Saamanyudu: నటీనటులు : విశాల్, డింపుల్ హయతి, రాజా, బాబూరాజ్, తులసి, రవీనాదేవి, మనోహర్, యోగిబాబు తదితరులు
దర్శకత్వం : తు.ప. శరవణన్
సంగీతం : యువన్ శంకర్ రాజా
ఛాయాగ్రహణం : కెవిన్ రాజా
ఎడిటింగ్ : ఎన్.వి.శ్రీకాంత్
నిర్మాత : విశాల్

తమిళ స్టార్ హీరో విశాల్, డింపుల్ హయతి జంటగా నటించిన కొత్త సినిమా ‘సామాన్యుడు’. ‘నాట్ ఏ కామన్ మ్యాన్’ అనేది ఉపశీర్షిక. విశాల్ తన సొంత బ్యానర్ ‘విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ’పై నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం రెండు భాషల్లో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ చూద్దాం.
Also Read: కేసీఆర్ ను నమ్మి అనుభవించా.. జగన్ కుర్రాడు ఆ తప్పు చేశాడు.. నారాయణ సంచలనాలు
కథ :
పోరస్ (విశాల్) మధ్య తరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన కుర్రాడు. అయితే, పోలీస్ ఆఫీసర్ కావాలనుకునే ఈ సామాన్య యువకుడు అసలు అన్యాయాన్ని సహించలేడు. ఇక తన తండ్రి పోలీస్ కానిస్టేబుల్. అయితే, ఆ తండ్రి కొడుకు ఆవేశానికి అడ్టకట్టవేయాలని ప్రయత్నిస్తుంటాడు. అంతలో అనుకోకుండా పోరస్ చెల్లెలు ద్వారక (రవీనాదేవి) హత్యకు గురవుతుంది. ఈ క్రమంలో కొన్ని ఊహించని పరిణామాలతో తన చెల్లెలుతో పాటు మరికొన్ని హత్యలు కూడా జరుగుతాయి. అసలు వాటి వెనుక కొన్ని రాజకీయ శక్తులు ఏమిటీ ? వాటిని ఛేదించి, హత్యల వెనుకున్న హంతకుల్ని బైటికి లాగి.. పోరస్ తన రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు ? అనేది అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :
విశాల్ కొత్త సబ్జెక్టులతో వచ్చినా ఆడియెన్స్ ను మాత్రం మెప్పించలేకపోతున్నాడు. అయితే, తన సినిమాల్లో ఆశించే యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు బలమైన ఎమోషన్స్ ను కూడా యాడ్ చేసి.. విశాల్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. దర్శకుడి సహజమైన టేకింగ్ బాగుంది. విశాల్ కూడా తన పాత్రలో చాలా కరెక్ట్ గా సెట్టయ్యాడు. కామన్ మ్యాన్ గా సింపుల్ గా కనిపిస్తూ మంచి ఎమోషన్స్ ను పండించాడు.
ఇక హీరయిన్ గా నటించిన డింపుల్ హయాతి కూడా చాలా బాగా నటించింది. అయితే, ముఖ్యంగా విశాల్ కి సోదరి పాత్రలో నటించిన రవీనా మంచి నటనను కనబరిచింది. కానీ ఈ సినిమా నిడివి మరీ ఎక్కువుగా ఉంది. పైగా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కూడా లేదు. ఇక సాగదీత సీన్స్ కూడా బాగా విసిగించాయి.
కాగా సినిమాలో నిర్మాణ విలువలు బాగున్నాయి. అలాగే కెవిన్ రాజ్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ఇంకా బెటర్ గా ఉండాల్సింది. నేపథ్య సంగీతం బాగుంది. ఇక దర్శకత్వం వరకూ చాలా బాగుంది.
ప్లస్ పాయింట్స్ :
నటీనటుల నటన,
టేకింగ్,
విజువల్స్,
కొంత యాక్షన్ డ్రామా,
మైనస్ పాయింట్స్ ;
కథాకథనాలు,
ఓవర్ బిల్డప్ డ్రామా,
ఇంట్రెస్టింగ్ సాగని యాక్షన్ సీన్స్,
రొటీన్ నేరేషన్,
సంగీతం.
సినిమా చూడాలా ? వద్దా ?
‘ఎమోషనల్ యాక్షన్ డ్రామా’లను ఇష్టపడే ప్రేక్షకులకు ఖాళీ టైం దొరికితే ఈ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చు. ఇక మిగిలిన ప్రేక్షక మహాశయులు ఈ సినిమాను చూడక్కర్లేదు.
రేటింగ్ : 2/5
Also Read: మార్చి 4న ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ !
[…] Samantha: నాలుగేళ్ల తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికాక, సమంత సరికొత్త ప్రయాణం మొదలు పెట్టింది. భవిష్యత్తు పట్ల అనేక ఆశలు, ఆశయాలతో ముందడుగు వేస్తూ కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతుంది. ఐతే, ఆ ఆశలు, ఆశయాల వెనుక అనేక కష్టాలు ఉంటాయి. అయినా.. తనకు ఆ కష్టాలు ఏమి కొత్త కాదు అంటుంది ఈ క్రేజీ బ్యూటీ. గతంలో తన జీవితంలో అనేక ఆర్థిక ఇబ్బందులు, అనేక కష్టాలు ఉన్నాయని సామ్ తాజాగా ఎమోషనల్ అవుతూ చెప్పింది. […]