Homeఎంటర్టైన్మెంట్Celebrities Controversial Comments: ఖాళీ మాత నోట్లో సిగరెట్ నా? సెలబ్రెటీల నోటిదురుసే దేశంలో మంటకు...

Celebrities Controversial Comments: ఖాళీ మాత నోట్లో సిగరెట్ నా? సెలబ్రెటీల నోటిదురుసే దేశంలో మంటకు కారణమా?

Celebrities Controversial Comments: లీనా మణి మేకలై టొరంటోలో ఫిల్మ్ కోర్సు చేయవచ్చు గాక.. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో సినిమాలు తీయవచ్చు గాక.. సాయి పల్లవి గొప్ప నటే కావచ్చు గాక. దీపికా పదుకొనే హావభావాలు గొప్పగా పలికించవచ్చుగాక.. మంచు మోహన్ బాబు డైలాగ్ కింగ్ కావచ్చు గాక.. నాని సహజ నటు డే కావచ్చు గాక.. రాహుల్ సాంకృత్యాన్ తీసే సినిమాలు జనానికి నచ్చవచ్చు గాక.. కానీ ఒక్కసారి నోరు అదుపు తప్పితే.. నరం లేని నాలుక ఇష్టానుసారంగా పేలితే.. దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి.

Hero and heroines Controversial Comments
Leena mani mekalai

హద్దు అదుపు లేని తనం వల్ల

ఆమధ్య మోహన్ బాబు కొడుకు మంచు విష్ణు హీరోగా పెట్టి దేనికైనా రెడీ అనే ఒక సినిమా తీశాడు. కథ వరకు బాగానే ఉన్నా బ్రాహ్మణులకు కించపరిచేలాగా మంచు విష్ణు మాట్లాడడంతో అసలుకే ఎసరు వచ్చింది. డజన్ల కొద్ది ప్లాపుల తర్వాత దక్కిన అంతంత మాత్రం విజయాన్ని కూడా చెత్తబుట్టలో వేసుకున్నాడు. దీనికి తోడు బ్రాహ్మణులు కేసులు వేయడంతో కోర్టుల చుట్టూ తిరిగాడు. మొన్నటికి మొన్న సన్ ఆఫ్ ఇండియా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా మోహన్ బాబు ఎలాంటి వ్యాఖ్యలు చేశాడో చూశాం కదా! దెబ్బకు ఆ సినిమా విడుదలయిన ఒక్క రోజుకే స్టోర్ రూమ్ కి చేరింది. అసలు బుక్ మై షో లో పట్టుమని పది టికెట్లు కూడా అమ్ముడుపోకపోవడం.. తెలుగు చిత్ర పరిశ్రమ కాదు కాదు భారత దేశ సినీ చరిత్రలోనే ప్రథమం. అన్నింటి కన్నా అథమం. అసలు తెలుగు చిత్ర పరిశ్రమలోనే మంచు కుటుంబం ఓ నోటోరియస్. తమను తాము చిత్రాంశ సంభుతూలమనుకునే బాపతు. ఎన్ని సినిమాలు ఎదురు తన్నినా ప్రేక్షకుల సహనానికి ఇంకా పరీక్ష పెడుతూనే ఉన్నారు.

Also Read: Godfather First Look Released: మెగా లుక్ అదిరింది.. మెగా ఫ్యాన్స్ కు ఇక పునకాలే !

Celebrities Controversial Comments
Manchu Vishnu

దీపిక.. అదుపు లేని నాలిక

దీపికా పదుకొనే తెలుసు కదా! దక్షిణాది అమ్మాయే! ఓం శాంతి ఓం సినిమాతో ఆరంగేట్రం చేసింది. మంచి నటి! కానీ ఏం లాభం? ఆ మధ్య ఢిల్లీ జేఎన్యూ లో స్టూడెంట్ యూనియన్ల మధ్య గొడవల్లో ఎంటర్ అయింది. ఓ వర్గానికి అనుకూలంగా మాట్లాడింది. అక్కడే పప్పులో కాలేసింది. సీన్ కట్ చేస్తే చపాక్ అనే సినిమా అడ్డంగా తన్నేసింది. వాస్తవానికి చపాక్ అనే సినిమా మంచి కథా బలం ఉన్నది. ప్రస్తుతం సొసైటీకి చాలా అవసరం కూడా. కానీ దీపిక పడుకునే చేసిన వ్యాఖ్యల వల్ల ఓ మెజారిటీ వర్గం మనోభావాలు దెబ్బతినడంతో దారుణంగా నెగిటివ్ పబ్లిసిటీ చేశారు. ఫలితంగా సినిమా వారం తీరక్క ముందే స్టోర్ రూమ్ లోకి చేరింది. అంతకు ముందు దీపికా పదుకొనే ఖాతాలో పీకు అనే సందేశాత్మక చిత్రం ఉంది. అమితాబచ్చన్ తో పోటా పోటీగా నటించింది. విమర్శకులను మెప్పించింది. జేఎన్యు వివాదం తర్వాత దీపికా పదుకొనే నటించిన ఏ చిత్రము కూడా విజయవంతం కాలేకపోయింది. చివరకు కెరీర్ అంతా మునిగిపోయే దశలో ఉండటంతో గెహ్రాయిన్ అనే బి గ్రేడ్ సన్నివేశాలు ఉండే సినిమాలో నటించింది. అది కూడా ఓటిటిలోనే రిలీజ్ అయింది. ఇప్పుడు దీపికా పదుకొనే చేతిలో పటాన్ సినిమా తప్ప వేరే కొత్త ప్రాజెక్టులు ఏమీ లేవు.

Celebrities
Deepika Padukone

లీనా ఇదేం గోల

ఈమధ్య ఈ స్థాయిలో ఒక దర్శకురాలు ట్రోలింగ్ కావడం దాదాపు ఇదే కాబోలు. తమిళనాడు చెందిన లీనా మణి మేకలై టోరెంటోలో ఫిల్మ్ కోర్సు నేర్చుకున్న ఓ మహిళ. ఆ మధ్య తమిళంలో రెండు సినిమాలు తీసింది. రెండూ కూడా డార్క్ స్క్రిప్ట్ ఉన్న సినిమాలే. ఇటీవల కాళీ అని ఒక సినిమా పోస్టర్ రిలీజ్ చేసింది. అందులో ఓ దేవత సిగరెట్ తాగుతూ ఉన్న చిత్రం బయటికి వచ్చింది. దీంతో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ట్విట్టర్ లో ఓ వర్గం వారు లీనా మణిమేకలైని ఓ ఆట ఆడుకుంటున్నారు. కొందరు ఒక అడుగు ముందుకేసి ఏకంగా ఆ సినిమాని నిలుపుదల చేయాలని కోరుతున్నారు. ఇంత జరుగుతున్నా లీనా ఏమాత్రం భయపడకుండా సినిమాను విడుదల చేస్తానని చెబుతుండడం గమనార్హం.

చరిత్ర తెలుసుకోవాలి కదా

రాహుల్ సాంకృత్యన్, నాని ఒకరు ప్రతిభావంతమైన దర్శకుడు అయితే, ఇంకొకరు సహజ నటుడు. వీరిద్దరి కలయికలో వచ్చిన చిత్రమే శ్యాంసింగరాయ్. మొదట్లో ఈ సినిమాను హారిక అండ్ హాసిని బ్యానర్ నిర్మించాలనుకుంది. కానీ రాహుల్ వ్యవహార శైలి నచ్చక ఆ సినిమా నుంచి తప్పుకుంది. తర్వాత మరో నిర్మాత ఎంటర్ అయ్యారు. ఎలాగోలా సినిమాను పూర్తి చేశారు. కిందా మీదా పడి విడుదల చేశారు. ఇందులో నాని పాత్రతో ఋగ్వేదాన్ని కించపరిచేలా మాటలు ఉండటంతో ఎంతో ఉదాత్తమైన నేపథ్యం ఉన్న సినిమా బిలో యావరేజ్ గా మిగిలిపోయింది. కాగా ఈ సినిమా కు దర్శకత్వం వహించిన రాహుల్ కమ్యూనిస్టు కుటుంబ నేపథ్యం ఉన్నవాడు. తాను దేవుళ్ళను అసలు నమ్మనని చెప్పే రాహుల్… దేవదాసీల మీద సినిమా ఎలా తీశాడో ఇప్పటికీ చెప్పడు.

సాయి పల్లవి మాటల వల్ల

Celebrities
Sai Pallavi

అనుమానమే లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో సాయి పల్లవి ఒక మేటినటి. ఎలాంటి హావభావాలనైనా ఈజీగా పలికిస్తుంది. పద్ధతి గల ఆడపిల్లగానే నటిస్తుంది. ₹కోట్లు ఇస్తామన్నా ఫెయిర్నెస్ యాడ్ ను వద్దని చెప్పేసింది. అంగాంగ ప్రదర్శన ఉండే సినిమాలో ఎక్స్పోజింగ్ ఏమాత్రం చేయనని చెప్పే మొండిఘటం సాయి పల్లవి. అంత ఎందుకు మొన్నటికీ మొన్న విరాటపర్వం సినిమా ప్రమోషన్ ఫంక్షన్లో రానా దగ్గుబాటి కేవలం ఈ సినిమా సాయి పల్లవి కోసం మాత్రమే తీశాను అని చెప్పారంటే ఆమె నటన కౌశలాన్ని ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అటువంటి నటి ఇటీవల చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు విరాటపర్వం సినిమాను ఈ ఏటి అతిపెద్ద ఫ్లాప్ ను చేశాయి. ఓ వర్గం వారి మనోభావాలు దెబ్బ తినడంతో సినిమా బాగున్నప్పటికీ చేసిన నెగటివ్ ట్రోలింగ్ వల్ల ఆశించిన స్థాయిలో టికెట్లు తెగలేదు. మరి ముఖ్యంగా హైదరాబాదులోనే ఓ థియేటర్లో కనీసం కరెంట్ బిల్లులు కూడా రికవరీ కాలేదు. సహజ సిద్ధ నటనకు, అంతకు మించి డ్యాన్సులకు, “రౌడీ బేబీ, వచ్చిండే మెల్లగా వచ్చిండే, సారంగ దరియా” పేరుతో యూ ట్యూబ్ లో కోట్లకొద్ది వ్యూస్ రికార్డు ఉన్న సాయి పల్లవి..చివరకు తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరడం నిజంగా ఆశ్చర్యమే. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దగ్గుబాటి సురేష్ కి కోట్లల్లో నష్టం వచ్చింది. వీరే కాదు ఇదయ దళపతి విజయ్, ప్రకాష్ రాజ్, శొంఠినేని శివాజీ, రాజశేఖర్, ఇంకా ఎందరో నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడి తమ సినిమాలను, నిర్మాతలను, అంతకంటే విలువైన కెరీర్ ను ప్రశ్నార్థకం చేసుకున్నారు.

Also Read: Bunny Vasu- Rashmika Mandanna: అప్పుడు పట్టించుకోలేదు.. ఇప్పుడు బతిమిలాడుతున్నాడు

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version