TikTok Fame Durga Rao: బిగ్ బాస్ షో దూసుకుపోతోంది. జనరంజకంగా ప్రసారం అవుతోంది. మొదట్లో ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపకపోవడంతో యాజమాన్యం చర్యలు తీసుకుని మార్పులు చేర్పులు చేపట్టారు. దీంతో అప్పటి నుంచి బిగ్ బాస్ ప్రజల మనసులను చూరగొంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఐదు సెషన్లు పూర్తయ్యాయి. రానున్నది ఆరో సెషన్ దీంతో దీనిపై బిగ్ బాస్ నిర్వాహకులు దృష్టి సారించారు. పాల్గొనే వారిపై ఫోకస్ పెట్టారు. ఎవరిని తీసుకోవాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. పరిమిత సంఖ్యలోనే కంటెస్టెంట్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీంతో పాతిక మందికే స్థానం దక్కనుంది. వారి పేర్లు కూడా ఖరారు చేస్తున్నారు.

ఇందులో అనూహ్యంగా టిక్ టాక్ దుర్గారావు అవకాశం అందిపుచ్చుకున్నాడు. కానీ ఆయన ప్రాతినిధ్యంపై ఇంకా స్పష్టత రావడం లేదు. దీనికి కారణమేమిటంటే బిగ్ బాస్ హౌస్ లోకి తన తోపాటు తన భార్యను కూడా రానివ్వాలని దుర్గారావు పేచీ పెడుతున్నాడట. కానీ దీనికి బిగ్ బాస్ యాజమాన్యం ఒప్పుకోవడం లేదు. ఆమె కూడా సెలబ్రిటీ అయితే పంపించే వీలుంటుంది. దుర్గారావు భార్యకు అంతటి క్రేజీ లేదని తెలుస్తోంది. అందుకే దుర్గారావు భార్యను పంపడం కుదరదని చెబుతున్నారు.
Also Read: Celebrities Controversial Comments: నోటి దురుసుతనమే కొంపముంచిందా
సమయం కూడా దగ్గర పడుతుండటంతో దుర్గారావు ఒప్పందం మీద సంతకం చేయకపోతే ఆయన రాకకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. దీంతో తన భార్య వస్తే తనకు భయం ఉండదనే ఉద్దేశంతోనే ఆమె రావాలని కోరుతున్నాడు. కానీ యాజమాన్యం మాత్రం అంగీకరించడం లేదు. దుర్గారావు షరతుపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అతడు పెడుతున్న షరతుతో నీకో దండం రా బాబూ అనే స్థాయికి యాజమాన్యం వెళ్లినట్లు తెలుస్తోంది.

అవకాశం రాక కొందరు ఎదురు చూస్తుంటే వచ్చిన అవకాశాన్ని చేజార్చుకునేందుకే దుర్గారావు ప్రయత్నిస్తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కడు వెళితే ఏమవుతుంది. కంటెస్టెంట్ గా వెళితే తన ప్రతిభ ఏమైనా తగ్గుతుందా? భార్య వస్తేనే ధైర్యంగా ఉంటుందని చెప్పడం వివాదాలకే తావిస్తోంది. దీంతో దుర్గారావు భవితవ్యం ఏంటో తెలియడం లేదు. చివరకు వెళతాడో మానుకుంటాడో కూడా అర్థం కావడం లేదనే అందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ లో రకరకాల వైవిధ్యమైన సంగతులు జరగడం తెలిసిందే.
Also Read:Godfather First Look Released: మెగా లుక్ అదిరింది.. మెగా ఫ్యాన్స్ కు ఇక పునకాలే !
Recommended Videos



[…] […]