కరోనా వైరస్ గురించి ఒక వార్త హల్ చల్ చేస్తోంది. మరో రెండేళ్లపాటు కరోనాతో సహజీవనం చేయాల్సి ఉంటుందని చెప్పిన అధికారులకు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపడే ప్రకటన చేశారు. శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాల్లో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని చెప్పారు. దీంతో కరోనాకి కళ్ళెం వేయడం ఇక కష్టమే అనుకున్నారు. అయితే కొందరు శాస్త్రవేత్తలు మాత్రం కరోనా కాలపరిమితిని డిసైడ్ చేశారు. వారి ప్రయోగ ఫలితాల ప్రకారం మరో రెండు నెలల్లోనే కరోనా క్షీణ దశకు చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో కరోనా క్షీణిస్తోందని శాస్త్రవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొందరు శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసి త్వరలో భారత్ తో పాటు ఇతర దేశాల్లో కూడా వైరస్ అంతమవుతుందని అభిప్రాయపడుతున్నారు.ఇటాలియన్ అంటువ్యాధుల స్పెషలిస్ట్ మేటియో బసెట్టి వైరస్ రోజురోజుకు బలహీనపడుతోందని… ఇదే పరిస్థితి కొనసాగితే వ్యాక్సిన్ లేకుండానే వైరస్ అంతమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. గతంతో పోలిస్తే కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని…. సెప్టెంబర్ 19 నాటికి వైరస్ పూర్తిగా అంతమవుతుందని పలు జర్నల్స్ లో కథనాలు ప్రచురితమవుతున్నాయి.