New Trend in UP Elections: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ ఫిల్మ్ ‘పుష్ప’కు సోషల్ మీడియాలో పాన్ ఇండియా వైడ్ గా ఏర్పడిన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని ఇండస్ట్రీల సెలబ్రిటీలు, క్రికెటర్లతో పాటు సామాన్యులు ఈ చిత్రంలోని పాటలు, డైలాగ్స్ ట్రై చేస్తున్నారు. తమంతట తాము ట్రై చేసి ఇన్ స్టా రీల్స్ చేస్తున్నారు. అవి నెట్టింట బాగా వైరలవుతున్నాయి కూడా. కాగా, తాజాగా రాజకీయాల్లోకి ‘పుష్ప’ క్రేజ్ వెళ్లిపోయింది.

ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం కోసం కాంగ్రెస్ పార్టీ ‘పుష్ప’ సినిమలోని ‘శ్రీ వల్లి’ సాంగ్ ట్యూన్ కాపీ చేసింది. ఈ సాంగ్ ను ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయగా, అది ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. ‘చూపే బంగారమాయేనే శ్రీవల్లి’ సాంగ్ మ్యూజిక్ ను యాజ్ ఇట్ ఈజ్ గా ఉంచి లిరిక్స్ ప్లేస్ లో యూపీ గొప్పతనం అభివర్ణిస్తూ పాట కంపోజ్ చేశారు. ‘తూ హై గజాబ్ యూ యూపీ.. తేరీ కసమ్ యూపీ’ అంటూ ఉత్తర ప్రదేశ్ అందాలను అభివర్ణిస్తూ అక్కడి వీరులు రాణీ లక్ష్మీ బాయి, ఇతర వ్యక్తుల గురించి, రాష్ట్రం గొప్పతనం గురించి వివరిస్తూ పాటను రూపొందించారు.
ఉత్తరప్రదేశ్ వాసులు అయినందుకుగాను ఉత్తరప్రదేశ్ వాసులు గర్వించాలనే సందేశానిచ్చారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చివరకు అభ్యర్థన చేశారు. అలా కాంగ్రెస్ పార్టీ ఓటర్లను ఆకర్షించేందుకుగాను వినూత్నమైన ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. మొత్తంగా ‘పుష్ప’ సినిమా పాటను ఇలా ఎన్నికల ప్రచారం కోసం వాడుతుండటం చూస్తుంటే ఈఫిల్మ్ నార్త్ ఇండియా ఆడియన్స్ ను కూడా బాగా అట్రాక్ట్ చేసిందన్న విషయం స్పష్టంగా అర్థమవుతున్నదని సినీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Also Read: చలో విజయవాడకు పోలీసులు కూడా సాయం చేశారా?
ఇకపోతే ఉత్తర ప్రదేశ్ లో తామే మరోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. యోగి ఆదిత్యానాథ్ మళ్లీ సీఎం అవుతారని ఈ సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కాగా, తాము ఈ సారి బలంగా పోరాడుతున్నామని, తామే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ పార్టీ నేతలూ చెప్తున్నారు. చూడాలి మరి.. చివరకు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో.. ఎవరు అధికారం చేపడుతారో..
यूपी वाला होने पर गर्व है।#सुप्रभातUP pic.twitter.com/WuSxv9o67a
— UP Congress (@INCUttarPradesh) February 4, 2022
Also Read: బీజేపీకి భయపడని కేసీఆర్.. జగన్‌కు భయమా?