ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ రంగాల్లో చైనా సంస్థలు పాతుకొని పోయాయి. 2019 లో ఇండియా ఎలక్ట్రానిక్స్ రంగంలో చైనా కంపెనీలు లక్షా 40 వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేశాయి. ఫార్మా,సోలర్, ఎలక్టికల్, ప్లాస్టిక్ మెటీరియల్, టాయ్స్ 80 శాతం చైనా నుంచే దిగుమతి. బిగ్ బాస్కట్, ఓలా లో మేజర్ షేర్ చైనా కంపెనీలదే. 70 శాతం ప్రజలు చైనా ఫోన్లు వాడుతున్నారు. పేటియం 40 శాతం వాటా చైనాదే. ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లో 60 శాతం చైనాపెట్టుబడులు. జొమాటో, స్విగ్గిలో ర్ చైనాకు చెందిన మూడు కంపెనీల మేజర్ షేర్లు. పబ్జి మొబైల్ గేమ్ రోజు 5 కోట్ల మంది ఆడుతున్నారు.
భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్, సగానికి పైగా చైనా కంపెనీల నియంత్రణలో ఉంది. ఆ సంస్థలకు ఇక్కడ 45 కోట్లకు పైగా వినియోగదారులు ఉన్నారు. భారత్ లో 4జీ అందుబాటులోకి వచ్చే నాటికే, చైనా కంపెనీలు 4జీ సదుపాయం ఉన్న చౌక ఫోన్లను విజయవంతంగా తయారు చేయగలిగాయి. దాంతో భారత మార్కెట్‌లోకి శరవేగంగా ఆ ఫోన్లను ప్రవేశపెట్టగలిగాయి. చూస్తుండగానే అనేక మంది 3జీ నుంచి 4జీ ఫోన్లకు మారిపోయారు. ఫలితంగా భారతీయ బ్రాండ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.