spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Vizianagaram SP: పోలీసులనే నగ్నంగా కూర్చోబెట్టిన జిల్లా ఎస్పీ!

Vizianagaram SP: పోలీసులనే నగ్నంగా కూర్చోబెట్టిన జిల్లా ఎస్పీ!

Vizianagaram SP: సాధారణంగా వివిధ నేరాలకు పాల్పడేవారిని పోలీసులు అరెస్టు చేసి తమదైనశైలిలో విచారిస్తుంటారు. కొందరు నేరాగాళ్ల పట్ల కఠినంగా కూడా వ్యవహరిస్తుంటారు. అలాంటి వారిని పోలీసులు బట్టలూడదీసి నగ్నంగా స్టేషన్‌లో కూర్చోబెడుతుంటారు. ఇలాంటి విషయాలను మనం తరచూ వింటుంటాం కూడా. కానీ, పోలీసుల దుస్తులనే ఊడదీసి… స్టేషన్‌లో కూర్చోబెట్టాడు ఓ పోలీస్‌ ఉన్నతాధికారి. ఆయన పేరు అరుణ్‌. విజయనగరం జిల్లా ఎస్పీ. ఆయన ఇలా ఎందుకు చేశారో తెలుసుకుందాం.

Vizianagaram SP
Vizianagaram SP

పేకాట సొమ్ము స్వాహా..
విజయనగరం పట్టణంలోని చలవారి కాలనీలో వెంకటేశ్, మరికొందరు బుధవారం రాత్రి పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. కానిస్టేబుళ్లు మహేష్, అభిషేక్, మంజునాథ్, శ్రీకాంత్‌ పేకాట శిబిరంపై దాడిచేశారు. ఘటన స్థలంలో రూ.20 వేల నగదు, వారి మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేయాల్సిన పోలీసులు ఆ పని చేయకుండా స్వాధీనం చేసుకున్న డబ్బు, మొబైల్‌ ఫోన్లు స్వాహా చేశారు.

ఫోన్ల కోసం స్టేషన్‌కు వెళితే..
పేకాట ఆడుతుండగా పోలీసులు రావడంతో అక్కడి నుంచి పారిపోయిన వారు. మరుసటి రోజు స్టేషన్‌కు వెళ్లారు. తమ మొబైల్‌ ఫోన్లు ఇవ్వాలి పోలీసులను కోరారు. అలాంటి కేసు ఏదీ నమోదు కాలేదని డ్యూటీలో ఉన్న పోలీసులు చెప్పారు. దీంతో పోలీసులకు పేకాట రాయుళ్లకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ విషయం జిల్లా ఎస్పీ అరుణ్‌ దృష్టికి వెళ్లింది. ఆయన వెంటనే విచారణకు ఆదేశించారు.

స్వాహా చేసినట్లు తేలడంతో..
విచారణలో నలుగురు కానిస్టేబుళ్లు పేకాట శిబిరంపై దాడిచేసి నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తేలింది. వాటిని కాజేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఎస్పీ నలుగురు కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేయించారు. నలుగురినీ సస్సెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత వారి స్టేషన్‌కు పిలిపించి దుస్తులు విప్పించి రెండు గంటలపాటు కూర్చోబెట్టారు. అనంతరం కోర్డులో హాజరుపర్చి న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

Vizianagaram SP
Vizianagaram SP

 

భిన్నాభిప్రాయాలు..
విజయనగరం ఎస్పీ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో అరుణ్‌ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతుండగా, ప్రజలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తురన్నారు. వివిధ కేసుల నిమిత్తం పోలీస్‌ స్టేషన్‌కు వచ్చేవారిని కూడా పోలీసులు పీక్కుతింటున్నారని కొందరు పేర్కొంటున్నారు. ఇలాంటి ఎస్పీ ఉంటే అవినీతి పోలీసులకు చెక్‌ పడుతుందని అరుణ్‌ను అభినందిస్తున్నారు. మరి ఎస్పీ నిర్ణయంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

NEET Protest Delhi

NEET Protest Delhi: ఢిల్లీలో నీట్ విద్యార్థుల ఆందోళనలు: ఆ సీజేపీ నాయకులు ఎక్కడ..

NEET Protest Delhi: ఒకరేమో ఆర్టికల్ 370 రద్దు చేయాలి అంటారు. మరొకరేమో రాముడి నామాన్ని జపించకూడదు అంటారు. ఇంకొకరేమో జమ్ము కాశ్మీర్ రాష్ట్రానికి మరింత స్వేచ్ఛ వాయువులు కల్పించాలని డిమాండ్...
AI Impact On Education

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Rahul Gandhi Injury

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...
Ishan Kishan

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...
Vijayendra Prasad

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Oktelugu Epaper