https://oktelugu.com/

Copenhagen Shooting: ఆగని గన్ కల్చర్: అమెరికాలో కాల్పుల మోత.. మృత్యుఘోష..

Copenhagen Shooting: అమెరికాలో కాల్పుల సంస్కృతి కొనసాగుతోంది. దుండగులు కాల్పులకు తెగడటంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. చికాగోలో స్వాతంత్ర్య దినోత్సవ పెరేడ్ సందర్భంగా నిర్వహించిన కవాతును లక్ష్యంగా చేసుకుని కాల్పులకు దిగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. దీంతో తమ పిల్లలను తీసుకుని పరుగులు పెట్టారు. ఇండిపెండెన్స్ పెరేడ్ లక్ష్యంగా చేసుకున్న దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందినట్లు మరో 16 మంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 5, 2022 / 08:56 AM IST
    Follow us on

    Copenhagen Shooting: అమెరికాలో కాల్పుల సంస్కృతి కొనసాగుతోంది. దుండగులు కాల్పులకు తెగడటంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. చికాగోలో స్వాతంత్ర్య దినోత్సవ పెరేడ్ సందర్భంగా నిర్వహించిన కవాతును లక్ష్యంగా చేసుకుని కాల్పులకు దిగడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థం కాలేదు. దీంతో తమ పిల్లలను తీసుకుని పరుగులు పెట్టారు. ఇండిపెండెన్స్ పెరేడ్ లక్ష్యంగా చేసుకున్న దుండగుడు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందినట్లు మరో 16 మంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు అక్కడి పత్రికలు వెల్లడించాయి.

    Copenhagen Shooting

    హైలెండ్ పార్కులో ఆ దేశ స్వాతంత్ర్య వేడుకలు నిర్వహిస్తున్నారు. దాన్ని టార్గెట్ చేసుకున్న దుండగుడు దాదాపు పదినిమిషాలు కాల్పులు జరపడంతో అందరు భయపడ్డారు. ప్రాణభయంతో పరుులు తీశారు. ఘటనకు కారణమైన దుండగుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కాల్పుల్లో ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉంటారని అనుమానిస్తున్నారు. పలు పత్రికలు రకరకాల సంఖ్యను ప్రసారం చేస్తున్నాయి. చికాగోలో జరిగిన సంఘటనపై అందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    Also Read: Celebrities Controversial Comments: నోటి దురుసుతనమే కొంపముంచిందా

    భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం పది గంటలకు పెరేడ్ కవాతు ప్రారంభమైంది. తరువాత పది నిమిషాలకే దుండగుడు కాల్పులు జరపడంతో అందరు చెల్లాచెదురయ్యారు. అందరు కవాతులో పాల్గొని సంతోషంగా గడపాలని వచ్చిన వారికి నిరాశే ఎదురైంది. కాల్పుల రూపంలో మృత్యువు పొంచి ఉందని భావించి అందరు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. కాల్పులు జరిపిన దుండగుడి కోసం పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

    Copenhagen Shooting

    కాల్పులపై పొంతన లేని విషయాలు ప్రసారం చేస్తున్నారు. దీంతో ఏం జరుగుతుందో తెలియడం లేదు. కాల్పులతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. భారీ శబ్దాలతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. గుళ్లవర్షం కురవడంతో చాలా మంది కేకలు వేశారు. తక్షణమే పోలీసులు అప్రమత్తమై ప్రజలను రక్షించేందుకు ముందుకు వచ్చారు. ప్రజలను సురక్షితంగా బయటకు పంపేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో భారీ నష్టం తప్పింది. అమెరికాలో కాల్పుల కలకలం మానడం లేదు. ఇలా ఎందుకు చేస్తున్నారనే దానిపై సరైన దృష్టి పెట్టడం లేదు. దీంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. దీనిపై ఏం చర్యలు తీసుకుంటుందో చూడాల్సిందే.

    Also Read:Ashu Reddy: అషురెడ్డి సీక్రెట్ ప్లేస్ లో పవన్ కల్యాణ్ టాటూ వేసుకుందా?

    Tags