకూలంగా విధానాలను మార్చుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. ప్రపంచంలో పర్యాటక స్వర్గధామాలుగా పేరుపొందిన ప్రాంతాలు.. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్లే ఆ స్థాయిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. మన దేశానికి కూడా పర్యాటక రంగంలో మంచి పేరు తీసుకురావాలని ప్రభుత్వాలు రకరకాల విధానాలను అమలు చేస్తున్నాయి. దేశ రాజధాని […]

Delhi Bed And Breakfast Policy: సాధారణంగా పర్యటక రంగం అనేది ఆ దేశ పరిస్థితులు ఆధారంగా ఉంటుంది. అక్కడి ప్రభుత్వాలు సానుకూల నిర్ణయాలు తీసుకుంటే.. పర్యాటక రంగానికి అనుకూలంగా విధానాలను మార్చుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండదు. ప్రపంచంలో పర్యాటక స్వర్గధామాలుగా పేరుపొందిన ప్రాంతాలు.. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల వల్లే ఆ స్థాయిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. మన దేశానికి కూడా పర్యాటక రంగంలో మంచి పేరు తీసుకురావాలని ప్రభుత్వాలు రకరకాల విధానాలను అమలు చేస్తున్నాయి.

దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని పర్యాటకులు పెద్ద ఎత్తున సందర్శిస్తూ ఉంటారు. ప్రతి ఏడాది లక్షలాదిమంది ఢిల్లీ నగరానికి వస్తుంటారు. ఇక్కడి చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శిస్తూ ఉంటారు. అయితే అందరూ పర్యటకులు లగ్జరీ సౌకర్యాల కోసం ఖర్చుపెట్టరు. కొందరు పరిమిత బడ్జెట్లోనే తమ టూర్ మొత్తం పూర్తి కావాలని భావిస్తుంటారు. అదే అటువంటి వారికోసం గతంలో బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ విధానాన్ని తీసుకొచ్చారు. బెడ్, బ్రేక్ ఫాస్ట్ అనగానే చాలామంది హోటల్ అనుకుంటారు.. కానీ అది కాదు.. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి.. దానిని మరింత బలోపేతం చేయడానికి.. స్థానికులకు అదనపు ఆదాయాన్ని కల్పించడానికి ఢిల్లీలో ఈ వసతి విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఢిల్లీలో ఇటీవల జరిగిన భారీ అగ్నిప్రమాదానికి ఈ పాలసీనే కారణమని.. దానిని రద్దు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది.

అగ్ని ప్రమాదం వల్ల చాలామంది చనిపోయారు. అదే స్థాయిలో గాయపడ్డారు. అగ్ని ప్రమాదం వల్ల ఏర్పడిన మంటలు ఢిల్లీలో చాలా నష్టాన్ని కలుగజేసాయి. ఈ ప్రమాదం నేపథ్యంలో బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ విధానాన్ని పక్కన పెట్టాలని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానం ప్రకారం ఇంటి ఓనర్లు తమ ఇంట్లో ఉన్న కొంత భాగాన్ని పర్యాటకులకు కల్పిస్తారు. వారికి వసతి.. ఆహారం.. ఇతర సదుపాయాలు కల్పిస్తారు. దీనివల్ల కొంతమేర ఆదాయాన్ని వారు సంపాదిస్తారు. బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ విధానంలో గరిష్టంగా ఆరుగదులకు అనుమతి ఉంటుంది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.

ఇటీవల ఢిల్లీలో చోటు చేసుకున్న అగ్నిప్రమాదానికి బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ విధానం కారణమని నిపుణులు అంటున్నారు. సరైన విధానాలు పాటించకపోవడం.. ఫైర్ సేఫ్టీ నిబంధనలను పక్కన పెట్టడంతో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చాలామంది చనిపోయారు. అసలే ఎండాకాలం.. దానికి మంటలు కూడా తోడు కావడంతో ప్రమాదం తీవ్రత అధికంగా ఉంది. అందువల్లే ప్రాణం నష్టం చోటుచేసుకుంది. ఇంతటి ప్రమాదానికి ఆ విధానం కారణమని భావించిన ఢిల్లీ ప్రభుత్వం.. ఇకపై దానిని పక్కన పెడతామని.. భవిష్యత్తులో కూడా అమలు చేసే అవకాశం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలామందికి ఉపాధి దూరమైనప్పటికీ.. ప్రజల ప్రాణాల దృష్ట్యా తీసుకోవడం తప్పడం లేదని ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper